For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేచురల్ గా హెయిర్ ఫాల్ నివారించడానికి: 7మార్గాలు

|

జుట్టు అందం ముడిచినప్పుడు, వాటి ఆరోగ్యం దువ్వినప్పుడ తెలుస్తుందంటారు. సమయానుకూలంగా నీళ్ళు పోసి, ఎరువు వేస్తే మొక్క ఎలా ఏపుగా పెరుగుతుందో, కనీస జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు అంత అందంగా, ఆరోగ్యంగా తయారువుతోంది. మన ఆత్మవిశ్వాసం చిక్కనైన చక్కనైన జుట్టుమీద ఆధారపడి ఉంటుంది. వాతావరణంలో తేమ, ఎండాకాలపు వేడి, చలి కాలపు మంచు ఇలాంటి వాతావరణ ప్రతికూలతలు జుట్టు చక్కదనాన్ని దెబ్బతీస్తాయి. చిక్కులు తెస్తాయి.

కేశాల యొక్క ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మీద అధారపడి ఉంటుంది. శారీరక అనారోగ్యం కేశాల అనారోగ్య రూపంలో ప్రతిఫలిస్తుంది. కుటుంబ ఇతివృత్తం, జన్యుపరమైన అంశాలు ఇవన్నీ కేశాల మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే వీటిని తోసి రాజంటూ అరోగ్యకరమైన జీవన విధానాన్ని ఆచరిస్తే ఉన్నట్టుండి కేశాలు ప్యాచ్‌ లాగా ఊడిపోవడం వంటి సమస్యలు కలుగవు. శరీరంలో మిగతా భాగాలను కాపాడుకున్నట్టుగానే కేశాలను కూడా కాపాడుకోండి. వాతావరణ కాలుష్యం నుంచి, దుమ్ము నుంచి, విష రసాయనాల నుంచి మీ శరీరాన్ని ఎలాగైతే రక్షించుకుంటారో అలాగే మీ జుట్టును కూడా కాపాడుకోండి. చిక్కని ఆరోగ్యకరమైన జుట్టుకోసం చక్కని ఆమోఘమైన చికిత్సలను మీ కోసం ప్రత్యేకంగా వివరిస్తున్నాను.

వంట సోడాతో ఔషధం

వంట సోడాతో ఔషధం

వంట సోడా కేశాల మీద పేరుకున్న జిడ్డుని, మురికిని తొలగించి వాపుని తగ్గిస్తుంది. వంటసోడాను బేకింగ్‌ సోడా అని కూడా అంటారు. ఒక బౌల్‌లో మూడు టేబుల్‌ స్పూన్ల వంట సోడాని తీసుకోండి. దీనికి కొద్దికొద్దిగా నీళ్ళని కలుపుతూ చిక్కని ద్రవాన్ని తయారుచేయండి. ఇలా సిద్ధం చేసుకున్న ద్రవాన్ని తలస్నానం చేసిన తరువాత కేశాలను శుభ్రపరుచుకోడానికి ఉపయోగించండి. దీనిని కేశాల మీద ప్రయోగించిన తరువాత ఐదు నిముషాలు ఆగి మామూలు నీళ్ళతో బాగా మీ జుట్టును కడుక్కోండి. ఈ చికిత్స వల్ల తలమీద పేరుకుపోయిన అదనపు షాంపూ తొలగిపోతుంది. అలాగే చాలా రోజుల నుంచి పేరుకుపోయిన దుమ్ము, ధూళి, జిడ్డు ఇలాంటివన్నీ తొలగిపోతాయి.

సొరకాయతో ఔషధం

సొరకాయతో ఔషధం

సొరకాయ కేశాలను నునుపుగా, అందంగా మార్ధవంగా ఉంచటమే కాకుండా మెరుపుతో కాంతులీనేలాగా చేస్తుంది. తాజా సొరకాయను తెచ్చి పై తోలును పీలర్‌తో గీరేయండి. కండ భాగాన్ని ముక్కలుగా కోసి లోపల గింజలను తొలగించేయండి. ముక్కలను మిక్సీలో వేసి రసం తీయండి. ఈ రసాన్ని జుట్టుకు పట్టించండి. అరగంట ఆగిన తరువాత తలను శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేసుకుంటే, ఎండల వల్ల దెబ్బతిన్న కేశాలకు మరమ్మత్తు జరుగుతుంది. అందమైన కురులు మీ సొంతమవుతాయి.

ఆలీవ్‌ నూనెతో చికిత్స

ఆలీవ్‌ నూనెతో చికిత్స

ఆలీవ్‌ నూనెని కేశాల అందం కోసం మీరు వాడుకోవచ్చు. ఆలీవ్‌ నూనె అనేది కేశాలను కుదురుగా ఉంచటమే కాకుండా మెరుపుతో ప్రకాశించేలా చేస్తుంది.

ఒక బౌల్‌లో 15 మీల్లీ లీటర్ల అసలు సిసలైన ఆలీవ్‌ నూనెను తీసుకోండి. దీనికి ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెను చేర్చి బాగా కలపండి. ఈ ద్రవాన్ని జుట్టుకు పట్టించండి. అరచేతులతో జుట్టు కుదుళ్ళ నుంచి మొదలుపెట్టి జుట్టు మధ్య భాగాన్ని, చివర్లను కూడా ఆలీవ్‌ ఆయిల్‌ని ఉపయోగిస్తూ మర్థనా చేసుకోండి. రెండు గంటలు ఆగండి. తరువాత మృదువైన షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చొప్పున చేసుకుంటే మీ కేశాలు అందంగా ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఉసిరితో చికిత్స

ఉసిరితో చికిత్స

కేశాలు అర్థాంతరంగా రాలిపోవడమనేది ఈ మధ్యకాలంలో కనిపిస్తున్న అతి సాధారణమైన సమస్య. దీనికి ఉసిరి కాయలు చక్యని జవాబు. ఉసిరిని ఔషధంగా వాడితే కేశాలు రాలుతున్నప్పుడు అధ్భుతమైన ఫలితం కనిపిస్తుంది.

