For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కర్లింగ్ హెయిర్ ను సాఫ్ట్ గా..షైనీగా మార్చకోవడం ఎలా...

|

కర్లి హెయిర్(రింగుల జుట్టు)ఎల్లప్పుడూ ట్రెండీగా మరియు ఫాషన్ గా కనబడుతుంది. అంతే కాక, మీకు తక్కువ జుట్టు ఉన్నట్లైతే లేదా మీ జుట్టు లిప్ ఉంటే, వాటిని కర్ల్ చేయడానికి కొంత వాల్యూమ్ ను జోడించాల్సిన అవసరం ఉంది. అయితే కూడా మీ రింగుల జుట్టుకు సరైజ జాగ్రత ఇస్తే కానీ, ఈ రింగు జుట్టు ఆకర్షనీయంగా ఉంటుంది. కర్లింగ్ హెయిర్ కు సాధారణంగా హీట్ ట్రీట్మెంట్, డ్రైయర్స్ మరియు రోలర్స్ ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం లేదా జుట్టు ఎండిపోవడానికి లేదా పొడిబారడానికి దారి తీస్తుంది. రింగు రింగుల జుట్టు సాధారణంగా ఉండే జుట్టుకంటే పెళుసుగా ఉండటమేగాకుండా, పొడి పొడిగా ఉంటుంది. అదే విధంగా సాధారణ జుట్టుకంటే రింగుల జుట్టు వాతావరణ పరిస్థితులకు వెంటనే ప్రభావితం అవుతుంది. కాబట్టి రింగుల జుట్టు ఉన్నవారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

కర్లింగ్ హెయిర్ కు కెమికల్స్ మరియు లో క్వాలీటీ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మీ జుట్టుకు హాని కలిగించే ప్రభావం ఎక్కువ. కఠినమైన రసాయనాలు మరియు వేడి చుండ్రుకు, జుట్టు చికాకు మరియు ఇతర చర్మ సమస్యలకు కారణమవుతుంది. అందుకోసం ఇక్కడ మీ కర్లింగ్ హెయిర్ మృదువైన మరియు మెరిసి ఉంచేందుకు మీ కోసం కొన్ని సులభంగా చిట్కాలు అంధిస్తున్నాం. పరిశీలించండి...

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

షాంపుతో షవర్ బాత్: షాంపూతో వారానికోసారైనా తప్పకుండా తల స్నానం చేయాలి. దానివల్ల జిడ్డులేకుండా ఉంటుంది. మాయిశ్చరైజింగ్‌ షాంపూ అయితే జుట్టుని పొడిగా ఉంచడానికి తోడ్పడుతుంది. వారంలో వీలయినన్ని సార్లు షాంపూతో తలస్నానం చేసినా జుట్టు జిడ్డులేకుండా ఆరోగ్యంగా కనిపిస్తుంది. షాంపూ వాడని రోజుల్లో జుట్టుని వేడినీటితో కడగాలి. దీనివల్ల పోషణ ఇచ్చే సహజనూనె పదార్థాలు కోల్పోకుండా జట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

కర్లింగ్ హెయిర్ కు తరచూ మాయిశ్చరైజ్: తలస్నానానికి మాయిశ్చరైజంగ్ షాంపూ అయితే మరీ మంచిది. కర్లింగ్ హెయిర్ ను మాయిశ్చరైజ్ గా ఉంచడం చాలా అవసరం. రెగ్యులర్ మాయిశ్చ్యరైజ్ వల్ల జుట్టు ఎండిపోకుండా మరియు parched గురికానివ్వదు. రెగ్యులర్ గా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేయడం వల్ల కర్లింగ్ హెయిర్ మృదువుగా మరియు మెరిస్తూ ఉంటుంది.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

