For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో కేశ సౌందర్యానికి తీసుకొనే జాగ్రత్తలు

వేసవిలో కేశ సౌందర్యానికి తీసుకొనే జాగ్రత్తలు

|

వేసవికాలంలో చర్మ సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో... అదే విధంగా జుట్టు సంరక్షణకు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడికి చర్మం తర్వాత ఎక్కువగా సూర్యుని బారిన పడేది వెంట్రుకలే. ఎండ వేడిమి కారణంగా వెంట్రుకలు నిర్జీవంగా తయారవుతాయి. సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్‌ కిరణాల కారణంగా కొనలు చిట్లి, పొడిబారినట్లు కనిపిస్తాయి. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ కురులు పట్టుకుచ్చుగా వుంటాయి. అందుకోసం.. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి రాసినట్లుగానే జుట్టుకు లేదా మాడుకు కూడా కొంచెం సన్‌స్క్రీన్ లోషన్ రాయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎండకు మాడు చుర్రుమనదు.

అయితే... ఇలా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకున్నప్పుడు ఇంటికి రాగానే లేదా రాత్రి పడుకోబోయే ముందు తలస్నానం చేయాల్సి ఉంటుంది. అలా సాధ్యం కానప్పుడు ఆ లోషన్లకు బదులుగా కొబ్బరినూనెతో మర్దనా చేయాలి. ఇక.. తలస్నానానికి చివరగా జట్టును నిమ్మరసం కలిపిన నీటితో తడపడం వల్ల జట్టు దృఢంగా మారుతుంది.

అయితే వేసవికాలంలో పొడి జుట్టుకు నిమ్మరసం వాడినట్లయితే మరింత నిర్జీవంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి.. పొడి జుట్టు కలిగిన వారు కాఫీ డికాషన్ లాంటి కండీషనర్లను వాడటం మంచిది. అలాగే, తలస్నానం పూర్తయిన తరువాత కండీషనర్ వాడకాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. వేసవి కోసం ప్రత్యేకంగా సన్‌స్క్రీన్ ఉన్న కండీషనర్లు మార్కెట్లో దొరుకుతాయి కూడా.

Dry Hair

మూడు కప్పుల మంటినీటిలో రెండు కప్పుల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి... ఈ మిశ్రమాన్ని తలస్నానం పూర్తయ్యాక చివరగా జుట్టుకు పట్టించాలి. చుండ్రు సమస్య ఉన్నవారయితే... ఈ మిశ్రమాన్ని జట్టుకే కాకుండా, జుట్టు కుదుళ్లకు కూడా బాగా పట్టించాలి. ఇలా చేసినట్లయితే జట్టుకు మంచి కండీషనింగ్ లభించటమేగాకుండా, చుండ్రు నుంచి దూరం కావచ్చు.

ఇక వేసవిలో ఈతను ఇష్టపడేవారు... స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లడం పరిపాటి. అయితే స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరిన్ కలుపుతారు, ఉప్పునీరు కూడా ఉండవచ్చు. ఇలాంటప్పుడు పూల్‌లో దిగడానికి ముందుగానే తలను మంచినీటితో తడుపుకోవాలి. జట్టు తగినంత నీరు పీల్చుకున్న తరువాత ఉప్పు నీరు, లేదా క్లోరిన్ నీటిని పీల్చుకోదు కాబట్టి సమస్య ఉండదు. అయితే స్విమ్మింగ్ పూర్తయిన తరువాత ఇంటికొచ్చి శుభ్రంగా తలస్నానం చేయడం మాత్రం మరువవద్దు.

వేసవిలో రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు ఇతర ప్రాడెక్టుల వాడకాన్ని తగ్గించాలి. ముఖ్యంగా హెయిర్‌ డ్రైని వాడకూడదు. హెయిర్‌ స్ప్రేలు వాడటం తగ్గించాలి.

వేసవిలో చెమట నుంచి జుట్టును రక్షించేందుకు రెండురోజులకొకసారి షాంపూ చేయాలి. షాంపూ చేసిన ప్రతిసారీ కండీషనర్‌ ను తప్పనిసరిగా వాడాలి. ఇవి జట్టులోని తేమను కోల్పోకుండా నిగనిగలాడేలా చేయడమేకాక ఒత్తుగా, పట్టుకుచ్చులా ఉండేలా చేస్తుంది.

వేసవి వచ్చేసరికి అందరూ స్విమ్మింగ్‌ పట్ల ఆసక్తి చూపుతారు. స్విమ్మింగ్‌ పూల్‌ నీళ్లలో కలిపే క్లోరిన్‌ జుట్టుకు హాని కలిగిస్తుంది. కాబట్టి స్విమ్మింగ్‌ క్యాప్‌ తప్పనిసరిగా ధరించాలి.

వేసవిలో చెమట కారణంగా చుండ్రు సమస్య మరింత అధికమవుతుంది. కొబ్బరినూనెను కానీ మరే ఇతర హెయిర్‌ ఆయిల్‌ ను కాని గోరువెచ్చగా చేసి కురులకు పట్టించి మర్దనా చేసి టవల్‌ ను గట్టిగా చుట్టాలి. తర్వాత షాంపూ చేయాలి.

కొబ్బరినీళ్లు, పళ్లరసాలు, సలాడ్లను తరచూ తీసుకుంటుండాలి. ఇవి చర్మం ఇంకా కేశాలు పొడిబారకుండా నిగారింపు సంతరించుకునేలా చేస్తాయి.

ఎక్కువ మోతాదులో నీరును తాగాలి. శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పంపబడుతుంది కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం చాల మంచిది.

English summary

Natural Hair Care Tips for Summer | వేసవిలో కేశ సౌందర్యానికి తీసుకొనే జాగ్రత్తలు

Natural hair care for summer is very easy compared to other seasons. Your hair follicles are in the growth phase during the hot season and you have to protect your hair from the heat. You also have to keep certain basics in your mind. Never expose your hair to direct sunlight and always bathe with cold water in the summers.
Desktop Bottom Promotion