For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడాన్ని నివారించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

జుట్టు రాలడాన్ని నివారించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

|

ప్రస్తుత కాలంలో జీవనశైలి మారడం, క్రమబద్ధత లేని ఆహారం తీరు, ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలు - ఇవన్నీ జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే, పాతికేళ్లకే జుట్టు రాలడం మొదలవుతోంది. ప్రతి మనిషికీ అందం నిగ నిగలాడే నల్లటి జుట్టు. ముఖానికి అందాన్నిచ్చే జుట్టు రాలడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రోజుకు కొంత జుట్టు రాలడం సహజం. మళ్లీ వీటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంది. రోజుకు సుమారుగా 40 నుంచి 60 వెంట్రుకలు రాలుతుంటాయి. ఇంత కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

జుట్టు రాలే సమస్యను కొంత మంది బయటకు చెప్పుకోలేరు. దాని నుండి త్వరగా విముక్తి పొందాలని మార్కెట్‌లో లభించే రకరకాల నూనెలు, షాంపులు, సబ్బులు, క్రీములు, లోషన్‌లపై దృష్టి సారిస్తారు. వీటిపై సరైన అవగాహన లేక ఆశతో వాటిని ఎక్కువగా మార్చి మార్చి వాడడం వల్ల జట్టు రాలడం తగ్గకపోగా, సమస్య ఇంకా తీవ్రమవుతుంది. ఇతర ఇన్‌ఫెక్షన్లకు కూడా దారి తీస్తుంది.

కారణాలు: పోషకపదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులు. థైరాయిడ్‌ లోపాలు ఉండడం. మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం. నిద్రలేమితో బాధపడడం. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతినడం వల్ల చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్లలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, కొందరిలో శరీర తత్త్వం వల్ల కూడా జుట్టు రాలుతుంది.

నివారణ: జుట్టు నిర్మాణానికి, ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే కీలకం. ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్తపడటం ముఖ్యం. హార్మోన్ల సమతౌల్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలి. జుట్టు రాలడాన్ని అరికట్టే, హార్మోనుల సమతుల్యతను సహాయపడే కొన్ని ఆహారాలు మీకోసం..

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

చేపలు : సముద్రంలో ఉండే చేపలకు మనిషి జుట్టుకు కొన్ని లింక్స్‌ ఉన్నాయి. వలలో చిక్కుకోకుండా తప్పించుకోవడంలో చేప ఎక్స్‌పర్ట్‌. రెగ్యురల్‌గా చేపలను ఆహారంలో భాగంచేసుకుంటే మీ జుట్టు కూడా చిక్కులలో చిక్కుకోవు.. చేపలలో ఉండే విటమిన్‌ డి ఆరోగ్య వంతమైన కురులకోసం ఉపయోగకర మైనవే కాకుండా, ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్‌తో సమృద్ధం. ఇది నాన్‌వెజ్‌ హెయిర్‌ థెరపీ.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

చికెన్‌ చికెన్‌ తింటే న్యూట్రీషన్స్‌తో పాటు విటిమిన్స్‌ ఫ్రీ. జుట్టు ఎదుగుదలకు దోహదం చేసే ప్రోటీన్స్‌కూడా సమృద్ధం. ఇది చికెన్‌ థెరపీ.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

క్యారెట్ : రేటు తక్కువ .. రేంజ్‌ ఎక్కువ. అం దమైన కళ్లకు, దృష్టికి తోడ్పడటంతో పాటు శరీరాన్ని డిటాక్సికేట్‌ చేస్తుంది. చిరుతిళ్లు తినాలనిపించినప్పుడు ఒకటి రెండు క్యారెట్స్‌ను తినండి. కొన్ని రోజుల్లోనే అందమైన మార్పును మీరూ గమనిస్తారు.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

వెజిటేబుల్స్ : వెజిటేబుల్స్‌ తక్కువేం కాదు ఆకుపచ్చ రంగులో ఊరించే బ్రకోలీ, పాలకూరల వంటి ఆకు కూరల వల్ల డబుల్‌ బెనిఫిట్‌. ఒకటి వీటిని తరచూ మీ ఆహారంలో భాగం చేయడం వల్ల ఎ, సి , కె వంటి విటమిన్లతో పాటు ఐరన్‌, కాల్షియం సము పాళ్లలో అందుతుంది. రెండవది మీ జుట్టుకు మంచి కండీషన ర్‌గా కూడా పనిచేస్తాయి.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

బాదం: రోజుకో ఆపిల్‌ తీసుకుంటే డాక్టర్‌ వద్దకు వెళ్లే అవసరం లేదనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం బాదాంకు కూడా వర్తిస్తుంది. రోజుకు గుప్పెడు బాదాంలను తింటే కేవలం జుట్టుకే లాభం కాదు మీ గుండెకు కూడా మంచిది. టాపిక్‌ హెయిర్‌ గురించి కాబట్టి బాదాం వల్ల మీ హెయిర్‌ సరికొత్త మెరుపును సంతరించుకోవడంతో పాటు, జుట్టు రాలిపోవడం వంటి సవుస్యలు ఎదురుకావు.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

