For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్ట్రెయిట్ హెయిర్ పొందడానికి 6 అద్భుతమైన వస్తువులు

By Super
|

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచలో స్ట్రెయిట్ హెయిర్ ట్రెండ్ నడుస్తున్నది. స్టైల్ కి ఇది ఒక స్టేమ్మెంట్ గా ఇప్పుడు ఏ అమ్మాయిని చూసినా స్ట్రెయిట్ హెయిర్ మాయలో పడిపోతున్నారు . స్ట్రెయిట్ హెయిర్ కోసం ఉపయోగించే కొన్ని ప్రొడక్ట్స్ లో కొన్ని రసాయనాలను ఉపయోగించడం వల్ల హెల్తీ హెయిర్ మీద ప్రభావం చూపుతాయి. అందువల్ల జుట్టును స్ట్రెయిట్ గా మార్చుకోవడానికి నేచురల్ పదార్థాలు మళ్ళీ మన ముందు కొత్తవాటిలా కనిపిస్తున్నాయి.

అటువంటి నేచురల్ ప్రొడక్ట్స్ కొన్ని మన వంటగదిలోనే ఉన్నాయి . ఈ పదార్థాలను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ జుట్టును మెత్తగా, సాఫ్ట్ గా మరియు స్ట్రెయిట్ గా మార్చుకోవచ్చు . మరి ఇంట్లో ఉండే కొన్ని నేచురల్ హెయిర్ స్ట్రెయిటనర్న్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

నిమ్మరసంతో కోకనట్ మిల్క్ :

నిమ్మరసంతో కోకనట్ మిల్క్ :

కొబ్బరిని తురిమి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి నీరు మిక్స్ చేసి వడగట్టుకోవాలి. ఇవే కొబ్బరి పాలు ఇందులో హెయిర్ స్ట్రెయిటనింగ్ గుణాలు ఉన్నాయి. కానీ ఇందులో నిమ్మరసం మిక్స్ చేయడం వల్ల మరింత మంచి ఫలితంను అందిస్తాయి . ఈ రెండూ మిక్స్ చేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి . అలా పెట్టడం వల్ల పైన క్రీమ్ లాగా తేరుకుంటుంది. ఈ క్రీమ్ ను మీ కేశాల మొత్తానికి పట్టించి వేడి టవల్ ను తలకు చుట్టుకోవాలి. తర్వాత కనీసం ఒక గంట సేపు అలాగే ఉంచి, తర్వత మంచి షాంపుతో తలస్నానం చేసుకోవాలి. దాని వల్ల మీ జుట్టును సాఫ్ట్ గా మార్చుకోవచ్చు. అదే సమయంలో కర్లింగ్ హెయిర్ కూడా నిర్వహించడానికి అనుకూలంగా మారుతాయి.

హాట్ ఆయిల్ ట్రీట్మెంట్:

హాట్ ఆయిల్ ట్రీట్మెంట్:

జుట్టుకు పోషకాలు చాలా అవసరం అవుతాయనే విషయం చాలా మందికి తెలియదు . రెగ్యులర్ ఆయిల్ ట్రీట్మెంట్ మీ జుట్టును స్ట్రెయిట్ గా మరియు స్లీక్ గా మార్చుతుంది. కోకొనట్ ఆయిల్ కు కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి తలకు మసాజ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ కు బదులుగా బాదం ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు. ఇలా మసాజ్ చేసిన తర్వాత హాట్ టవల్ ను తలకు చుట్టుకోవాలి. కనీసం 45నిముషాలు అలాగే ఉంచి తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

నేచురల్ కండీషనర్:

నేచురల్ కండీషనర్:

తలస్నానం చేసిన ప్రతి సారి జుట్టుకు కండీషనర్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు సాఫ్ట్ గా మరియు ప్రకాశవంతంగా మారుతుంది. టీ డికాషన్ ను నేచురల్ హెయిర్ కండీషనర్ గా ఉపయోగించుకోవచ్చు.

మిల్క్ స్ప్రే:

మిల్క్ స్ప్రే:

జుట్టును ఫ్లాట్ గా మార్చడంలో పాలు చాలా గొప్పగా సహాయపడుతాయి. పాలను స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు మొత్తానికి స్ప్రే చేయాలి. అరగంట అలాగే ఉంచాలి. అలా చేయడం వల్ల ఇది కేశాలకు బాగా శోషింపబడుతుంది . తర్వాత షాంపుతో తలస్నానం చేయడం వల్ల జుట్టు కొత్తగా కనబడుతుంది.

పాలు మరియు తేనె:

పాలు మరియు తేనె:

కొద్దిగా పాలు మరియు తేనెను తీసుకొని చిక్కగా పేస్ట్ లా చేసుకోవాలి. ఇంకా మరింత ఎక్కువ ఫలితం కోరుకుంటున్నట్లైతే ఈ రెండింటికి కొద్దితగా స్ట్రాబెర్రీ లేదా అరటిపండ్లను మిక్స్ చేసి, మీ జుట్టుకు అప్లై చేయాలి. జుట్టు తడి ఆరడానికి సహాయపడుతాయి. ఒక అరగంట లేదా గంట అలాగే ఉండనిచ్చి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు:

ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు:

జుట్టు సంరక్షణలో ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ మిశ్రమం మీ జుట్టుకు అద్భుతాలనే చేస్తాయి. రెండు గుడ్లను బీట్ చేసి అందులో సరిపడా ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి తలకు, కేశాలకు పట్టించాలి. కనీసం అరగంట అలాగే ఉండనిచ్చి తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయాలి .

ఈ నేచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నవే. అయితే మీకు కొంత ఓపిక ఉండాలి అంతే. సలోన్ లో లాగే ఇది హెయిర్ స్ట్రెయిటనింగ్ ట్రీట్మెంట్ లాగే ఉండకపోవచ్చు. అయితే జుట్టును సంరక్షించుకొనే విధానంలో ఇవి చాలా గొప్పగా సహాయపడుతాయి. వీటిలో ఏఒక్కదాన్నైనా వారానికొకసారి అయినా అనుసరిస్తేం మంచి ఫలితం ఉంటుంది. కొన్ని నెలల తర్వాత మీ కేశ సంరక్షణలో మార్పును మీరే గమనించగలరు. ఒక వేళ మీ జుట్టు మరీ ఉంగరాల జుట్టు అయ్యుండి, స్ట్రెయిట్ గా మార్చుకోవాలనుకుంటే అప్పుడు సలోన్ కు వెళ్ళవచ్చు లేదా హానికరమైన హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల జుట్టును డ్యామేజ్ చేస్తుంది.

English summary

6 Natural Hair Straightening Products That Work Wonders

The trend of straight hair has rewritten the stylebook. Hair straightening products are very much in demand. But the chemicals which are mostly used to make your hair flat and sleek, leave their impact on the health of your hair. Hence, natural hair straightening products have become the new look-out.
Desktop Bottom Promotion