For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పట్టుకుచ్చులా మెరిపించే కురుల సౌందర్యానికి ఇంట్లోనే హెయిర్ స్పా...!

వాతావరణ నిమిత్తం లేకుండా జుట్టు రాలకుండం ..లేదా నిర్జీవంగా ఎండు గడ్డిలా కనిపించడం...కొందరిలో నిత్యం ఉండే సమస్యే . ఇలాంటివాటిని నివారించి పట్టుకుచ్చులా మేరిపించేలా చేయడంలో...హెయిర్ స్పా చికిత్స గురించి

|

వాతావరణ నిమిత్తం లేకుండా జుట్టు రాలకుండం ..లేదా నిర్జీవంగా ఎండు గడ్డిలా కనిపించడం...కొందరిలో నిత్యం ఉండే సమస్యే . ఇలాంటివాటిని నివారించి పట్టుకుచ్చులా మేరిపించేలా చేయడంలో...హెయిర్ స్పా చికిత్స గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందుకోసం ప్రత్యేకంగా స్పాలకే వేళ్ళాలనిలేదు. కొన్నిరకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచుకుంటే ఇంట్లోనే కురులకు స్పా చికిత్స చేసుకోవచ్చు.

ఈ చికిత్స చేసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య అదుపులో ఉంటుంది. సిరోజాలు పట్టుకుచ్చులా, ఆరోగ్యంగా మారతాయి. చివర్ల చిట్లకుండా కూడా ఉంటాయి. కుదిరితే వారానికోసారి కూడా చేసుకోవచ్చు .ఈ చికిత్స చేసుకున్న తరవాత రెండురోజులవరకు షాంపూ పెట్టకుండా ఉండాలి. జుట్టును ఆరబెట్టేందుకు హెయిర్ డ్రయ్యర్ కాకుండా మెత్తని తువాలుతో తుడిచేసుకోవాలి.

Hair Care
1. ఆయిల్ మసాజ్ /హెర్బల్ స్పా : ఈ చికిత్స చేసుకునే ముందు జుట్టు పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఏదయినా హెర్బల్ నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసుకోవాలి. కనీసం ఇరవై నిమిషాలపాటు సవ్య, అసవ్య దిశలో మర్దన చేయాలి.

2. ఆవిరి పట్టాలి: హాట్ ఆయిల్ మసాజ్ తర్వాత వేడి నీటిలో వెడల్పాటి టర్కీ తువాలును ముంచి దాన్ని తలకు చుట్టుకోవాలి. దీనివల్ల జుట్టుకు ఆవిరి అందుతుంది.

3. కండీషనర్: పదినిమిషాలయ్యాక తీసేసి హెర్బల్ కండిషనింగ్ ప్యాక్ ని జుట్టుకు పూతలా వేసుకోవాలి. ఇది మార్కెట్లో లభ్యం అవుతుంది. అయితే తలకు గాలి తగలకుండా షవర్ క్యాప్ ను పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీరు ,హెర్బల్ షంపూతో కడిగేసుకోవాలి .అయితే జుట్టు తడిగా ఉన్నప్పుడే హెర్బల్ హెయిర్ స్పా క్రీంను రాసుకోవాలి. ఇది కూడా బజార్లో లభించే ఉత్పత్తే . దీన్ని రాసుకున్న పదినిమిషాల తరవాత కడిగేసుకోవాలి. ఈ చికిత్స వల్ల పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు జుట్టు ఆరోగ్యంగా , పట్టుకుచ్చులా కనిపిస్తుంది.