కేశాలు తమగా ఉన్నప్పుడు హెయిర్ స్టైల్: తలస్నానం తర్వాత, తలలోని నీటిని మొత్తాన్ని పిండేయాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడే మీకు కావల్సిన హెయిర్ స్టైల్ ను (మీకు నచ్చిన విధంగా దువ్వుకొని)తర్వాత జుట్టు ఆరనివ్వాలి. ఇది దీర్ఘకాలం అందంగా మరియు కర్లింగ్ హెయిర్ మృదువుగా ఉండటానికి జుట్టుకు సహాయం చేస్తుంది.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం: నాణ్యతలేని ఉత్పత్తులు, కఠిన రసాయనాలతో తయారు చేసిన ఉత్పత్తులు కర్లింగ్ హెయిర్, తలమాడు మీద ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. బలమైన రసాయనాలు దీర్ఘకాలం పాటు ఉపయోగించడం వల్ల అది మీ జుట్టుకు చాలా ప్రమాధకరంగా మారుతుంది. మరి మీ రింగుల జుట్టును మృదువుగా మరియు మెరిసేలా ఉంచుకోవాలంటే, మీ కేశాలకు నప్పే, మంచి క్వాలిటి ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ ను మాత్రమే ఉపయోగించాలి.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్ తలలో చర్మంపైపొర మూసివేయుండా ఉంచడానికి మరియు కర్లింగ్ హెయిర్ ను మృదువుగా ఉంచడానికి సహాయపడుతుంది . గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి, తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటిని తలమీద పోసుకోవాలి. ఇది మీ కేశాలను తడుపుతూ మీ కేశాలకు కండీషనర్ గా పనిచేస్తాయి.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

బేకింగ్ సోడా: బేకింగ్ సోడాలో ఆల్కలీన్ ఉంటుంది. ఇది మీ చర్మం పైపొరను పెంచడానికి మరియు మీ కర్లింగ్ హెయిర్ మృదువుగా మరియు సాప్ట్ గా చేయడానికి సహాయపడుతుంది . కాబట్టి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను, మూడు చెంచా కర్లీ ఫ్రెండ్లీ కండీషనర్ లో వేసి తలకు అప్లై చేయాలి. గోరు వెచ్చని నీటితో తలమీద పోసుకోవాలి.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

ఎయిర్ డ్రై కర్ల్స్: మీ కేశాలను సహజంగా తడి ఆరబెట్టుకోవాలి. ఒక వేళ మీరు ఆతురుతలో ఉంటే, డ్రైయర్ ను తక్కువ హీట్ లో పెట్టి తడి ఆరుపుకోవచ్చు. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత వల్ల మీ కేశాలను పెళుసుగా లేదా కర్లింగ్ హేయిర్ రఫ్ గా మారడం చేస్తుంది. కాబట్టి మీ హెయిర్ కు అతి తక్కువ వేడి వర్తింపజేస్తే మీ కర్లి హెయిర్ మరింత తేమ కలిగి ఉంటుంది.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

ఆల్కహాల్: ఆల్కహాల్‌ కలిగి ఉన్న ఉత్పాదనలను వాడడం వల్ల జుట్టు పొడిగా మారుతుంది. అందువల్ల రింగుల జుట్టు ఉన్నవారు ఆల్కహాల్‌ ఉన్న ఉత్పాదనలను వాడకుండా ఉండడం మంచిది. రింగుల జుట్టుని మరింత ఆకర్షణీయంగా మార్చు కోవాలంటే నిపుణుల సహాయం తీసుకోవాలి.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

కలబంద: షాంపూతో తలస్నానం చేసిన తర్వాత అలొవెరా ఆకులను పేస్ట్ చేసి, ఆ మిశ్రమాన్ని తడి జుట్టుకు పట్టించండి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోండి. అలొవెరా రసం మీ జుట్టుకు కావలసినంత కండిషన్ లభించేలా చేస్తుంది. దీంతో మీరు కోరుకున్నట్టు జుట్టు సిల్కీగా అవుతుంది.

మీ కర్లింగ్ హెయిర్ మరింత సాఫ్ట్ అండ్ షైనీ..

యాంటిప్రిజ్ సిరమ్: అయితే స్నానం చేసిన తరువాత రింగుల జుట్టును సహజంగానే గాలికి ఆరనివ్వాలి. అలా కాకుండా డ్రయ్యర్‌నుగనుక వాడితే జుట్టు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అసలే రింగు రింగులుగా ఉన్న జుట్టు మరింతగా రింగులు తిరగకుండా ఉండేందుకు యాంటిప్రిజ్ సిరమ్‌ను ఉపయోగించటం ఉత్తమం. ఈ సిరమ్‌ను జుట్టు కుదుళ్లనుంచీ రాస్తే సరిపోతుంది.

English summary

Tips To Keep Your Curls Soft & Shiny

Curly hair always goes with any trend and fashion in one way or the other. Moreover, if you have less hair or if your hair is limp, making curls will give a feeling of added volume. But, your curls will remain appealing only if you give proper care to your hair.
Story first published: Tuesday, June 11, 2013, 12:39 [IST]
Desktop Bottom Promotion