For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు షాంపు పెట్టడంలో 16 సులభ మార్గాలు

|

వారంలో రెండు సార్లు షాంపూ చేయడం వల్ల శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి రోజు శిరోజాల్ని శుభ్రపరిస్తే చాలా మొత్తంలో జుట్టు ఊడిపోయే అవకాశాలున్నాయి. షాంపూ చేయడంలోని మెలకువలను పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఒత్తుగా నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది.

తలస్నానం చేయాలనుకున్నప్పుడు పొడవైన జుట్టు కొంత ఇబ్బందులను కలిగిస్తుంది. అయినా, కొన్ని ఈజీ టెక్నిక్స్ ను పాటించడం ద్వారా పొడవాటి జుట్టును కూడా సులభంగా షాంపూతో శుభ్రం చేసుకోవచ్చు. ఈ టెక్నిక్స్ కు కొంచెం సమయం పట్టినా రాను రాను ఈజీ అవుతాయి.

అందువల్ల పొడవాటి జుట్టుకు షాంపూ చేయడాన్ని కష్టంగా ఉందన్న ఆలోచనను పక్కన పెట్టి ఈ టెక్నిక్స్ ను పాటించండి. మరి సులభంగా షాంపూ చేయడమెలాగో తెలుసుకుందామా.........

జుట్టును ట్రిం చేయండి

జుట్టును ట్రిం చేయండి

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారా? అలా అయితే మీరు నెలకొకసారి మీ జుట్టును కచ్చితంగా ట్రిం చేసుకోవాలి. జుట్టును పరిరక్షించుకోవడంలో ఇది ముఖ్యమైనది.

రూట్స్ నుంచి మసాజ్ చేయాలి

రూట్స్ నుంచి మసాజ్ చేయాలి

మీ కురులను మొదళ్ళనుంచి కనీసం 2 నిమిషాలపాటు మసాజ్ చేయడానికి సమయాన్ని కేటాయించాలి. రక్తప్రసరణని మెరుగుపరచి జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది.

వేడి నూనె

వేడి నూనె

కురులకు వేడి నూనెను అప్లై చేయాలి. దీని వల్ల కురులు మొదళ్ళ నుంచి బలంగా తయారవుతాయి. దురదపుట్టే స్కాల్ప్ సమస్య కూడా కనుమరుగవుతుంది.

టవల్ తో చుట్టండి

టవల్ తో చుట్టండి

మీ కురులకు వేడి నూనెను అప్లై చేసిన తరువాత టవల్ తో మీ కురులను చుట్టండి. ఇలా చేస్తే హాయిగా ఉంటుంది.

దువ్వండి

దువ్వండి

వేడి నూనె అప్లై చేసిన తరువాత టవల్ తో కురులను చుట్టారు కదా? ఇప్పుడు ఆ టవల్ ను తీసేసి, మీ జుట్టును కోమలంగా దువ్వండి. చిక్కు పడకుండా జాగ్రత్తగా దువ్వండి.

కండిషనర్ ను అప్లై చేయండి

కండిషనర్ ను అప్లై చేయండి

ఇప్పుడు మీ చేతులలోకి కొంచెం కండిషనర్ ను తీసుకోండి. మీ కురులపై కండిషనర్ ను అప్లై చేయండి. మీ స్కాల్ప్ పై కండిషనర్ నిలిచేలా జాగ్రత్త వహించండి.

చల్లటి నీటితో శుభ్రం చేయండి

చల్లటి నీటితో శుభ్రం చేయండి

మీ కురులను చల్లని నీతితో శుభ్రం చేయండి. జిడ్డుని తొలగించడానికి చల్లని నీటితో కడగడం అవసరం.

షాంపూ అప్లై చేయండి

షాంపూ అప్లై చేయండి

మీ కురులకు సులభంగా షాంపూ చేయదానికి ఇది మొదటి టిప్. మీ కురులపై కొద్దిగా షాంపూని అప్లై చేయండి. కనీసం 2 సెకండ్ల పాటు మీ కురులపై షాంపూ నానాలి. అంతకు మించి అవసరం లేదు.

