For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు సంరక్షణలో మీరు పాటించే చెత్త పద్ధతులు.!

|

చాలా మంది హెయిర్ కేర్ చాలా సింపుల్ అని, కేశాలకు గురించి ప్రత్యేకంగా శ్రద్ద తీసుకోరు. జుట్టు సంరక్షణలో వివిధ రకాల పద్ధతులను పాటించడం వల్ల జుట్టుకు మేలు జరగడం కంటే, హానే ఎక్కువ జరుగుతుందన్న విషయాన్ని చాలా అలస్యంగా గ్రహించగలుగుతారు. బామ్మలు చెప్పారని జుట్టు గట్టిగా ముడి వేయడం లేదా టైట్ గా జడను అల్లడం వల్ల కేశాలకు ఎటువంటి హాని జరగదని చాలా మంది అనుకుంటారు. కానీ కేశాలను టైట్ గా ముడివేయడం లేదా బ్యాండ్స్ తో బింగించడం ద్వారా జుట్టుయొక్క మొదళ్ళు (హెయిర్ ఫోలిసెల్స్)డ్యామేజ్ అవుతాయి. దాంతో హెయిర్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఇంకా హెయిర్ ఫాల్ కూడా జరగవచ్చు.

అదే విధంగా, జుట్టు సంరక్షణకు ఉపయోగపడే అనేక రకాలైన పద్ధతులు మరియు టెక్నిక్స్ ఉన్నాయని అనుకుంటారు. కానీ నిజానికి అవి హానికరం కావచ్చు. కాకపోవచ్చు. మన జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. అయితే వాతావరణంలో మార్పులు మరియు కాలుష్యం మరియు ఇతర కారణాల వల్ల మనం ఎటువంటి హెయిర్ కేర్ పద్దతలు పాటించకపోయినా హెయిర్ కు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. వీటితో పాటు జుట్టు సంరక్షణలో మీరు పాటించే కొన్న చెత్త పద్దతులు ఇక్కడ ఇవ్వడం జరిగింది.

రెగ్యురల్ హెయిర్ కట్స్ ను నివారించాలి:

రెగ్యురల్ హెయిర్ కట్స్ ను నివారించాలి:

మీ కేశాలకు బాగా పెంచుకోవాలనుకొన్నప్పుడు రెగ్యులర్ హెయిర్ కట్ కన్నా ట్రిమ్ చేయడం ఉత్తమం. లేదంటే, మీ జుట్టు చివర్లు ఎక్కువగా చిట్లడం మీరు గమనించవచ్చు. మరియు జుట్టు చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది.

రెగ్యులర్ గా తలస్నానం:

రెగ్యులర్ గా తలస్నానం:

రెగ్యులర్ గా తలస్నానం చేయడం వల్ల తల శుభ్రంగా ఉంటుందని అనుకుంటారు. కానీ, రెగ్యులర్ తలస్నానం వల్ల తలలోని సహజనూనె గ్రంథులు పొడిఆరి జుట్టు పొడిగా మారుతుంది దాంతో జుట్టుకు డ్యామేజ్ అవుతుంది.

కండీషనర్ ను ఎక్కువగా వాడటం:

కండీషనర్ ను ఎక్కువగా వాడటం:

తలకు ఎక్కువగా కండీషన్ చేయడం కూడా ప్రమాదమే. ఓవర్ కండీషన్ వల్ల కేశాలు పొడిబారుతాయి. కేశాలకు పెరగనివ్వకుండా అడ్డుకుంటాయి. మరియు ఓవర్ కండీషన్ వల్ల జుట్టు నిర్జీవంగా, డల్ గా కనిపిస్తుంది.

తలకు కండీషన్:

తలకు కండీషన్:

చాలా మంది, వారికి తెలియకుండా చేసే పెద్ద తప్పు, కేశాలకు కాకుండా తల మాడుకు కూడా కండీషన్ ను అప్లై చేయడం. ఇది జుట్టును డ్యామేజ్ చేయడంతో పాటు, హెయిర్ ఫాల్ కు కారణం అవుతుంది.

