For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ జుట్టు సమస్యలకు ఉత్తమ ఇంటి నివారణలు

By Super
|

మనకు మంచి జుట్టు సంరక్షణ మరియు ఆరోగ్యకరమైన జుట్టు అవసరం. జుట్టును జాగ్రత్తగా నిర్వహిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు సమస్యలను తగ్గించి జుట్టు అందంను పెంచుతుంది. చాలా సాధారణ జుట్టు చికిత్స కోసం మేము జుట్టు కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోము. అదీగాక మంచి ఆరోగ్యకరమైన జుట్టు అవసరం. జుట్టుకు ఏ సమస్య లేకుండా ఉన్నప్పుడు జుట్టు అందంగా కనిపిస్తుంది. సాదారణంగా ఈ రోజుల్లో జిడ్డు జుట్టు,నెత్తి మీద చర్మం దురద,పొడి జుట్టు,దెబ్బతిన్న జుట్టు మొదలైన జుట్టు సమస్యలు ఉంటాయి. జుట్టు సమస్యలకు చికిత్స కొరకు ఇంటి నివారణలను కనుగొనండి.

జుట్టు సమస్యల కోసం ఇంటి నివారణలు

హెయిర్ కండిషనర్

హెయిర్ కండిషనర్

గుడ్డు సాధారణ జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది. కండీషనర్ గా మొత్తం గుడ్డు ఉపయోగపడుతుంది. గ్రుడ్డు తెల్లసొన జిడ్డుగల జుట్టు కోసం సహాయపడుతుంది. పచ్చసొన పొడి మరియు విరిగిన జుట్టు నియంత్రించడానికి సహాయపడుతుంది. జుట్టు రకాన్ని బట్టి గుడ్డును రాయాలి. పొడి జుట్టు కొరకు జుట్టు మీద పచ్చసొన రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. జిడ్డు జుట్టు గలవారు గ్రుడ్డు తెల్లసొన ఉపయోగించండి. గుడ్డు మొత్తంను ఒక కండిషనర్ గా ఉపయోగపడుతుంది.

దెబ్బతిన్న మరియు నిస్తేజమైన జుట్టు

దెబ్బతిన్న మరియు నిస్తేజమైన జుట్టు

మొత్తం జుట్టు మీద సమానంగా సాదా పెరుగును రాయండి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో మీ జుట్టును కడగాలి. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం మూలాల నుండి జుట్టును బలోపేతం చేస్తుంది. కాలుష్యం మరియు జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులు మీ జుట్టును దెబ్బతిన్న మరియు నిస్తేజముగా చేస్తాయి. అందువల్ల ఆ ఉత్పత్తులను నివారించాలి.

నెత్తిమీద చర్మం దురదకు చికిత్స

నెత్తిమీద చర్మం దురదకు చికిత్స

సరికాని ఆహారం,పర్యావరణ మార్పులు మరియు ఒత్తిడి కారణంగా వస్తుంది. నెత్తిమీద చర్మం దురదను 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం మరియు 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ నూనెతో నయం చేయవచ్చు. ఈ రెండింటిని బాగా కలిపి తలకు పట్టించి 30 నిముషాల తర్వాత శుభ్రం గా కడగాలి.

లింప్ జుట్టు కోసం

లింప్ జుట్టు కోసం

జుట్టుకు నేరుగా బీర్ రాయండి. బీర్ లో ఉండే ఈస్ట్ జుట్టు కొరకు సహాయపడుతుంది. అర కప్పు బీర్ లో ఒక గుడ్డు మరియు ఒక స్పూన్ సన్ ఫ్లవర్ నూనె కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించండి. అప్పుడు మీ జుట్టు చాలా బాగుంటుంది.

సూర్యుని వలన దెబ్బతిన్న జుట్టు

సూర్యుని వలన దెబ్బతిన్న జుట్టు

ఒక బౌల్ లో పావు కప్పు తేనెను తీసుకోని దానికి 5-6 స్పూన్స్ ఆలివ్ నూనెను కలపండి. ఈ ద్రావణాన్ని మీ జుట్టుకు పట్టించండి. ఈ ద్రావణం సూర్యుని వలన దెబ్బతిన్న జుట్టును నయం చేస్తుంది. తేనె సూర్యుని వలన దెబ్బతిన్న జుట్టును తేమగా ఉంచుతుంది. ఆలివ్ నూనెలో అదనపు విటమిన్ E ఉండుట వలన సహజమైన జుట్టు కండీషనర్ గా ఉంటుంది.

కర్ల్ జుట్టు చికిత్స

కర్ల్ జుట్టు చికిత్స

బాగా పండిన అవెకాడో పండును మెత్తగా చేసి జుట్టుకి పట్టించండి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేయండి. అవెకాడో పండు గుజ్జులో పెరుగు లేదా గుడ్డు పచ్చసొన కలిపి కూడా ఉపయోగిస్తే మంచి పలితం ఉంటుంది.

క్రమరహిత జుట్టు కోసం బేకింగ్ సోడా

క్రమరహిత జుట్టు కోసం బేకింగ్ సోడా

బేకింగ్ సోడా లో కొద్దిగా నీరు పోసి పేస్ట్ చేసి జుట్టుకు బాగా పట్టించండి. ఈ జుట్టు మీద దాగి ఉన్న అనవసరమైన వాటిని వదిలించుటకు సహాయపడుతుంది.

English summary

Best home remedies for the common hair problems

Hair care is the necessary thing to good and healthy hair. The hair care involves the maintaining hair healthy, treats the hair problems and gives the beauty to the hair. Many of us treat the hair normally.
Desktop Bottom Promotion