For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

By Super
|

జుట్టు తేమగా కనిపించాలి అనుకునే అందరు ఫాషనిష్టులకు ఇక్కడ కొన్ని దుర్వార్తలు ఉన్నాయి. అది చూడడానికి, గొప్పగా ఉన్నప్పటికీ, తడి జుట్టు ప్రధానంగా అనేక విపత్తులకు దారితీస్తుంది. వర్షాకాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ తరచుగా వస్తాయి. ఆమ్ల వర్షం, మురికి వర్షం, గాలిలో తేమ శాతం పెరిగి మీ జుట్టు, తలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిఉంటుంది.

మీరు ప్రపంచంలో ఏ ప్రాంతం నుండి వచ్చినవారైనా సరే, ఈ క్రింద ఇచ్చిన చిట్కాలు, ట్రిక్కులు వర్షాకాలంలో మీ జుట్టు, తల సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడతాయి.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

కేశాలంకరణ ఉత్పత్తులను ఉపయోగించడం తగ్గించండి:

మీకు సహజంగా ఆరోగ్యకరమైన జుట్టు లేకపోతే, మీరు స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేవారని పూర్తిగా అర్ధమౌతుంది. అయితే, వర్షాకాలంలో ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండడం మంచిది. అదనపు తేమ కారణంగా ఈ రసాయన ఉత్పత్తులు మీ జుట్టు అధికంగా జిడ్డు ఉండేటట్లు చేస్తాయి. ఇది మీ జుట్టుకు, తలకు హానికలిగిస్తుంది. ఈ గ్లం, జెల్ చుండ్రుకు దారితీస్తుంది.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

మీ జుట్టును పొడిగా ఉంచండి:

సాధ్యమైనంత ఎక్కువ సమయం మీ జుట్టు పొడిగా ఉంచేందుకు ప్రయత్నించండి. సాధారణంగా మనం షుమారు 50-60 వెంట్రుకలను కోల్పోతాము, కానీ వర్షాకాల సమయంలో మనకు తెలియకుండా 200 వెంట్రుకలను కోల్పోతాము. ఇది అదనంగా జుట్టు రాలడ౦, చుండ్రు వంటి జుట్టు సమస్యలను నివారించి మీ జుట్టు ఎప్పుడూ పొడిగా ఉండేటట్లు చేస్తుంది.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

తేలికపాటి షాంపూ లను ఉపయోగించండి:

మీరు చుండ్రు, జుట్టురాలడమే కాకుండా తల జిడ్డుదనాన్ని కూడా కలిగిఉ౦డవచ్చు. అందువల్ల మీరు మీ జుట్టును ప్రతిరోజూ తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి. ఆయిలీ జుట్టు కలవారు ప్రతిరోజూ షాంపూ పెట్టడానికి వేరొక కారణం కూడా ఉంది, మీ జుట్టు వర్షాకాలంలో దెబ్బతినవచ్చు, షాంపూ చేయడం వల్ల మాత్రమే మీ జుట్టు పరిమాణాన్ని పునరుద్దరించు కుంటుంది. ప్రతిరోజూ మీ జుట్టు వర్షానికి తడిస్తే ప్రతిరోజూ షాంపూ పెట్టండి.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

మీ ఆహారాన్ని గమనించండి

ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహార పదార్ధం. అయితే, మీ జుట్టు అందంగా కనిపించాలి అనుకుంటే, చేపలు, గుడ్లు, కారెట్లు, తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ కూరగయలు, చిక్కుళ్ళు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాలుత్పత్తుల వంటి ఎక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

క్రమం తప్పక కండిషనింగ్ చేయడం ఎంతో ముఖ్యం

గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల జుట్టు ముతకగా, పొడిబారి చిక్కుపడేటట్లు చేస్తుంది. ప్రతిరోజూ కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు చిక్కుపడకుండా చక్కగా ఉండడానికి సహాయపడుతుంది.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

ఎక్కువ నీరు త్రాగడం : అన్ని చిట్కాలలో కల్లా ముఖ్యమైనది, మొట్టమొదటిది మిమ్మలిని మీరు హైడ్రేటెడ్ ఉంచుకోండి. జుట్టు కుదుళ్ళు గట్టిగా, మృదువైన కేశాలు ఉండాలంటే మీరు ద్రవాలిని ఎక్కువగా తీసుకోండి. మీరు తీసుకునే నీటి స్థాయిని పెంచండి.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

కనీసం వారానికి ఒకసారి జుట్టుకు నూనె రాయడం : వారంలో ఒక సారి తలకు నూనెతో మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

పెద్ద పళ్ళ దువ్వేనను ఉపయోగించడం: పెద్ద పళ్ళు ఉన్న దువ్వెను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ కలగ కుండా ఉంటుంది. చిక్కు సులభంగా వస్తుంది.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

జుట్టు తడిగా ఉన్నపుడు బిగి౦చకుండా ఉండడం: జుట్టు తేమగా ఉన్నప్పుడు ముడి వేసుకోవడం వల్ల కేశాలు పెళుసుగా తయారవుతాయి. జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

బ్లో డ్రయ్యర్ ఉపయోగించే ముందు మీ జుట్టును పొడిగా ఉంచడం : బ్లో డ్రయ్యర్ ను ఉపయోగించే ముందు మీ జుట్టు పొడిగా ఉంచుకోవాలి. దాంతో పాటు బ్లో డ్రయ్యర్ దూరంగా ఉపయోగించాలి.

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు

దువ్వేనను ఇతరులకు ఇవ్వొద్దు : మీరు ఉపయోగించే దువ్వెను ఇతరకు ఇవ్వకుండా జాగ్రత్త తీసుకుంటే, అనేక జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు.

English summary

Monsoon Hair Care Tips

For all of you fashionistas out there who love to sport the wet hair look, there’s some bad news. Although it may look and feel great, wet hair can lead to major hair woes.
Desktop Bottom Promotion