For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో చిట్లిన జుట్టును నివారించడానికి 15 సింపుల్ మార్గాలు

|

ప్రస్తుత జీవన విధానంలో ఆరోగ్య సమస్యలతో పాటు, జుట్టు సమస్యలు కూడా అధికం అవుతున్నాయి. ముఖ్యంగా అనేక జుట్టు సమస్యల్లో జుట్టు చిట్లడం కూడా ఒక పెద్ద సమస్యగా ఎదుర్కొంటున్నారు . ముఖ్యంగా చలికాలంలో వాతావరణ ప్రభావం మరియు తీసుకొనే ఆహారం, చల్లటి నీరు వల్ల జుట్టుకు యొక్క మాయిశ్చరైజింగ్ తగ్గిపోయి, జుట్టు చిట్లడం, మరియు డ్రైగా మారడం జరుగుతుంది.

చలికాలంలో జుట్టు చిట్లకుండా నివారించడం చాలా అవసరం. అంతే కాదు చలికాలంలో తలకు షాంపు పెట్టి స్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆటోమ్యాటిక్ గా జుట్టులో తేమ తగ్గిపోతుంది. దాంతో జుట్టు డ్రైగా అయ్యి, చిట్లడం ప్రారంభం అవుతుంది. కాబట్టి, చలికాలంలో తలస్నానం చేసిన తర్వత జుట్టుకు మాయిశ్చరైజ్ చేయడం చాలా అవసరం. అంతే కాకుండా జుట్టు యొక్క చివర్లను అప్పుడప్పుడు కట్ చేస్తుండటం కూడా చాలా ముఖ్యం.

ఇంకా మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే కమర్షియల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల కూడా జుట్టు సమస్యలు అధికం అవుతాయి. చలికాలంలో జుట్టు చిట్లడాన్ని అరకట్టడానికి కొన్ని సింపుల్ మార్గాలున్నాయి. చలికాలంలో జుట్టు చిట్లకుండా తీసుకొనే జాగ్రత్తల్లో ఉపయోగించే పదార్థాలన్ని కూడా మన ఇంట్లో వస్తువులతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మరి అదెలాగో ఒక సారి చూద్దాం...

ఎగ్ షాంపు:

ఎగ్ షాంపు:

చలికాలంలో చిట్లిన జుట్టును నివారించడానికి ఇది ఒక ఉత్తమ మార్గం. రోజ్మెరీ ఆయిల్ ను ఎగ్ వైట్ లో వేసి తలకు బాగా మసాజ్ చేసి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

బొప్పాయి హెయిర్ ప్యాక్:

బొప్పాయి హెయిర్ ప్యాక్:

బాగా పండిన బొప్పాయిని గుజ్జులా తయారుచేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఆముదం :

ఆముదం :

ఆముదం, ఆలివ్ ఆయిల్ మరియు మస్టర్డ్ ఆయిల్ ను సమంగా తీసుకొని బాగా మిక్స్, గోరువెచ్చగా చేసి తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. తర్వాత హాట్ టవల్ ను తలకు చుట్టి అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

క్రీమ్ సొల్యూషన్:

క్రీమ్ సొల్యూషన్:

తలకు షాంపు పట్టించిన తర్వాత క్రీమ్ ను పాలలో వేసి బాగా మిక్స్ చేసి తర్వాత తలకు పట్టించాలి. జుట్టు పొడవునా పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేసేసుకోవాలి. చలికాలంలో జుట్టు చిట్లడాన్ని అరికట్టడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

తేనె:

తేనె:

చలికాలో జుట్టుకు తేనెను పట్టించడం వల్ల చిట్లిన జుట్టును నివారించవచ్చు. తేనెను పట్టించి 20 నిముషాల తర్వత స్నానం చేయాలి.

బీర్ తో తలస్నానం:

బీర్ తో తలస్నానం:

మీ జుట్టుకు బీర్ అద్భుతాలను క్రియేట్ చేస్తుంది. జుట్టుకు బీర్ పట్టించి మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేయాలి.

అవొకాడో:

అవొకాడో:

మీ జుట్టు మరింత సాఫ్ట్ గా ఉండాలంటే, మీరు ఖచ్చితంగా అవొకాడోను గుజ్జులా తయారుచేసి 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

జుట్టుకు తగినంత తేమను అందివ్వడంలో ఆలివ్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ ను తలకు మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

వింటర్ హెయిర్ కేర్ చిట్కాలలో ఇది ఒక ఉత్తమ చిట్కా. స్వచ్చమైన కొబ్బరి నూనె చిట్లిన జుట్టును చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ఇది తలకు మాయిశ్చరైజర్ గా పనిచేయడం మాత్రమే కాదు, ఇది జుట్టుకు బలాన్ని కూడా చేకూర్చుతుంది.

చమోమెలీ టీ:

చమోమెలీ టీ:

చిట్లిన జుట్టును నివారించడానికి చమోమెలి టీని ఉపయోగించడం చాలా ఉత్తమం. తలస్నానం చేసుకొన్న తర్వాత చమోమెలీ టీని తలరా పోసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆరోగ్యకరంగా తినాలి:

ఆరోగ్యకరంగా తినాలి:

చలికాలంలో శరీరంను అవసరం అయ్యే మంచి పౌష్టికాహారంను తీసుకోవడం వల్ల వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

షీ బటర్ క్రీమ్ :

షీ బటర్ క్రీమ్ :

క్రీమ్ లో హెల్తీ ఫ్యాట్స్ కలిగి ఉంటుంది మరియు దీని ధర కూడా తక్కువే. దీన్ని తలస్నానం చేసిన తర్వాత తలకు పట్టించాలి.

కోకో బటర్:

కోకో బటర్:

డ్రై హెయిర్ మరియు చిట్లిన జుట్టును నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని తలస్నానం చేసిన తర్వాత తలదువ్వడానికి ముందుగా ఉపయోగించాలి.

ఆర్గాన్ ఆయిల్:

ఆర్గాన్ ఆయిల్:

ఇది ఒక ఇన్ స్టాంట్ ట్రీట్మెంట్ . చలికాలంలో జుట్టు చిట్లడాన్ని నివారించడంలో ఇది ఒక ఉత్తమ మార్గం. ఇది బ్రేక్ అయిన జుట్టును మరమత్తు చేస్తుంది మరియు జుట్టుకు బలాన్ని చేకూర్చుతుంది.

నెయ్యి:

నెయ్యి:

అన్ రిఫైండ్ ఆయిల్ జుట్టుకు పోషణను అందివ్వడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని తలస్నానికి కొన్ని గంటల ముందు పట్టించి తర్వాత తలస్నానం చేసుకోవాలి.

English summary

15 Simple Ways To Treat Split Ends In Winter

Split ends are one of the most common problems in winter. Apart from the effect of the climate, some things that we do on a daily basis also accelerate this condition. Icy-cold weather will remove moisture from the hair making it brittle and dry, leading to split ends.
Story first published: Monday, December 22, 2014, 11:54 [IST]
Desktop Bottom Promotion