For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ ఫాల్, చుండ్రు అనేక సమస్యలకు కాకరకాయ

|

జుట్టు సంరక్షణకు ఒక ఉత్తమ హోం రెమెడీ బిటర్ గార్డ్ (కాకర కాయ)జ్యూస్. కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. అటువంటి కాకరకాయ చర్మం సంరక్షణకు మరియు శరీర సంరక్షణకు అనేక ప్రయోజనాలు చేకూర్చుతుంది. అంతే కాదు, అనేక జుట్టు సమస్యలకు మంచి చికిత్సను అంధిస్తుంది. కాకరకాయ రసంతో హెయిర్ కేర్ ట్రీట్మెంట్ వల్ల జుట్టుకు ఒక మంచి షైనింగ్ మరియు కేశాలకు దీర్ఘాయువును అంధిస్తుంది. చేదుగా ఉండా ఈ కాకర కాయ కేశాలకు ఏవిధంగా సహాయపడుతుందని మీకు ఆశ్చర్యం కలగవచ్చు, అందుకే కొన్ని విషయాలను మీతో బోల్డ్ స్కై పంచుకుంటోంది..

జుట్టు సంరక్షణలో కాకరకాయను మీరు ఉపయోగించడానికి, మీరు ఖచ్చితంగా ఒక ఇంట్లో ఉండే ఒక నేచురల్ పదార్థంతో మిక్స్ చేయాలని గుర్తుంచుకోవాలి. చేదుగా ఉండే కూరగాయలను లేదా కూరగాయల రసాన్ని నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి, జుట్టుకు ప్యాక్ వేసుకొన్నప్పుడు, మీరు మరిన్ని అదనపు ప్రయోజనాలు పొందవచ్చు . కాకరకాయ రసంలో అత్యధికంగా ప్రోటీలు కలిగి ఉంటాయి, ఇవి మీ జుట్టును స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతాయి. కాకరకాయ రసాన్ని ఇతర సహజ పదార్థాలతో మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకొన్నప్పుడు, ఈ ప్యాక్ కనీసం ఒక గంట సేపు అలాగే ఉంచుకోవాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

జుట్టు సంరక్షణలో కాకరకాయ జ్యూస్ ఎలా ఉపయోగించాలి, ఏవిధంగా ఉపయోగపడుతుంది అని ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి. కాకరకాయ రసాన్ని ఉపయోగించి హెయిర్ ప్యాక్ వేసుకొని ఒక అద్భుతమైన విలాసవంతమైన జుట్టును సహజంగా పొందండి..

1. జుట్టుకు మంచి షైనింగ్:

1. జుట్టుకు మంచి షైనింగ్:

మీ జుట్టుకు నేచురల్ గా మంచి షైనింగ్ రావాలంటే, ఒక కప్పు తాజా కాకరకాయ రసంలో పెరుగు మిక్స్ చేసి మీ జుట్టుకు అప్లై చేయాలి. ఈ రెండు వస్తువులు మీ జుట్టుకు ఒక నేచురల్ మరియు బ్యూటిఫుల్ షైనింగ్ ను అంధిస్తాయి.

2. జుట్టు చివర్లు చిట్లడాన్ని నిరోధిస్తుంది:

2. జుట్టు చివర్లు చిట్లడాన్ని నిరోధిస్తుంది:

మీ జుట్టు చివర్లు చిట్లడంతో బాధపడుతుంటే, ఈ సమస్యను నివారించడం కోసం కాకరకాయ జ్యూస్ ను మీ జుట్టుకు అప్లై చేయాలి. కాకరకాయ రసం మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల చిట్లడం తగ్గుతుంది మరియు తిరిగి సహజ జుట్టులా పెరుగుతుంది . జుట్టు చిట్లడాన్ని తగ్గించడం కోసం ఈ పద్దతిని వారానికి రెండు సార్లు ప్రయత్నించాలి.

3. చుండ్రు నివారణకు:

3. చుండ్రు నివారణకు:

ప్రస్తుత రోజుల్లో ఆహారం మరియు వాతావరణం, కాలుష్యం వల్ల చుండ్రు సాధారణ సమస్యగా మారుతోంది. కాకర కాయ రసంతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల చుండ్రు నివారించుకోవచ్చు. కాకరరసం మరియు జీలకర్రను మిక్స్ చేసి తలకు పట్టించడం ద్వారా ఒక నెలలోపు మీరు ఈ సమస్య నుండి బయటపడగలుగుతారు.

