For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొడి మరియు నిస్తేజంగా ఉన్న జుట్టు కోసం 10 హెయిర్ మస్క్స్

By Super
|

మీరు పొడి మరియు నిస్తేజంగా ఉన్న జుట్టుతో పోరాటం చేస్తున్నారా? అయితే ఇక్కడ పూర్తిగా సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేసిన పది సూపర్ రిచ్ హెయిర్ మస్క్స్ ఉన్నాయి. ఇంట్లో వాటిని ప్రయత్నించి పొడవైన మరియు నునుపైన జుట్టును మీ సొంతం చేసుకోండి.

సంప్రదాయ హెన్నా ప్యాక్

సంప్రదాయ హెన్నా ప్యాక్

రాత్రంతా బ్లాక్ టీ లో హెన్నా కలిపి నానబెట్టాలి. ఉదయం దానిలో బాగా చిలికిన రెండు గుడ్ల సొన,నాలుగు స్పూన్ల పెరుగు,సగం నిమ్మకాయ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి లేదా ఆలివ్ నూనెను జోడించండి. దీనిని తలకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. అంతేకాక ఒక తేలికపాటి షాంపూను ఉపయోగించాలి.

ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్

ప్రోటీన్ రిచ్ హెయిర్ మాస్క్

ఒక గుడ్డు పచ్చసొన,ఒక టేబుల్ స్పూన్ ఆముదము,ఒక టేబుల్ స్పూన్ తేనే మూడింటిని కలపాలి. దీనిని జుట్టు మూలాల నుండి బాగా పట్టించాలి. ఒక ప్లాస్టిక్ షవర్ టోపీ లేదా ఒక టవల్ తో మీ తలను కప్పి ఉంచాలి. అరగంట తర్వాత శుభ్రం చేయాలి. చివరిగా ఆపిల్ పళ్లరసం వెనీగర్ తో శుభ్రం చేయాలి. ఒక వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ ను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

బనానా మాస్క్

బనానా మాస్క్

రెండు పండిన అరటి పండ్లను మాష్ చేసి దానిలో రెండు స్పూన్ల మయొనైజ్ మరియు ఒక స్పూన్ ఆలివ్ నూనె కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టు వాష్ చేయాలి. అరటి పండ్లు మృదువైన జుట్టుకు ప్రసిద్ది చెందింది. ఈ మాస్క్ నిస్తేజంగా మరియు కఠినమైన జుట్టు కలిగిన మహిళలకు అద్భుతంగా ఉంటుంది.

పొటాటో హెయిర్ మాస్క్

పొటాటో హెయిర్ మాస్క్

ఒక పెద్ద బంగాళాదుంప తీసుకోని పై తొక్క తీసి మిక్సి చేసి దాని నుండి రసం తీయాలి. ఈ రసంలో ఒక స్పూన్ కలబంద జెల్ కలపాలి. ఈ మిశ్రమం బాగా మృదువుగా అయ్యేవరకు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పదిహేను నిమిషాల పాటు జుట్టు మీద బాగా రుద్ది రెండు గంటల తర్వాత వాష్ చేయాలి. ఈ మాస్క్ జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. అంతేకాక హెయిర్ ఫాల్ మీద పోరాటం చేస్తుంది.

కొబ్బరి క్రీం మాస్క్

కొబ్బరి క్రీం మాస్క్

ఒక లేత ఆకుపచ్చ కొబ్బరి కాయలోని కొబ్బరిని తీసుకోని పేస్ట్ చేయాలి. దీనిని ఒక డిష్ లో ఉంచి కొద్దిగా వేడి చేసి నెమ్మదిగా మీ జుట్టు మూలాల నుండి మసాజ్ చేయండి. ఒక వెచ్చని తువ్వాలుతో మీ జుట్టును చుట్టి ఒక గంట వదిలివేయాలి. ఒక తేలికపాటి షాంపూ తో శుభ్రం చేసి,మీ జుట్టు సహజంగా పొడిగా అయ్యేటట్లు చేయండి. ఈ ప్యాక్ ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మీ జుట్టు ప్రకాశవంతముగా మారుతుంది.

అవోకాడో మాస్క్

అవోకాడో మాస్క్

అవెకాడో పండు గుజ్జు మరియు మయొనైజ్ లను 1:2 నిష్పత్తిలో తీసుకోవాలి. ఎందుకంటే ఇది మందపాటి మరియు భారీ నిర్మాణంతో ఉంటుంది. అవెకాడో పండు అనేది పొడి మరియు నిస్తేజంగా ఉన్న జుట్టుకు ఉత్తమ చల్లని సహజ నివారణలలో ఒకటిగా ఉన్నది. మీ జుట్టుకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి అరగంట తర్వాత కొళాయి నీటితో శుభ్రం చేయాలి.

మెంతి యాంటీ - డాండ్రఫ్ హెయిర్ మాస్క్

మెంతి యాంటీ - డాండ్రఫ్ హెయిర్ మాస్క్

రాత్రిపూట నీటిలో మెంతులను నానబెట్టాలి. తదుపరి రోజు మెత్తగా పేస్ట్ చేసి తల మీద చర్మం మరియు జుట్టు లోకి బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. మీరు చివరగా షాంపూ తో శుభ్రం చేయవచ్చు.

ప్రోటీన్ రిచ్ శనగపిండి ప్యాక్

ప్రోటీన్ రిచ్ శనగపిండి ప్యాక్

రాత్రిపూట మూడు స్పూన్ల మినుములను నానబెట్టి,మరుసటి రోజు మెత్తగా పేస్ట్ చేయాలి. దానిలో బాగా చిలికిన ఒక గుడ్డు,ఒక స్పూన్ నిమ్మరసం,ఒక కప్పు పెరుగు కలపాలి. దీనిని జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో వాష్ చేయాలి.

మందార హెయిర్ ప్యాక్

మందార హెయిర్ ప్యాక్

ఒక కప్పు ఎరుపు మందార రేకులను తీసుకోని రాత్రంతా నానబెట్టాలి. దానిని పేస్ట్ చేసి ఆలివ్ నూనెను జోడించండి. మీ జుట్టుకు బాగా పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే నునుపైన జుట్టు మీకు సొంతం అవుతుంది.


English summary

10 hair masks for dry and dull hair

Battling dry and dull hair? Here are ten super rich hair masks made out of natural ingredients completely. Try them at home and flaunt your long, lustrous and envious tresses with delight!
Desktop Bottom Promotion