For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో జుట్టు నుండి వాసన నివారించడానికి చిట్కాలు

|

మాన్ సూన్(వర్షాకాలం) చాలా చల్లగా మరియు హాట్ సమ్మర్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేసవి కంటే వర్షాకాలంలో చెట్లన్నీ కూడా పచ్చగా కళకళలాడుతుంటుంది . వర్షకాలంలో వచ్చే తొలకరి జల్లులు మొదట ఫన్ గా ఉంటుంది మరియు రిఫ్రెష్ చేస్తుంది. అందువల్ల , వర్షం అంటే ఇష్టపడే వారు, వర్షంలో ఆడిపాడలను కొనే వారు, తడిసి ముద్దైన తర్వాత ఎదురయ్యే దుష్ప్రభావలను ను కూడా తెలుసుకోవాలి. వర్షకాలంలో ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే విధంగా ఆరోగ్యం, అందం గురించి కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

వర్షాకాలంలో ప్రారంభంలో తక్కువగా ఉన్నా తర్వాత తర్వాత వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. ఇలా పడటం వల్ల వాతావరణం వేడి, తేమతో కూడి ఉంటుంది. కానీ, మనకు ఆ వేడి మనకు కనబడదు. ఎందుకంటే, వాతావరణం చల్లగా ఉండటం వల్ల సూర్యుని నుండి వెలువడే యూవీ కిరణాలు మేఘాల మద్య దాగి ఉండి మనకు తెలియకుండానే మన మీద దుష్ప్రభాలు చూపుతుంది. కాబట్టి, ఎటువంటి దుష్ప్రభావాలు ఎదుర్కోకూడదనుకుంటే కొన్ని మాన్ సూన్ చికిత్సలు మరియు పద్దతులను అనుసరించడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు . మరియు మనంతట మనం మనకోసం వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి . వర్షాకాలంలో తల ఎక్కువగా తడవడం, వాతావరణంలో దుమ్ము ధూళి చేరడం, చెమట వల్ల, తలను సరిగా శుభ్రం చేసుకోవకపోవడం వల్ల తలలో దుర్వాసన మరియు ఇరిటేషన్ వల్ల, శారీరకంగా మరియు మెంటల్ గా కలత చెందాల్సి వస్తుంది. కాబట్టి, వర్షాకాలంలో జుట్టును సంరక్షణ చిట్కాలను పాటించడం వల్ల సీజనల్ సమస్యలను నివారించవచ్చు. అందుకొన్ని సింపుల్ చిట్కాలను గుర్తుంచుకోవాలి.

Avoid Smelly Hair During Monsoons: Tips

వర్షకాలంలో హెయిర్ కేర్ పూర్తి విభిన్నంగా ఉంటుందని చెప్పడం లేదు .కానీ, మిగతా సీజన్ల కంటే వర్షకాలంలో మరింత ఎక్స్ ట్రా కేర్ అవసరం. వర్షకాలంలో బ్యాక్టీరియా మరియ ఫంగస్ ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసులుకోవాలి. మరి ఆ జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం...

తరచూ తలను శుభ్రం చేసుకుంటుండాలి: మంచి ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి తలను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో అవసరం . వర్షకాలంలో తలలో ఫంగస్ అభివ్రుద్ది చెందకుండా ఉండాలంటే తలనుశుభ్రంగా ఉంచుకోవడం చాలా అసవరం. ఫంగస్ ఏర్పడటం వల్ల తల దురద మరియు తలవాసన వల్ల అసహ్యాంగా ఉండటం మాత్రమే కాదు, స్కిన్ ఇరిటేషన్ కు గురిచేస్తుంది. కాబట్టి వారంలో రెండు మూడు సార్లు హెయిర్ వాష్ చేయడం తప్పనిసరి.
షాంపు సెలక్షన్ : తేలికపాటి షాంపులను ఎంపిక చేసుకోవాలి. మీరు చుండ్రు, జుట్టురాలడమే కాకుండా తల జిడ్డుదనాన్ని కూడా కలిగిఉ౦డవచ్చు. అందువల్ల మీరు మీ జుట్టును ప్రతిరోజూ తేలికపాటి షాంపూ తో శుభ్రం చేయండి. ఆయిలీ జుట్టు కలవారు ప్రతిరోజూ షాంపూ పెట్టడానికి వేరొక కారణం కూడా ఉంది, మీ జుట్టు వర్షాకాలంలో దెబ్బతినవచ్చు, షాంపూ చేయడం వల్ల మాత్రమే మీ జుట్టు పరిమాణాన్ని పునరుద్దరించు కుంటుంది. ప్రతిరోజూ మీ జుట్టు వర్షానికి తడిస్తే ప్రతిరోజూ షాంపూ పెట్టండి.

హెయిర్ కండీషనర్స్: క్రమం తప్పక కండిషనింగ్ చేయడం ఎంతో ముఖ్యం గాలిలో తేమ అధికంగా ఉండడం వల్ల జుట్టు ముతకగా, పొడిబారి చిక్కుపడేటట్లు చేస్తుంది. ప్రతిరోజూ కండిషనింగ్ చేయడం వల్ల జుట్టు చిక్కుపడకుండా చక్కగా ఉండడానికి సహాయపడుతుంది.

డైట్ : ఆరోగ్యకరమైన జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన ఆహార పదార్ధం. అయితే, మీ జుట్టు అందంగా కనిపించాలి అనుకుంటే, చేపలు, గుడ్లు, కారెట్లు, తృణధాన్యాలు, ముదురు ఆకుపచ్చ కూరగయలు, చిక్కుళ్ళు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాలుత్పత్తుల వంటి ఎక్కువ ప్రోటీన్ గల ఆహారాన్ని తీసుకోవాలి.

హెయిర్ ప్రొడక్ట్స్ : మీకు సహజంగా ఆరోగ్యకరమైన జుట్టు లేకపోతే, మీరు స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేవారని పూర్తిగా అర్ధమౌతుంది. అయితే, వర్షాకాలంలో ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండడం మంచిది. అదనపు తేమ కారణంగా ఈ రసాయన ఉత్పత్తులు మీ జుట్టు అధికంగా జిడ్డు ఉండేటట్లు చేస్తాయి. ఇది మీ జుట్టుకు, తలకు హానికలిగిస్తుంది. ఈ గ్లం, జెల్ చుండ్రుకు దారితీస్తుంది.

English summary

Avoid Smelly Hair During Monsoons: Tips

Monsoons usher in a cooled and relieved effect from the hot summers. Everything gets washed clean and the leaves acquire a fresh green look. A stroll out in the rains becomes fun and refreshing. However, to enjoy this soaking wet weather it is important to be prepared to fight all its counter effects. One of these is smelly hair in monsoon humidity.
Story first published: Wednesday, July 9, 2014, 11:44 [IST]
Desktop Bottom Promotion