For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రక్షణకు నేచురల్ హోం రెమెడీస్

By Mallikajuna
|

మీ కేశ సంరక్షణకు డీప్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటే, నేచురల్ హేయిర్ మాస్క్ లను ప్రయత్నించండి . కేశాలకు డీప్ గా చికిత్సనందివ్వడం వల్ల , మంచి పషణను సరైన టైమ్ లో అందివ్వడం ల్ల ఒక్క వారంలోనే అతి పెద్ద డిఫరెన్స్ ను అందిస్తుంది. మహిళలు కొన్ని దశాబ్దాల కాలంగా వారి కేశాలను కాపాడుకొంటూ వచ్చారు. దశాబ్దాల కాలం నుండి మహిళలు ఒత్తైన జుట్టును పోషించేవారు. అటువంటి ఒత్తైన జుట్టు పోషణకు, సాఫ్ట్ గా మరియు అద్భుతమైన కేశ సౌందర్యానికి ఏం ఉపయోగిస్తున్నారు?ఇప్పటిలా ఆ కాలంలో బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అందుబాటులో లేవుకదా ...

ఇవన్నీ ఏమీ లేకుండానే మన వంటగదిలోని వస్తువులే, జుట్టు పెరుగుదలను గొప్పగా ప్రోత్సహించేవి. ఈ నేచురల్ పదార్థాలలో కేశ సంపదను పెంచుకోవడానికి సరిపడే కొనని పోషకాంశాలు వీటి ద్వారానే లభించేది. ఉదాహరణకు: అరటి పండ్లు: వీటిలో పొటాషియం మరియు విటమిన్ ఎ, సి మరియు ఇలు అధికంగా ఉన్నా యి.

At home hair remedies

అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా చేసి గిన్నెలో వేసి మొత్తగా పేస్ట్ లా ఉండలు లేకుండా చేసి, తలకు పట్టించాలి. తలకు షవర్ క్యాప్ లేదా ప్లాస్టిక్ కవర్ ను తొడిగి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అందుకు మంచి మన్నికైన షాంపును ఉపయోగించి తలస్నానం చేసుకోవాలి.

అలాగే మొయోనైజ్ చాలా చౌకైనది, బ్యూటీ ట్రీట్మెంట్స్ లో కొనుగోలు చేయడం చాలా సులభం, చర్మంలో డీహైడ్రేట్స్ ను తగ్గిస్తుంది ఈ మొయోనైజ్ పూర్తి ఆయిల్ తో నిండి ఉండటం వల్ల ఇది కేశాలకు ఎక్స్ ట్రా షైన్ అంధిస్తుంది అంతే కాదు కేశాలకు తగినంత తేమను కూడా అందిస్తుంది. కొద్దిగా రాసుకుంటే చాలు.

రెండు చేతుల్లో కొద్దిగా మొయోనైజ్ తీసుకొని బాగా రెండు అరచేతులకి రాసుకొని , జుట్టు మొదళ్ళ నుండి చివర వరకూ బాగా పట్టించాలి. దీన్ని అప్లై చేయడానికి ముందు ఇది గుడ్డు వాసన కలిగి ఉంటుంది. కాబట్టి, మొయోనైజ్ పెట్టుకోవడానికి ముందు అందులో సువాసన కలిగించే ఏదైనా నూనెను మిక్స్ చేసుకోవాలి. అప్లై చేసిన అరగంట అలాగే ఉండే తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అన్ని రకాల జుట్టు సమస్యలకు ఒకే విధమైన హేర్ మాస్క్ లు పనిచేయవు. కాబట్టి చుండ్రు సమస్య ఉన్నప్పుడు ఒక పాత కాల పద్దతి ఆలివ్ ఆయిల్లో, నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తాజాగా ఉండే నిమ్మకాయ నుండి రసం పిండి, అంతే మోతాదులో ఆలివ్ ఆయిల్ మరియు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి తర్వాత లకు పట్టించాలి. తర్వాత వేడినీటిలో డిప్ చేసిన టవల్ చుట్టి తర్వాత తలస్నానంచేయాలి . ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

At home hair remedies

Try out natural hair masks the next time you want to give your hair a deep treatment. Treating your hair to a deep, nourishing mask every few weeks will make the world of difference.
Desktop Bottom Promotion