For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు, జుట్టు రాలడం, బట్టతలను నివారించే 10 భారతీయ నూనెలు..!

|

మన భారతీయ మహిళలకు జుట్టు లేదా జడ అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతాయి. అంతే కాదు మన ఇండియన్ స్త్రీలకు మందపాటి..పొడవాటి జుట్టు ఉండటం సహజం. మరి ఎంత అందమైన జుట్టు ఉన్న మంచి మెరుపుతో, నల్లగా ఉన్నప్పుడే ఆ కేశాలకు మరింత ఆకర్షణ. ఇలా భారతీయ స్త్రీలు జుట్టును ఆకర్షించేలా చేయడానికి కారణం వారి పెద్దల నుండి వచ్చిన జీన్సా ? లేదా వారు ఉపయోగించే నూనెలా?అయితే ఇవి రెండూనూ జుట్టు సంరక్షణకు వర్థిస్తాయి. అయితే, అలా కాకుండా కొంత మంది కేశాలను గమనించినట్లైతే వారి జుట్టు గ్రే కలర్ లో లేదా వైట్ కలర్ లో లేదా బూడిద వర్ణంలో ఉండటం గమనించే ఉంటాం. ఇలా ఉండే జుట్టు వారి తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వచ్చే జుట్టును ఏవిధంగాను నియంత్రిలేము. అయితే, జుట్టు ఆరోగ్యకరమైన పెరుగుదలకు మరియు జుట్టు సంరక్షణ కోసం కొన్ని భారతీయ నూనెలో అద్భుతంగా సహాయపడుతాయి. ఈ నూనెలు జుట్టు పెరుగుదలకు మరియు జుట్టు బలంగా ఉండటానికి మరియు మందంగా పెరిగేలా చేస్తాయి.

జుట్టుకు పెరుగుదల కోసం ఉపయోగించే నూనెల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఎన్ని రకాల నూనెలున్నప్పటికి జుట్టుకు సంబంధించనంత వరకూ నేచురల్ గా పెరిగేలా చేసే నూనెలు మన ఇండియన్ ఆయిల్సే. ఈ ఆయుర్వేద జుట్టు రహస్యాన్ని పురాతన గ్రంథాలలో రాసినట్లు చెప్పబడింది. ఆయుర్వేదంలో చాలా రకాల మూలికా తైలాలు ఉన్నాయి. అవి మీ హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది మరియు జుట్టుకు కోవల్సిన పోషణను అందించడానికి సహాయపడుతాయి.

జుట్టు పోషణకు వివిధ రకాల భారతీయ నూనెలు ఉన్నాయి. అందులో కొన్ని జుట్టు పెరుగుదలతో పాటు జుట్టు రంగును(నల్లగా) మార్చే నూనెలు కూడా ఉన్నాయి. జుట్టు పెరుగుదలకు మరికొన్ని సాధారణ నూనెలు( కొబ్బరి నూనె మరియు బాదాం నూనె) వంటివి ఉన్నాయి. ఇంకొన్ని హెర్బల్ ఆయిల్స్(బ్రహ్మి ఆయిల్ మరియు బ్రింగ్ రాజ్ ఆయిల్స్)వంటి నూనెలో తలకు..తల మాడుకు చల్లదనాన్నిచ్చి..చుండ్రు నివారిణులుగా సహాయపడుతాయి.

తల మాడుకు రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేయడం మరియు తలలోపలి బాగానికి ముని వేళ్ళతో మసాజ్ చేయడం వల్ల నాణ్యమైన జుట్టును మీరు పొందవచ్చు. మరి జుట్టు పెరుగుదల మరియు పోషణకు హెడ్ మసాజ్ కు కొన్ని ఇండియన్ ఆయిల్ ఉపయోగించి ప్రయత్నించండి. మీ జుట్టు పెరుగుదలలో మార్పుకు ఆశ్చర్యపడక తప్పదు. మరి ఆ ఆయిల్స్ ఏంటో ఒకసారి చూద్దామా..