4. పొడి బారిన జుట్టు:

4. పొడి బారిన జుట్టు:

పొడిబారిన జుట్టు మరీ దురదగా ఉంటుంది. దురదతో పాటు ఇతర హెయిర్ సమస్యలకు కూడా ఏర్పడుతాయి. ఈ పొడి జుట్టును నివారించడానికి, తాజాగా ఉండే ఒక కాకర కాయ ముక్కను తలమాడుకు బాగా రుద్దాలి. కాకరకాయ ముక్కతో తలలో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. మొటిమల నివారణకు:

5. మొటిమల నివారణకు:

స్లాప్ పింపుల్స్ (తలలో చిన్న చిన్న మెటిమలు)ఉండటం వల్ల తలలో అదనపు చెమటకు దారితీస్తుంది. కాబట్టి మీ తలను చాలా చల్లగా ఉంచుకోవాలి. కాకరకాయ, మరియు కీరదోస కాయ రెండూ మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేసి తలకు అప్లై చేయాలి. ఇది స్లాప్ పింపుల్స్ కు ఒక ఉత్తమ నివారినిగా పనిచేస్తుంది. ఇది మీ జుట్టుకు ఒక సున్నితత్వాన్ని కలిగిస్తుంది.

6. తలలో దురద:

6. తలలో దురద:

దరుదగా ఉండే తలకు ఇది ఒక బెస్ట్ హోం రెమడీ. ఈ కాకరకాయ జ్యూస్ ను అవొకాడో లేదా అరటిపండుతో మిక్స్ చేసి తలకు హెయిర్ ప్యాక్ లా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దురదను పోగొట్టుకోవడానికి వారానికి ఒకసారి అప్లై చేయాల్సిందే.

7. రెగ్యులర్ హెయిర్ కేర్ కోసం:

7. రెగ్యులర్ హెయిర్ కేర్ కోసం:

మీ జుట్టు చాలా రఫ్ గా ఉన్నప్పుడు ఒక కప్పు కాకరకాయ రసంను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ హోం రెమడీ మీ మీ జుట్టు నిర్మాణం చదును మరియు మృదువైన తయారుచేస్తుంది.

8. తెల్ల జుట్టుకు:

8. తెల్ల జుట్టుకు:

చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటం ప్రస్తు రోజుల్లో ఎక్కువ మంది చూస్తున్నాం. ఈ సమస్యకు కాకరకాయ రసంతో చికిత్స అందించవచ్చు. తాగా ఉండే బిటర్ వెజిటేబుల్ రసాన్ని మీ తెల్ల జుట్టు మూలాలకు అప్లై చేయాలి. ఇలా ప్రతి 10రోజులకొకసారి చేయడం వల్ల తెల్ల వెంట్రుకల సమస్యను నివారిస్తుంది.

 9. జిడ్డు గల జుట్టు:

9. జిడ్డు గల జుట్టు:

మీరు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జుట్టులో అదనపు ఆయిల్ ఏర్పడి కేశాలు జిడ్డుగా కనిపిస్తాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఆయిల్ కంటెంట్ తగ్గించుకుంటే తప్పని సరిగా తలలో జిడ్డును తొలగించుకోవచ్చు . కాకరకాయ రసంలో ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల అదను నూనె తొలగిపోతుంది.

10. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:

10. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:

మీ దువ్వెను ఎక్కువగా వెంట్రుకలు ఊడి, చుట్టుకొన్నప్పుడు మీకు బాధగా అనిపిస్తుంది. చాలా మందిలో హెయిర్ లాస్ చాలా సాధారణ సమస్య. జుట్టు సమస్య నివారించుకోవడం కోసం కాకరకాయ జ్యూస్ లో కొద్దిగా పంచదార మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ నేచురల్ గా తగ్గించుకోవచ్చు.

English summary

Karela Juice For Hair Care

The best natural home remedy for your hair is karela or bitter gourd. The juice of the karela is not only good for the skin and body, but is also good in treating hair problems. Hair care treatment through karela will provide the best shine, no hair problems and longevity too.
Desktop Bottom Promotion