ఒక బౌల్‌లో అరకప్పు ఉసిరి కాయల పొడిని తీసుకోండి. దీనికి రెండు టేబుల్‌ స్పూన్ల ఆముదాన్ని కలపండి. అలాగే ఒక పచ్చి కోడి గుడ్డుని కలపండి. బాగా కలియ తిప్పితే మీకు ఒక మృదువైన పేస్టు తయారవుతుంది. దీనిని తలకు, కుదుళ్ళకు పూయండి. ముఫ్పై నిముషాలు ఆగండి. తర్వాత మృదువైన షాంపూతో తల స్నానం చేయండి. దీనిని వారానికి ఒకసారి చొప్పున ప్రయోగిస్తూంటే కేశాలు చిట్లిపోవడం, దెబ్బతినడం, పల్చబడటం, విరిగిపోవడం, రాలిపోవటం తదితర సమస్యలన్నీ తగ్గిపోతాయి. దీంతో మీ తల మీద కేశాలు అచ్చం వజ్రవైఢూర్యాలను పొదిగిన బంగారపు దివ్య కాంతితో మెరుస్తాం­.

వేడి నీళ్ళు హానికరం

వేడి నీళ్ళు హానికరం

వేడినీళ్లు వాడితే హాయిగా ఉండే మాట నిజం. అయితే వేడి నీళ్లు తలకు మాత్రం హాని చేస్తాయి. ముఖ్యంగా వేడినీళ్ళతో షవర్‌ స్నానాన్ని చేయకండి. వేడినీళ్ళను తలమీద పోసుకోవడం వల్ల జుట్టు పొడిబారుతుంది. తడిని కోల్పోతుంది. వేడి నీళ్ళు కేశాల మీద రక్షణగా పరుచుకున్న తాజా తైలాలను కరిగించి కేశాలను దెబ్బతీస్తాం­. అందుకే తలమీద స్నానానికి ఎప్పుడూ కూడా గోరువెచ్చని నీళ్ళను మాత్రమే ఉపయోగించండి. తలస్నానానికి వాడే నీళ్లు మీ శారీరక ఉష్ణోగ్రత కంటే కాస్త ఎక్కువ స్థాం­లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి చాలు.

కోడిగ్రుడ్డుతో చికిత్స

కోడిగ్రుడ్డుతో చికిత్స

కోడి గుడ్డు కేశాలకు పోషకతత్వాలను అందిస్తుంది. దీనిలోని తెల్లసొనలో ప్రొటీన్లు ఉంటాయి. పచ్చసొనలో క్రొవ్వు పదార్థాలుంటాయి. రెండూ కలిసి కేశాలకు పోషణనూ, మెరుపునూ ప్రసాదిస్తాయి. మీకు ఒకేవేళ బిరుసు జుట్టు ఉంటూ అన్నివేళల్లో పొడిగా కనిపిస్తూంటే కోడిగుడ్డు తెల్ల సొనను కేశాల స్నిగ్ధత్వం కోసం ఉపయోగించండి. మీ జుట్టు సాధారణమైన జుట్టు అయితే కోడి గుడ్డు తెల్లసొనను, అలాగే మొత్తం కోడి గుడ్డును బాగా కలిపి గిలకొట్టి నీళ్ళతో తడి చేసిన కేశాల మీద పూసుకోండి. 20 నిముషాలు ఆగి చన్నీళ్ళతో తలస్నానం చేసేయ్యండి. దీంతో పొడిబారిన మీ కేశాల్లో నవ చైతన్యం తిరిగి వస్తుంది.

యాపిల్‌ సిడర్‌ వెనీగార్‌

యాపిల్‌ సిడర్‌ వెనీగార్‌

మీ కేశాలు జీవంతో తోణికసలాడుతున్నట్టు ఉండాలంటే, మీరు నడుస్తున్నప్పుడు మీతో పాటు ఎగురుతూ బౌన్సింగ్‌గా, అందంగా కనిపించాలంటే యాపిల్‌ సిడర్‌ వెనీగార్‌ని ఉపయోగించండి. ఈ ద్రవపదార్థం మీకు అన్నీ సూపర్‌ మార్కెట్లెలోనూ దొరుకుతుంది. యాపిల్స్‌ నుంచి తయారయ్యే పుల్లని ద్రవం ఇది.

ఒక బౌల్‌లో యాపిల్‌ సిడప్‌ వెనీగార్‌ని ఒక టేబుల్‌ స్పూన్‌ తీసుకోండి. దీనికి ఒక టేబుల్‌ స్పూన్‌ వేడి నీళ్ళని కలపండి. బాగా కలిపిన తరువాత మీ జుట్టుకు పూసుకోండి. ఐదు నిముషాలు ఆగండి. తర్వాత యాపిల్‌ సిడప్‌ వాసన వదిలిపోయేలాగా మంచి నీళ్ళతో తలస్నానం చేసేయండి.

English summary

7 Ways to Stop Hair Loss Naturally

It is normal to lose hair because hair fall is backed up naturally by hair growth. Hair fall relates to a process of abnormality when loss exceeds the frequency of natural re-growth. Hair fall effecting individuals irrespective of their age and sex is indicative of serious physical malfunctioning.
Story first published: Monday, January 20, 2014, 15:56 [IST]
Desktop Bottom Promotion