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

ఆమ్లా ఆయిల్(ఉసిరి నూనె): జుట్టు పోషణకు ఆమ్లా ఆయిల్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఆమ్లా ఆయిల్ ను తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు తగినంత పోషణ అందివ్వడంతో పాటు మంచి నేచురల్ కండీషనర్ గా పనిచేస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

మందార నూనెలు: హైబిస్కస్ హెయిర్ ఆయిల్ కేశాలకు మంచి రంగును అందించడంతో పాటు కేశాలకు ఒక చక్కటి ఆక్రుతిని ఏర్పరుస్తుంది. కొన్ని సార్లు ఎండ వేడికి, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల, దుమ్మ దూళి వల్ల చాలా అసహ్యాంగా బ్రౌన్ కలర్ లో కనబడుతుంది. అందుకు హైబిస్కస్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల హెల్తీ హెయిర్ మరియు బ్లాక్ హెయిర్ తిరిగి పొందవచ్చు . కేశాలు రంగు మారడాన్ని నిరోధించవచ్చు.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

కొబ్బరి నూనె: మన భారత దేశంలో చాలా వరకూ కేశ సంరక్షణకు ఉపయోగించే నూనెలో కొబ్బరి నూనె ప్రధానమైనది. కొబ్బరి నూనెలోని ఓమేగా 3 యాసిడ్స్ హెయిర్ రూట్స్ కు చక్కటి పోషణను అందిస్తుంది. అంతే కాదు జుట్టు మందంగా మరియు వేగవంతంగా పెరుగడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

బాదాం నూనె: బాదాం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ గ్రోత్ కు బాగా సహాయపడుతుంది. ఇది కూడా కొబ్బరి మరియు ఆమ్లా నూనెలు మాదిరే ఉంటుంది. అతి త్వరగా జుట్టు పెరగాలనుకొనే వారు బాదాం నూనెను ప్రతి రోజూ తలకు పట్టించాలి.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

బ్రహ్మి ఆయిల్: బ్రహ్మి ఆయిల్లో జుట్టుకు మరియు శరీర సంరక్షణకు ఉపయోగపడే బహుళ ప్రయోజనాలున్నాయి. బ్రహ్మి ఆయిల్ తో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు మూలాలలకు మరియు తల మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది . అంతే కాదు ఇది చుండ్రును తొలగించడానికి ఉపయోగపడుతుంది . ఇంకా బ్రహ్మి ఆయిల్ బ్రెయిన్ ఫంక్షన్స్ కు మరియు మెమరీ బాగుంటుంది.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

బ్రింగ్ రాజ్(Bhringraj Oil): ఈ నూనె చాలా శక్తివంతమైన జుట్టు పెరుగుదలకు సహాయపడే మూలికా నూనె. అంతే కాదు ఇది జుట్టు పెరగడానికి మరియు బట్టతల వస్తున్నా ఈ నూనె సహాయపడుతుంది. బట్టతల లక్షణాలు కనబడుతున్నట్లైతే కొన్ని చుక్కల బ్రింగ్ రాజ్ ఆయిల్ తో తలకు తరచూ మసాజ్ చేయండి.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

హెన్నా హెయిర్ ఆయిల్: చుండ్రును వదిలించడంలోనూ మరియు నేచురల్ కండీషనర్ గాను హెన్నా లీవ్స్ తో తయారు చేసే నూనె అద్భుతంగా పనిచేస్తుంది. చుండ్రు లేకుండా సున్నితమైన సిల్కీ హెయిర్ ను పొందవచ్చు.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

యూకలిప్టస్ ఆయిల్: యూకలిప్టస్ ఆయిల్ లోని ఔషధగుణాలు మనందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈ ఆయిల్ ను హెయిర్ కూడా అప్లై చేస్తారు. తలలో చుండ్రు మరియు ఇతర ఇన్ఫెక్ష నుండి కేశాలకు రక్షణ కల్పిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

నువ్వుల నూనె: నువ్వుల నూనె యాంటీ డాండ్రఫ్ ఆయిల్. అయితే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది. చుండ్ర వల్ల తలలోని చర్మ రంద్రాలు మూసుకుపోయి. జుట్టు కణాలకు గాలి సోకకుండా చేస్తుంది. కాబట్టి నువ్వుల నూనె డాండ్రఫ్ ను వదలగొడుతుంది. దాంతో కేశాలు ఆరోగ్యంగా పెరగుతాయి.

ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

మస్టర్డ్ ఆయిల్(ఆవనూనె): మందపాటి జుట్టు..నల్లటి జుట్టు పొందాలంటే మస్టర్డ్ ఆయిల్ ను ఉపయోగించవచ్చ. మస్టర్డ్ ఆయిల్ తలలో బ్లడ్ సర్కులేషన్ పెంచి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది.

English summary

Indian Oils For Hair Growth n Colour | ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు 10 భారతీయ నూనెలు..!

Indian women are known for their thick and dark hair. So how do people from the subcontinent have hair as black as the midnight sky? Is it just good genes or the magic of Indian oils for hair care? Actually it is a bit of both. You have no control over the kind of hair you inherit from your parents. However, Indian oils for hair care can go a long way to make your hair long, strong and thick
Story first published: Tuesday, April 23, 2013, 17:24 [IST]
Desktop Bottom Promotion