4. జెల్ స్పా: ఈ చికిత్స కూడా తలకు నూనె రాసుకోకుండా చేసుకోవాలి. నాలుగు చెంచాల కలబంద గుజ్జు, చెంచా చొప్పున బాదం నూనె ,గులాబి నూనె. మైట్లి నూనె (బజార్లో లభిస్తుంది)లను తీసుకోవాలి. ఈ నూనెల్ని కలబంద గుజ్జుకు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట మర్దన చేయాలి. తర్వాత వేడినీటిలో ముంచిన తువాలును తలకు చుట్టుకోవాలి. పదినిమిషాలు అలాగే వదిలేసి ఆ తరవాత జెల్ ఆధారిత షాంపూతో కడిగేసుకోవాలి. జుట్టు తడి ఆరకుండానే జెల్ స్పా క్రీంను రాసుకుని పదినిమిషాలయ్యాక కడిగేసుకోవాలి.

5. ఎగ్ స్పా: నాలుగు చెంచాల ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి అందులో కప్పు తెల్లగుడ్డు సోన చేర్చి బాగా గిలక్కోట్టినట్లు చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని పదిహేను నిమిషాలు మర్దన చేసుకోవాలి. ఇప్పుడు వేడి నీటిలో ముంచిన తువాలును చుట్టుకోవాలి. కాసేపయ్యాక తీసేసి కోడిగుడ్డు ఆధారిత షాంపూతో తల స్నానం చేయాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడే హెయిర్ స్పా క్రీంను రాసుకుని పది నిమిషాలు తరవాత కడిగేసుకోవాలి.

6. పండ్లతో హెయిర్ స్పా: ఆరెంజి, నల్ల ద్రాక్ష నూనెలను సమానంగా తీసుకుని గోరువెచ్చగా చేసి తలకు రాసుకోవాలి. కనీసం పదిహేను నిమిషాలు మర్దన చేసి గోరువెచ్చని నీటిలో ముంచిన తువాలును చుట్టుకోవాలి. కురులు తడిగా ఉన్నప్పుడే యాపిల్, అరటిపండు, కమలాఫలాల గుజ్జు, గోరింటాకు పొడి... కప్పు చొప్పున తీసుకుని అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాని జుట్టు చివర్ల దాక పట్టించి గాలి తగలకుండా షవర్ కేప్ పెట్టేయాలి. నలభై ఐదునిమిషాల తరవాత నీళ్ళతో చుండు నివారణ షాంపూతో కడిగేసుకుని ఆ తరవాత ఫ్రూట్ స్పా క్రీం ను రాసుకోవాలి. పది నిమిషాలాగి దాన్ని కూడా కడిగేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చుండ్రు సమస్య అదుపులో ఉంటుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది.

7. కలర్ స్పా: జుట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారు దీన్ని ప్రయత్నించవచ్చు. ముందుగా తలస్నానం చేసుకోవాలి. తడి పూర్తిగా ఆరిపోయాక.. నప్పే కలర్ స్పా క్రీం ను సరిపడేంత తీసుకుని మాడుకు కాకుండా జుట్టుకు మాత్రమే పట్టించాలి. నలభై ఐదునిమిషాల తరవాత స్పా కలర్ కంట్రోల్ షాంపూతో కడిగేసుకోవాలి. తడి ఆరకుండానే స్పా కండిషనింగ్ క్రీంను రాసుకుంటే సరిపోతుంది. మరో పదినిమిషలయ్యాక నీళ్ళతో దాన్నీ తొలగించుకోవాలి. తరచు కలర్ కంట్రోల్ షాంపూను వాడడం వల్ల వేసుకున్న రంగు ఎక్కువ రోజులు జుట్టుకు పట్టి ఉంటుంది. ఈ చికిత్సల్లో ఉత్పత్తులన్నీ బజార్లో లభిస్తాయి.

English summary

Steps To Get A Hair Spa Treatment At Home | పట్టుకుచ్చులా మెరిపించే కురుల కోసం హెయిర్ స్పా...!

The belief in the therapeutic powers of mineral waters dates back to many centuries. The word 'spa' has its roots in ancient Roman & Greek civilizations which basically stands for a healing bath in mineral-rich spring water. A hair spa is not just about pampering the hair with a massage. It also provides nutrients to the hair, with a variety of packs. The five essentials are: hair oil, massage, shampoo, conditioner & hair mask.
Desktop Bottom Promotion