షాంపూని రీ-అప్లై చేయండి

షాంపూని రీ-అప్లై చేయండి

షాంపూని అప్లై చేసిన తరువాత జుట్టుని సరిగ్గా శుభ్రం చేసుకోండి. తిరిగి షాంపూని అప్లై చేయండి.

గోరువెచ్చటి నీటితో అప్లై చేయండి

గోరువెచ్చటి నీటితో అప్లై చేయండి

రెండవ సారి షాంపూ అప్లై చేసిన తరువాత మీ కురులను గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయండి. కురులపైనున్న షాంపూ తొలగిపోయేలా శుభ్రంగా కడగండి.

జుట్టుని తడారబెట్టండి

జుట్టుని తడారబెట్టండి

టవల్ తో జుట్టుని శుభ్రంగా తుడుచుకోవాలి. మీ కురులలోనున్న నీటిని శుభ్రంగా టవల్ తో తుడుచుకోవాలి. స్కాల్ప్ తడిగా ఉండడం వల్ల చుండ్రు సమస్య వచ్చే అవకాశం ఉండడం వల్ల తడి ఆరేలా జాగ్రత్తగా తుడుచుకోవాలి.

జుట్టు చివర్లకు కండిషనర్

జుట్టు చివర్లకు కండిషనర్

జుట్టుకి షాంపూ చేసేటప్పుడు జుట్టు చివర్లకోసం కూడా సమయాన్ని కేటాయించాలి. జుట్టు చివర్లు జుట్టు మొదళ్ళ కంటే వేగంగా ఎండిపోతాయి. అందువల్ల జుట్టు చివర్లకు కండిషనర్ ను అప్లై చేయాలి.

నీళ్ళతో శుభ్రంగా కడగాలి

నీళ్ళతో శుభ్రంగా కడగాలి

మీ జుట్టుపైనున్న కండిషనర్ ను జుట్టు మొనల నుంచి జాగ్రత్తగా తొలగించాలి. నల్లాలోంచి వచ్చే రన్నింగ్ వాటర్ ద్వారా శుభ్రం చేసుకోవాలి.

జుట్టును కోమలంగా తుడుచుకోవాలి

జుట్టును కోమలంగా తుడుచుకోవాలి

జుట్టును కోమలంగా తడారబెట్టుకోవాలి. జాగ్రత్తగా శుభ్రం చేసుకోవడం వల్ల జుట్టు చిట్లే బాధ తప్పుతుంది.

టవల్ లో చుట్టేయండి

టవల్ లో చుట్టేయండి

పొడి టవల్ తో జుట్టును శుభ్రంగా తడారబెట్టుకోవాలి. మీ కురులను టవల్ లో కనీసం 8 నిమిషాల పాటు చుట్టి ఉంచాలి. మీ జుట్టులో మిగిలి ఉన్న నీళ్ళన్నీ టవల్ కు ఇంకిపోతాయి.

సహజంగా జుట్టు తడారేలా చేయాలి

సహజంగా జుట్టు తడారేలా చేయాలి

వారానికి ఒకసారి ఈ చిట్కాలను పాటించాలి. జుట్టు సహజంగా తడారేలా చేయడం మంచిది. పరికరాల ద్వారా కాకుండా జుట్టులోనున్న తడి సహజంగా ఆరిపోయేలా చూడండి.

English summary

16 Easy Ways To Shampoo Your Hair

Shampooing your hair twice a week is the best way to keep your hair healthy. If you are washing your hair every day, you will probably loose a lot of hair before you begin to loose your teeth. To know how to shampoo your hair properly, here are some techniques you can use.
Story first published: Friday, December 19, 2014, 9:29 [IST]
Desktop Bottom Promotion