For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యకరమైన జుట్టుకు అత్యంత అవసరమైన 5 పోషకాలు

By Super
|

మీరు ఎల్లప్పుడూ మెరిసే మరియు నున్నగా ఉండే జుట్టు కావాలని కోరుకుంటారు. మీరు ఆ విధంగా జుట్టును సొంతం చేసుకోవాలంటే కొన్ని ఆహారాలను తీసుకోవాలి. బలమైన మరియు మెరిసే జుట్టు కొరకు ఖరీదైన షాంపూలు లేదా ఫాన్సీ సెలూన్లో చికిత్స అవసరం లేదు. మీరు తీసుకొనే ఆహారంలోనే మొత్తం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలు మరియు వివిధ అలవాట్లు ఎల్లప్పుడూ మీరు ఉహించని మాయను చేస్తాయి. మీ జుట్టు ఆరోగ్యంగా పెరగటానికి కొన్ని పోషకాలు అవసరం.

1.ఐరన్ మరియు జింక్

జుట్టు గ్రీవం పెరగటానికి ఐరన్ మరియు జింక్ సహాయపడతాయని క్లీవ్లాండ్ క్లినిక్ చర్మ వ్యాధి నిపుణులు అయిన విల్మా బెర్గ్ఫెల్డ్ MD చెప్పారు. రెండు పోషకాలు సమృద్ధిగా ఉండే లీన్ రెడ్ మాంసంను వారంలో రెండు సార్లు తినమని ఆమె సూచించారు. శాఖహరులు అయితే విటమిన్ సి అధికంగా ఉండే నారింజ వంటి ఆహారాలు,సోయాబీన్స్ లేదా కాయధాన్యాలు వంటివి తీసుకోవాలి. ఇవి ఇనుము శోషణను పెంచుతాయి.


2.విటమిన్ D

అనేక అధ్యయనాలలో విటమిన్ D జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని కనుగొన్నారు. అయితే, విటమిన్ D ఒక గమ్మత్తైన విటమిన్ అని చెప్పవచ్చు. ఇది కొన్ని ఆహారాలలో సహజంగా ఉంటుంది. కొన్ని నిమిషాలు ఎండలో కుర్చొంటే మీ శరీరంలో విటమిన్ D ఉత్పత్తికి సహాయపడుతుంది. ఎక్కువ సేపు కుర్చొంటే హానికరమైన UV కిరణాల ప్రభావం పడుతుందని అనేక నిపుణులు చెప్పుతున్నారు. ప్రతి రోజు 1,000 IU సప్లిమెంట్ తీసుకోవాలి.


3.ప్రోటీన్
ప్రోటీన్ కణాల విభాగాలను నిర్మిస్తుంది. కణాల పెరుగుదలను మరియు మరమ్మత్తును ప్రోత్సహిస్తుంది. అంతేకాక జుట్టును బలంగా ఉండేలా చేస్తుంది. ప్రతి రోజు మహిళలకు కనీసం 46 గ్రాముల ప్రోటీన్ అవసరం అవుతుంది. (3 ఔన్స్ ల చికెన్ లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది).మీరు ప్రతి రోజు వినియోగించటానికి ఎంత ప్రోటీన్ అవసరమో గుర్తించడానికి గైడ్ ను అనుసరించండి.


4.ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు
ఆర్ద్రీకరణ జుట్టు కోసం వారంలో రెండు సార్లు ఫ్యాటీ చేప (సాల్మన్ వంటి)లను తీసుకోవాలి. లేకపోతే ప్రతి రోజు 1 గ్రాము DHA మరియు EPA సప్లిమెంట్ తీసుకోవాలి. మృదువైన జుట్టుతో పాటు,ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు డిప్రెషన్ ఉపశమనం మరియు గుండెకు సహాయపడతాయని నిరూపణ జరిగింది.


5.బోయోటిన్
గుడ్డులో ఈ B విటమిన్ సమృద్దిగా ఉంటుంది. (ఇది ఒక అద్భుతమైన ప్రోటీన్, విటమిన్ బి కాంప్లెక్స్ సముదాయములోని మూలం, మరియు విటమిన్ డి లో కూడా ఉంటుంది) మీకు గుడ్డు ఇష్టం లేదా? అయితే మీరు ప్రతి రోజు 30mcg సప్లిమెంట్ తీసుకోండి.
6 Nutrients You Should Know for Healthy Hair

English summary

6 Nutrients You Should Know for Healthy Hair

Fill your plate with these foods to get the shiny, lustrous hair you’ve always wanted. The secret to think, strong, shiny strands isn’t an expensive shampoo or fancy salon treatment—it’s all about your diet
Story first published: Monday, October 27, 2014, 18:02 [IST]
Desktop Bottom Promotion