పాలు: తెల్లగా ఉండే పాలు నల్లని జుట్టుని ఎలాంటి మ్యాజిక్‌ చేయగలవు అని సందేహం రావుచ్చు మీకు. నిజానికి పాల వల్ల శరీరానికి కాల్షియంతో పాటు జుట్టుకు కూడా బోలెడు లాభాలు. జుట్టు చిక్కులుపడకుండా దానికి చేతనెైనంతగా అది కృషి చేయడంతో పాటు సరికొత్త కేశ కళను లిగించడంలో మీకు ఎంతో తోడ్పడుతుంది. డ్రైహేయిర్‌ ను మంచి కండీషన్‌లో తీసుకురావాలనుకుంటే మాత్రం పాలను నమ్ముకోవడం బెస్ట్‌.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

ఆరెంజ్: మనకు లభ్యమయ్యే అన్ని ఆహార పదార్థాల్లో కంటే ఉసిరిలో నాణ్యమైన విటమిన్ సి పుష్కలంగా లభ్యమవుతుంది. ఇక నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. బత్తాయి, నారింజ పండ్లు ఎక్కువగా తినేవారిలో జుట్టు రాలడం ఒకింత తక్కువే. శరీరానికి కావాలసినంత ఫైబర్ కంటెంట్ ను అంధించడంతో కురులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కేశలాను దృఢంగా పెరిగేలా చేసే రూట్ కెనాల్ కు కావలసినంత బీటా కెరోటిన్ అంధిస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

ఆకుకూరలు: మన ఆహారంలో పుష్కలమైన ఐరన్ కోసం గుడ్డు, డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీపుడ్స్, వంటి వాటిపై ఆధారపడవచ్చు. ఇక మాంసాహారంలో అయితే కాలేయం. కిడ్నీల్లో ఐరన్ చాలా ఎక్కువ. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువని తెలుసుకుని మీ ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలాచూసుకోండి.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

గుడ్డు: మన శరీర ఆరోగ్యానికి అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల్లో గుడ్డు ప్రధానమైనది. గుడ్డులో కావల్సినన్ని అత్యవసర పోషక ఆమ్లాలు, జింక్, మరియు ఐరన్ కలిగి ఉంటాయి. మరో ముఖ్య విసయంలో ఇందులో లభించే జింక్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. కురులు స్ట్రాంగ్ ఉంచి హెయిర్ పాల్ ను అరికడుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

వాల్ నట్స్: వాల్ నట్స్ చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఇది మనం చిరుతిండిగా తినేటటువంటి ఓ నట్. దీనిలో కూడా విటమిన్ ఇ అధికంగా ఉండి, తల మాడుకు రక్త ప్రసరణను బాగా అందజేస్తుంది. అంతే కాదు వాల్ నట్స్ లో జింక్ అధిక శాతం కలిగి ఉంటుంది. జింక్ శరీరానికి అంధించడం వల్ల కేశాలకు మంచి మెరుపు వస్తుంది.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

అరటి/మెగ్నీషియం: మెగ్నీషియం కూడా ఆరోగ్యకరమైన కురుల పెరుగుదలకు బాగా దోహదపడుతుంది. అందుకు అరటి పండులో కావల్సినన్ని మినిరల్స్ అందుతాయి. తర్వాత అత్తిపండ్లు మరియు ఆర్టిచోక్స్ లో కూడా అధికంగా మెగ్నీషియం ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

గుమ్మడి/జింక్ కోసం: జుట్టుకు అవసరమైన జింక్ కోసం.. ఏదో ఒక రూపంలో గుమ్మడి గింజలు మీ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారంలో జింక్ తో పాటు, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషేన్ సిఫార్సు చేస్తోంది. జింక్ కు ఆహార పదార్థాలన్నింటిలోనూ పుష్కలమైన వనరు గుమ్మడి గింజలే.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

డైరీ ప్రొడక్ట్స్: ఈ డైరీప్రొడక్ట్స్ ను రోజు వారి ఆహారంలో తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ బలమైన, పొడవైన జుట్టు పెరుగుదలకు ఈ హెల్తీ ఫుడ్స్ ను మీ డైలీ డయట్ లో చేర్చుకోవాలి. డైరీ ప్రోడక్ట్స్ లో బి5, విటమిన్ డి మరియు ఎక్కువ క్యాల్షియం కలిగి ఉంటాయి

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

ఓయిస్ట్రెస్: సీ ఫుడ్ లో ఒకటైన ఓయిస్ట్రెస్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అత్యంత పోషకాలు కలిగిన ఆహారాల్లో గుడ్డు, బీఫ్ మరియు ఒయిస్ట్ర్స్. జింక్ లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి మీ డైలీ డయట్ లో జింక్ ఉన్న ఆహారాలు ఓయిస్ట్ర్స్ తీసుకోవడం వల్ల కురులు వేగంగా పొడవుగా పెరగడానికి సహాయపడుతాయి.

జుట్టు రాలడాన్ని తగ్గించే టాప్ 15 సూపర్ ఫుడ్స్ ..!

స్ట్రాబెర్రీ/ ఫోలిక్ ఆసిడ్: ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా అంటే విటమిన్ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అందుకు ఆరెంజ్, స్ట్రాబెర్రీ, దోసకాయ, పుచ్చకాయ, రాస్ బెర్రీ, అవకాడో, మరియు అరటి పండ్లను తినడం వల్ల కురుకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందుతుంది. దాంతో కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

English summary

Top 15 Super Foods to Prevent Hair Loss.!

Hair loss affects both men and women and can be caused by heredity, stress, malnutrition and high levels of dihydrotestosterone (DHT). Whether you are losing your hair or just want longer or thicker hair, eating fruits high in certain vitamins and minerals, such as vitamins C and E, can promote hair growth.
Desktop Bottom Promotion