For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో జుట్టు సంరక్షణ కోసం టాప్ 10 హోం రెమెడీస్

|

అన్ని సీజన్లలాగే వర్షాకాలంలో కూడా జుట్టు సంరక్షణ చాలా అవసరం . కఠినమైన కెమికల్స్ మరియు హెయిర్ స్ర్పేలు, జెల్లస్ మరియు ఇతర హెయిర్ ప్రొడక్ట్స్ ను తగ్గించాల్సిన సమయం మాన్ సూన్ సీజన్ (వర్షాకాలం). మరి అయితే వర్షకాలంలో జుట్టు ఆరోగ్యంగా మరియు సాఫ్ట్ అండ్ షైనీగా ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలి?

బాత్ రూమ్ షెల్ఫ్ లో కంటే కిచెన్ సెల్ఫ్ లో అనేక పదార్థాలు జుట్టు సంరక్షణలో అద్భుతంగా సహాయపడుతాయి. అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. మీ జుట్టు ప్రకాశవంతంగా ఒత్తుగా మెరుస్తుంటుంది. అందుకు ఈ క్రింద కొన్ని గొప్ప మార్గాలు, ఐడియాస్ ఉన్నాయి. మరి అవేంటో ఒక సారి చూద్దం...

తేనె-అరటిపండు

తేనె-అరటిపండు

వర్షాకాలంలో బాగా డ్రైగా లేదా చిక్కుబడి ఉండే జుట్టుకు తేనె-అరటి పండు మిశ్రమంతో తలకు పట్టించి 1గంట తర్వాత శుభ్రం చేసుకుంటే, జుట్టు ఎల్లప్పుడు పొడిపొడిగా మరియు సాఫ్ట్ గా ఉంటుంది.

పెరుగు-గుడ్డు

పెరుగు-గుడ్డు

రెండు చెంచాల పెరుగులో ఒక గుడ్డును వేసి బాగా మిక్స్ చేసి, తల స్నానం చేసిన తర్వాత కండీషనర్ గా అప్లై చేయవచ్చు. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీళ్ళతో శుభ్రం చేస్తే జుట్టు మంచి షైనింగ్ తో ఒత్తుగా సాఫ్ట్ గా ఉంటుంది.

నిమ్మరసం

నిమ్మరసం

ఆయిల్ ఫ్రీ హెయిర్ పొందాలంటే నిమ్మరసాన్ని తలకు పట్టించి15 నిముషాలు అలాగే ఉండి తర్వాత తలస్నానం చేయాలి. ఇది ఎఫెక్టివ్ హోం రెమెడీ మరియు చాలా సులభంగా ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువు.

తేనె-ఆయిల్ మాస్క్

తేనె-ఆయిల్ మాస్క్

లైట్ ఆయిల్(బాదం లేదా ఆలివ్ ఆయిల్) రెండు చెంచాలు. ఒక పార్ట్ తేనెను ఒక గిన్నెలో వేసి బాగా మిక్స్ చేయాలి . ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి . 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇది కండీషనర్ గా పనిచేస్తుంది మరియు జుట్టును రిపేర్ చేస్తుంది.

మయోనైజ్ మాస్క్

మయోనైజ్ మాస్క్

మరో హోం రెమడీ ఇది . ఇది డ్రై మరియు చిక్కుఉన్న జుట్టుకు నేచురల్ కండీషర్ గా పనిచేస్తుంది. ఒక కప్పు మయోనైజ్ తీసుకొని తల మొత్తానికి పట్టించాలి . తర్వాత మీ తలకు ప్లాస్టిక్ షవర్ క్యాప్ ను తొడుగాలి . తర్వాత వేడినీటిలో మంచిన టవల్ ను చుట్టాలి 20నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు సిల్కీగా షైనీగా ఉంటుంది.

బీర్

బీర్

బీర్ జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జుట్టును సూపర్ సాఫ్ట్ అండ్ షైనీగా ఉంచుతుంది. ఇది నిజం!షాంపు చేసిన తర్వత 10 యంఎల్ బీర్ ను మీ జుట్టుకు అప్లై చేసి 20 నిముషాలు తర్వాత తలస్నానం చేయడం ద్వారా చిక్కులేకుండా ఉంటుంది.

వెనిగర్

వెనిగర్

తల దురద: వర్షాకాలంలో తలదురద పెట్టడం సహజం . చెమట వల్ల తలలో జిడ్డు ఏర్పడుతుంది. ఈ జిడ్డును తొలగించాలంటే , ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ను ఒక మగ్ వాటర్ లో మిక్స్ చేసి షాంపు చేసుకొన్న తర్వాత చివరగా ఈ నీటిని తలమీద పోసుకోవాలి . ఇది ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది మరియు దురదను నివారిస్తుంది.

బంతిపువ్వులు

బంతిపువ్వులు

3కప్పుల వేడి నీటిలో కొన్ని తాజాగా ఉండే బంతి పువ్వులను వేసి, ఒక గంట అలాగే పెట్టాలి తర్వాత నీరు చల్లబడ్డాక షాంపుతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటిని తలమీద పోసుకోవాలి.

మొంతులు

మొంతులు

మెంతులు జుట్టు సంరక్షణలో అనేక అద్భుతాలను చేస్తుంది. నీటిలో మెంతులు వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి . తర్వాత రోజు ఉదయం నీరు వంపేసి, ఆ నీటిలో తలస్నానానికి ఉపయోగిస్తే జుట్టు సమస్యలు బలహీనమైన జుట్టు, చుండ్రు వంటివాటిని నివారించబడుతాయి.

డైట్ ఫుడ్

డైట్ ఫుడ్

ఎక్స్ టర్నల్ గా ఎన్ని అప్లై చేసినా, హెయిర్ కేర్ లో ఖచ్చితంగా చేయాల్సింది . విటమిన్ ఇ మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడమే . అందుకు మీ డైట్ లో బాదం, నట్స్, ఆకుకూరలు, ఆలివ్స్, డ్రైడ్ ఆప్రికాట్, సన్ ఫ్లవర్, ఆమ్లా, టమోటో, బ్రొకోలీ, సిట్రస్, బెల్ పెప్పర్ ను చేర్చుకోవాలి.

English summary

10 Home Remedies for Monsoon hair care

If you’re sensible enough to stay away from harsh chemicals, colorants, hair sprays, gels, and other hair products this monsoon, kudos to you! Though you may be wondering what you can still do to keep your hair shiny, soft and bouncy?
Story first published: Thursday, July 3, 2014, 17:30 [IST]
Desktop Bottom Promotion