For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ బత్తాయి జ్యూస్ తో జుట్టుకు మేలైన ప్రయోజనాలు

|

సాధారణంగా అన్ని రకాల పండ్లను మీరు మార్కెట్లో చూసి ఉంటారు. అయితే వాటిలో అన్నీ ఆరోగ్యకరమైనే అయినా, మరొకిన్ని అత్యంత ఆరోగ్యకరంగా సహాపడే పండ్లు కూడా ఉన్నాయి. అత్యంత ఆరోగ్యప్రయోజనాలను అంధించే పండ్లలో బత్తాయి కూడా ఒటి. దీన్ని(మోసంబీ) స్వీటీ లైమ్ అంటారు. మోసంబీ లేదా స్వీట్ లైమ్ జ్యూస్ ఇండియాలో హాట్ ఫేవరెట్, ముఖ్యంగా సమ్మర్ సీజన్ లో వీటికి డిమాండ్ ఎక్కువ. ఇవి చూడ్డానికి పెద్దసైజు నిమ్మపండులా ఉండే బత్తాయిపండు రుచిలో మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్‌ లైమ్‌ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపురంగులో ఉంటుంది. చాలామంది ఒలుచుకుని తిన్నప్పటికీ జ్యూస్‌ రూపంలోనే దీనికి వాడుక ఎక్కువ. అందుకే పండ్లరసం అనగానే అందరికీ ఈ పండ్లే గుర్తుకొస్తాయి.

బత్తాయి రసంలో విటమిన్ సి మరియు పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందుకే ఇది ఆరోగ్యకరమైన ఎనర్జిటిక్ డ్రింక్ గా చెబుతారు. అంతే కాదు, రుచికరమైనది మరియు తాజాగా ఉండి మనల్ని రిఫ్రెష్ చేస్తాయి. ఈ బత్తాయి జ్యూస్ శరీరాన్ని చల్లబర్చడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది. మోసంబీ జ్యూస్ ఒక సాధారణ ఇండియన్ డ్రింక్. ఈ జ్యూస్ ను జ్యూస్ షాపులో కాదు, రోడ్ సైడ్ కూడా వీటిని అమ్మతుంటారు. ఇది నమ్మరసంలా, బత్తాయి అసిడ్ కు గురిచేయదు. మరియు నిమ్మలాగా పుల్లగా ఉండక, తియ్యని రుచి కలిగి ఉంటుంది. ఇన్ని సుగుణాలున్న బత్తాయి రసం జుట్టుకు కూడా గ్రేట్ గా సహాయపడుతుందనే విషయం మీకు తెలుసా? మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరం అయ్యే అనేక న్యూట్రీషియన్స్ ఇందులో ఉన్నాయి. మోసంబి జ్యూస్ ఉపయోగించి మరికొన్ని జుట్టు సంరక్షణ ప్రయోజనాలు, టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

Benefits Of Mosambi Juice For Hair

ఫ్రూట్ హెయిర్ ప్యాక్: మోసంబి ఫ్రూట్ ఉపయోగించి ఫ్రూట్ హెయిర్ ఫ్యాక్ చేసుకోవచ్చు. అందుకు మీరు, బత్తాయి నుండి జ్యూస్ ను తీసి అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. బత్తాయి జ్యూస్ జుట్టును నునుపుగా మార్చుతుంది . మరియు జుట్టుకు నేచురల్ గ్లోను అందిస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ ను మీ జుట్టుకు పట్టించి, అరగంట అలాగే ఉండి తర్వాత చల్లటినీటితో తలకు స్నానం చేయాలి . ఇలావారానికి ఒకసారి చేయాలి . ఈ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు అనుసరించాల్సిన ఒక బెస్ట్ హెయిర్ కేర్ టిప్ ఇది.

జుట్టును బలోపేతం చేస్తుంది: బత్తాయి రసం నేరుగా కూడా జుట్టుకు పట్టించవచ్చు . ఈ రసంలో విటమిన్ సి ఉండటం వల్ల ఇది జుట్టును బలోపేతం చేయడానికి సహాపడుతుంది. హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వారికి ఇది ఒక బెస్ట్ హెయిర్ కేర్ టిప్ . బత్తాయి రసం మీ జుట్టును స్ట్రాంగ్ గా మరియు నేచురల్ గా ఉండేందుకు సహాయపడుతుంది. మీ రసాన్ని మీ జుట్టుకు నేరుగా అప్లై చేయడానికి ముందు తలను ఒక సారి నీటితో తడిపి మురికిని తొలగించాలి.

హెయిర్ కలర్: ఈ ఫ్రూట్ హెయిర్ ఫ్యాక్ మరియు బత్తాయి రసం జుట్టుకు మంచి కలర్ ను అందిస్తుంది . హెన్నా మరియు మోసంబి జ్యూస్ లో జుట్టు కలర్ ను మార్చే లక్షణాలు గ్రేట్ గా ఉన్నాయి. బత్తాయి రసంలో ఉన్నటువంటి కాపర్ హెయిర్ యొక్క మెలనిన్ ను పెంచుతుంది . ఈ రెండింటి కాంబినేషన్ జుట్టు యొక్క రంగు నేచురల్ గానే బ్లాక్ గా పెరగడానికి సహాయపడుతుంది. ఎవరైతే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారో. అంటువంటి వారు ఈ హెయిర్ కేర్ టిప్ ను ఉపయోగించవచ్చు.

హెయిర్ గ్రోత్: మొత్తం హెయిర్ కేర్ లో ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు మోసంబి జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది . బత్తాయి రసం జుట్టు యొక్క నాణ్యతను మరియు స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది . జుట్టు పెరుగుదల సమస్యలతో బాధపడే వారికి చాలా మంది బత్తాయి రసంను ఉపయోగించమని సలహాలిస్తుంటారు.

నేరుగా తీసుకోవడం: బత్తాయి రసంను నేరుగా త్రాగడం వల్ల కూడా జుట్టుకు మేలు జరుగుతుంది . విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, ఈ పండ్ల రసం జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది.

English summary

Benefits Of Mosambi Juice For Hair

Mosambi juice is good for the health. This juice is rich in minerals and nutrients such as vitamin C and potassium. It is healthy as well as energising. But did you know that mosambi juice is good for your hair too?
Story first published: Monday, July 14, 2014, 17:28 [IST]
Desktop Bottom Promotion