హెయిర్ ను ఓవొర్ హీట్ చేయడం:

హెయిర్ ను ఓవొర్ హీట్ చేయడం:

మీరు రెగ్యులర్ గా హీటింగ్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటే కనుక, చివరకు మీ జుట్టు చిక్కుబడి, ముడుముడులుగా తయారువుతుంది. కాబట్టి కేశాల సంరక్షణకు సహజ పద్దతులు పాటించడం చాలా ముఖ్యం.

మెటల్ బ్రిస్టెల్ బ్రష్ లను వాడకాన్ని మానేయాలి:

మెటల్ బ్రిస్టెల్ బ్రష్ లను వాడకాన్ని మానేయాలి:

మెటల్ లేదా తిక్కుగా ఉన్న బ్రెష్యులను ఉయోగించడం మానేయాలి..

సహజ ఆక్రుతిని పొందడం:

సహజ ఆక్రుతిని పొందడం:

జుట్టు అందంగా ఉండటం కోసం స్ట్రెటనింగ్, కర్లింగ్ చేయించుకోవడం. ఈ ఎలక్ట్రానిక్ పద్దతులను రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టుకు అదికంగా డ్యామేజ్ జరుగుతుంది. మరియు మీ సహజ జుట్టులాగా ఎప్పటికి అనిపించదు.

స్టైలింగ్ ప్రొడక్ట్స్ :

స్టైలింగ్ ప్రొడక్ట్స్ :

కేశాల అందంగా తీర్చిదిద్దడం కోసం స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మీ జుట్టు చిక్కుబడటం లేదా ముడుగా ఏర్పడటం జరుగుతుంది. మీ కేశ తత్వాన్ని బట్టి స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవాలి.

హెయిర్ ప్రొడక్ట్స్ :

హెయిర్ ప్రొడక్ట్స్ :

మీరు మీ కేశాలకు ఉపయోగించే ఏ ప్రొడక్టైనా సరే మితంగా ఉపయోగించాలి. అధికంగా ఉపయోగించడం వల్ల జుట్టు జిడ్డుగా కనిపిస్తుంది.

ఎలాస్టిక్ బ్యాండ్స్:

ఎలాస్టిక్ బ్యాండ్స్:

జుట్టు ముడివేయడానికి ఎలాస్టిక్ బ్యాండ్స్ ను ఉపయోగించకూడదు. అవి సాగడం వల్ల మరియు వాటిని తీసేటప్పుడు హెయిర్ బ్రేకేజ్ అవుతుంది.

మీకు తగని హెయిర్ స్టైల్:

మీకు తగని హెయిర్ స్టైల్:

కొన్ని హెయిర్ కట్స్ మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల కూడా జుట్టుకు డ్యామే కలగవచ్చు. లేదా ప్రతి సారీ కొత్త కొత్త హెయిర్ కట్స్ ను చేయించుకోవడం కూడా జుట్టుకు నష్టం జరుగుతుంది.

ఎక్కువసార్లు దువ్వడం:

ఎక్కువసార్లు దువ్వడం:

జుట్టుకు ఎక్కువ సమయం లేదా ఎక్కువ సార్లు దువ్వడం వంటివి చేయడకూడదు.

అసలు దువ్వకుండానే ఉండటం:

అసలు దువ్వకుండానే ఉండటం:

కొంత మంది తమ జుట్టును రోజుకు ఒక్కసారి కూడా దువ్వకుండా ఉండిపోతారు. అటువంటి వారిలో కూడా హెయిర్ డ్యామేజ్ కు ప్రధాన కారణం.

తడి జుట్టును దువ్వడం:

తడి జుట్టును దువ్వడం:

తడిజుట్టును ఎప్పటికీ దువ్వకూడదు. ఒక వేళ అలా దువ్వానుకొంటే వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెనతో దువ్వుకోవాలి.

జుట్టు ఆరోగ్యం:

జుట్టు ఆరోగ్యం:

జుట్టుకు ఏదైన ఉత్పత్తులను అప్లై చేసినప్పుడు తప్పని సరిగా శుభ్రం చేసుకోవడం చాలా అవసరం.

English summary

Worst Things For Your Hair

You might think that hair care is very simple and does not take much effort. But what most people fail to realise is that, a number of your hair care practices might actually be doing more harm than good to your hair.
Story first published: Wednesday, September 18, 2013, 18:10 [IST]
Desktop Bottom Promotion