For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవిలో మీ తలను..కేశాలను.. చల్ల..చల్లగా ఉంచుకోవడం ఎలా..!?

|

ఇండియన్ సమ్మర్ ఒక్క చర్మ మీద మాత్రమే కఠినమైన ప్రభావం చూపడం కాదు..కేశాల మీద కూడా చూపెడుతుంది. శరీరం నుండి వేలువడే వేడి అపారంగా జుట్టుకు నష్టం కలిగిస్తుంది. వేసవి కాలంలో ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల మీ కేశాలను పొడిబారేలా చేయడంతో పాటు మీ తల మండేలా చేస్తుంది. అందువల్ల, ఈ వేసవి కాలంలో మీ తల మాడుతో పాటు కేశాలను కూడా చల్లగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను తెలుసుకోండం చాలా ముఖ్యం. తలను ఆరోగ్యంగా మరియు చల్లగా ఉంచుకోవడం అనేది ఈ వేసవి కాలంలో హెయిర్ కేర్ లో తీసుకొనే జాగ్రత్తల్లో ప్రధాన అంశాల్లో ఒకటి.

మీ జుట్టును తలను చల్లగా ఉంచుకోవడం మరియు ఈ వేసవిలో ఎటువంటి హెయిర్ సమస్యలు లేకుండా ఉండాలంటే సరైన సమ్మర్ హెయిర్ కేర్ చిట్కాలను అనుసరించాల్సిందే...

Hair Care

డైలీ హెడ్ బాత్: హెయిర్ ఫాల్ కు ప్రధాన కారణం హార్డ్ వాటర్ అని నమ్ముతారు. అందుకే ప్రతి రోజూ తలస్నానం చేసుకోవడం లేదు. వారంలో రెండు మూడు సార్లు తలస్నానం చేయడం అనేది సాధారణం. అయితే వేసవికాలో హెడ్ టు టాయ్స్ వరకూ ప్రతి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. ఎప్పుడైతే మీరు తలస్నానం చేసుకుంటారో మీ స్లాప్ ఆరోగ్యకరంగా ఉండటమే కాదు తలలోని చర్మం క్రింద ఉండే వేడి బయటకు విడుదలవుతుంది.

స్కార్ఫ్: వేసవి కాలంలో డైరెక్ట్ సన్ లైట్ నేరుగా తలమీద పడకుండా జాగ్రత్త వహించాలి. అందుకు తలకు స్కార్ఫ్ వంటివి కట్టుకోవడం మంచిది. తలకు మరియు కేశాలకు కవర్ అయ్యేలా స్కార్ఫ్ ను కట్టుకోవడం వల్ల వేసవి హెయిర్ ఫాల్ ను అరికట్టవచ్చు.

చల్లటి హెయిర్ ఆయిల్ ను తలకు పట్టించాలి: కొన్ని రకాల నూనెలు అశ్వగంధ, ఆమ్లా మరియు బ్రహ్మి వంటి నూనెలు జుట్టుకు చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నూనెలు సహజ చల్లదనాన్ని అందించేవిగా పనిచేస్తాయి. ఈ సమ్మర్ లో మీ కేశాలను చల్లగా ఉంచుకోవాలంటే ఈ స్మూతింగ్ హెయిర్ ఆయిల్స్ ను ఉపయోగించాలి. అయితే ఈ ఆయిల్స్ ను పగలు మాత్రమే జుట్టుకు పట్టించాలి.

చెమటను నివారించుకోవాలి: ఎప్పుడైతే చెమటతో మీ తల నిండుతుందో అప్పుడు కేశ రంధ్రాలను అండ్డుకుంటుంది. దాంతో జుట్టు రాలడం మొదలవుతుంది. కాబట్టి మీరు మీ తలకు చెమట పట్టించదని భావిస్తారో అప్పుడు వెంటనే ఒక రుమాలు తీసుకొని చెమటను తుడిచేసుకోవాలి.

మింట్ బేస్డ్ షాంపూను ఉపయోగించాలి: కేశాలకు తలకు చల్లదనాన్ని కలిగించే నేచురల్ కూలెంట్స్ ను ఉపయోగించడం మంచిది . ఉదా: షాంపూలు. కొన్ని మెడికేటెడ్ షాంపూలు పుదీనాతో తయారు చేయబడి ఉంటాయి. ఇవి శరీరంలోని వేడి బయటకు నెట్టివేయడటానికి బాగా సహాయపడుతాయి. అంతే కాదు కలబంద లేదా కీరదోసతో తయారు చేయబడ్డ షాంపూలను కూడా ఉపయోగించవచ్చు.

బ్లో డ్రైయర్స్ ను ఉపయోగించకూడదు: చాలా మందిలో జుట్టు రాలడానికి ప్రధాన కారణం బ్లో డ్రయ్యర్స్ ఉపయోగమే. బ్లోడయ్యర్ నుండి వెలువడే వేడి తలకు వేడి అనుభూతి చేస్తుంది. కాబట్టి వేసవికాలంలో పూర్తిగా బ్లో డ్రయ్యరు ఉపయోగాన్ని మానుకొని సహజంగా కేశాలు ఆరబెట్టుకోవాలి.

English summary

Ways To Keep Hair Cool In Summer | వేసవిలో మీ తలను..కేశాలను.. చల్ల..చల్లగా ఉంచుకోవడం ఎలా..!?

The Indian summer is not only harsh on your skin but also on your hair. Accumulated sweat and body heat causes immense hair loss. The scorching sunlight dried out your hair and burns your scalp.
Desktop Bottom Promotion