For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో జుట్టు సమస్యల నివారణకు ఉత్తమ చిట్కాలు

By Super
|

తలలో చిరాకు, దురద, మరియు చుండ్రు ఇవన్నీ కూడా పొడిబారి జుట్టు, డ్రై స్లాప్ కు ప్రధాణ కారణాలే. కొన్ని సందర్భాల్లో డ్రై స్లాప్ వల్ల, తామర మరియు సోరియాసిస్ వంటి ప్రమాదకరమైన వైద్య పరిస్థితులను సూచిస్తుంది. ఇది దీర్ఘకాలిక పరిస్థితి కాకపోవచ్చు, కానీ అది కాలనుగుణంగా సంభవించవచ్చు. ఇలాంటి పరిస్థితిని కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి నివారించుకోవచ్చు. సీజనల్ గా వచ్చే ఈ మార్పులను వైద్య పరమైన చికిత్స అవసరం లేకుండానే హోం రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు.

Avoid itching and dandruff during this winter

డ్రై స్లాప్ తో వివిధ రకాల హెయిర్ మరియు తలలో చర్మ సమస్యలను ఎదుర్కొనే వారు కొన్ని హోం రెమెడీస్ ను రెగ్యులర్ గా ఉపయోగించి తగినంత మాయిశ్చరైజర్ ను పొందవచ్చు. డ్రై స్లాప్ కు సంబంధించి ఎటువంటి లక్షణాలనైనా నివారించుకోవచ్చు. చలికాలంలో డ్రై స్లాప్ వల్ల ఏర్పడే చుండ్రును నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

#1: ఆపిల్ సైడర్ వెనిగర్:

జుట్టుకు ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను కండీషనర్ గా అప్లై చేయడం వల్ల స్లాప్ యొక్క పిహెచ్ లెవల్స్ ను సమతుల్యం చేసి తలలో డ్రైనెస్ మరియు దురదను నివారిస్తుంది. అంతే కాదు, తలలో బ్యాక్టీరియా మరియు పంగల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది. చుండ్రుకు దారితీసే బ్యాక్టీరియాను నివారించి ఫోలీసెల్స్ ను రక్షణ కల్పిస్తుంది

Avoid itching and dandruff during this winter


ఎలా ఉపయోగించాలి:
మొదట మీ జుట్టును మంచినీళ్ళతో స్నానం చేసి తర్వాత తడి ఆరనివ్వాలి. తర్వాత ఒక స్ప్రే బాటిల్లో ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీరు సమంగా తీసుకొని బాగా మిక్స్ చేసి జుట్టుకు స్ప్రే చేసుకోవాలి. మరియు కాటన్ బాల్స్ ఉపయోగించి తలలో చర్మానికి అప్లై చేయాలి. కొద్ది సమయం అలాగే ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ హో రెమెడీనీ దినం మార్చి దినం చేయడం వల్ల ఉత్తమ ఫలితం ఉంటుంది.

#2: టీట్రీ ఆయిల్ :
టీట్రీ ఆయిల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. తలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను నివారించడంలో టీ ట్రీ ఆయిల్ చాల గ్రేట్ గా సహాయపడుతుంది. దీన్ని తలకు అప్లై చేసినప్పుడు, ఇది హెయిర్ ఫాలీసెల్స్ కు అట్టుకొనే విధంగా అప్లై చేయాలి . స్కిన్ మరియు హెయిర్ సమస్యలను నివారించడంలో టీట్రీ ఆయిల్ గొప్పగా సహాయపడుతుంది.

Avoid itching and dandruff during this winter

ఎలా ఉపయోగించాలి:
ఒక టేబుల్ స్పూన్ వెజిటేబుల్ ఆయిల్లో రెండు మూడు చుక్కల టీట్రీ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి చేతిలో వేసుకొని తలకు బాగా మర్ధన చేసి అప్లై చేయాలి. నిధానంగా మసాజ్ చేయాలి. ఇలా ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు తలకు రెగ్యులర్ గా చేయడం వల్ల జుట్టు యొక్క స్లాప్ కండీషన్ ను మెరుగుపరుస్తుంది.

#3: కలబంద
కలబంద మనకు బాగా తెలిసినటువంటి ఒక మూలిక ఇది. కలబంద తల మీద చర్మానికి చల్లని అనుభూతిని కలిగిస్తుంది. దాంతో డ్రై స్లాప్ ను నివారిస్తుంది . ఇది తలకు తగినంత తేమను మరియు గ్లైకో ప్రోటీన్స్ అందిస్తుంది. మరియు చర్మంకు హీలింగ్ పవర్ ను అందిస్తుంది . అంతే కాకుండా, ఇందులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

Avoid itching and dandruff during this winter

ఎలా ఉపయోగించాలి:
అలోవెర జెల్ ను చేతి వేళ్ళతో తీసుకొని తల మాడకు అప్లై చేసి చక్కగా మసాజ్ చేయాలి. తర్వాత 15-20నిముషాలు అలాగే ఉంచి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. ఫలితం కనిపించే వరకూ రెగ్యులర్ గా అప్లై చేయండి

#4: నిమ్మరసం:

పొడి జుట్టు మరియు దురద పెట్టే తలకు మంచి నివారణ మార్గం నిమ్మరసం. నిమ్మరసంలో చాలా మంచి క్లెన్సింగ్ లక్షణాలుండటం వల్ల ఇది తలకు నేచురల్ గానే స్మూత్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. ఇది హెయిర్ స్ట్రిప్స్ నుండి సెబమ్ ను క్లియర్ చేస్తుంది మరియు డ్రై స్లాప్ ను నివారిస్తుంది.

Avoid itching and dandruff during this winter


ఎలా ఉపయోగించాలి:

రెండు చెంచాలా నిమ్మరసంను మూడు టేబుల్ స్పూన్ల పెరుగుతో మిక్స్ చేసి మీ తలకు బాగా పట్టించాలి. తర్వాత 10-15నిముషాలు అలాగే ఉంచి తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి. దురద మరియు పొడిబారిన జుట్టు తగ్గే వరకూ దీన్ని అప్లై చేయవచ్చు . రోజు విడిచి రోజు నిమ్మరసంను నేరుగా తలకు పట్టించి 10నిముషాల తర్వాత తలస్నానం చేస్తుండాలి.

#5: కొబ్బరి నూనె:
తలలో ఎటువంటి సమస్య ఉన్నా కొబ్బరి నూనె కొన్ని అద్భుతాలను చేస్తుంది. ఇది మాయిశ్చరైజింగ్ లా పనిచేస్తుంది మరియు తలలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్న మరియు దురద వంటి లక్షణాలు కనిపించినా తగ్గిస్తుంది . ఇందులో యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు మరియు హెయిర్ ఫాలిసెల్స్ లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గిస్తుంది.

Avoid itching and dandruff during this winter


ఎలా ఉపయోగించాలి:

కొద్దిగా కొబ్బరి నూనెను తలకు పట్టించి మసాజ్ చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి. ఈ సింపుల్ రెమెడీని వారానికి మూడు సార్లు అనుసరించాలి.

English summary

Avoid itching and dandruff during this winter

Irritation, itching and dandruff can all be a result of dry scalp. A dry scalp may also sometimes indicate serious medical conditions such as eczema and psoriasis. It may not be a chronic condition, but it can occur seasonally. The condition can however be treated with home remedies if it’s seasonal and may
Desktop Bottom Promotion