For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ రూట్స్ కోసం బెస్ట్ నేచురల్ హెయిర్ ట్రీట్మెంట్

|

అందం ఒకరి సొత్తు కాదు, ఎవరి అందం వారిది, ప్రతి ఒక్కరికీ అందంగా కనబడాలనే ఉంటుంది. అయితే అది కొందరికే సాధ్యం అవుతుంది. అయితే అందం విషయంలో రాజీపడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంటే, మీరు కూడా అందంగా కనబడవచ్చు అన్న విషయం గుర్తించుకోవాలి. ముఖ్యంగా అందంగా అంటే, ఎంటువంటి మచ్చలు, చారలు, ముడుతలు, మొటిమలు లేని చర్మ సౌందర్యం. అదే విధంగా జుట్టు విషయంలో చుండ్రులేకుండా, చిక్కుబడకుండా, సిల్కీ, షైనీగా ఉంటే అది కేశ సౌందర్యం. అందుకు తగినంత శ్రద్ద తీసుకోవడం చాలా అవసరం.

కేశ సంరక్షణలో ముఖ్యంగా హెయిర్ రూట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటే, ఆటోమాటిక్ గా జుట్టుకు బలం చేకూరుతుంది. స్ట్రాంగ్ హెయిర్ మీరు కోరుకుంటున్నట్లైతే, హెయిర్ రూట్స్ మరింత స్ట్రాంగ్ గా ఉంచుకోవాలని తెలుసుకోవాలి. చాలా మంది హెయిర్ రూట్స్ తో సంబంధం లేకుండా బయటకు కనిపించే కేశాల వరకూ శ్రద్ద తీసుకుంటుంటారు. కానీ, తలను అంతగా పట్టించుకోరు. తల శుభ్రంగా ఉందా లేదా చూడరు. తల కూడా ఎంత శుభ్రంగా ఉంటే, అంత హెల్తీ హెయిర్ గ్రోత్ అవుతుంది. తలకు మసాజ్ చేయడం, జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుకోవడం వల్ల పొడవాటి స్ట్రాంగ్ మెయిర్ ను మీరు కోరుకొన్న జుట్టును పొందవచ్చు.

అందుకు మార్కెట్లో వివిధ రకాల ట్రీట్మెంట్లు, షాంపులు మరియు మసాజ్ లు ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకొని, ఉపయోగించి చూడండి. అయితే అవి నిజంగా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయా? ఇంకా మీరు నేచురల్ థెరఫీలను ఉపయోగించండి మరియు కేశాలను బలోపేతం చేసే మరే ఇతర పద్దతులను కూడా ఉపయోగించండి. అందుకు సహాయపడే కొన్ని నేచురల్ హెయిర్ రూట్ ట్రీట్మెంట్స్ పద్దతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ క్రింది పద్దతులను అనుసరించడం వల్ల ఖచ్ఛితంగా మీ హెయిర్ రూట్స్ ను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి....

తలను ఎల్లప్పుడూ క్లీన్ గా హెల్తీగా ఉంచుకోవాలి

తలను ఎల్లప్పుడూ క్లీన్ గా హెల్తీగా ఉంచుకోవాలి

జుట్టు పెరుగుదలకు మరియు తలను శుభ్రంగా ఉంచుకోవడానికి వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. తలను క్లీన్ గా ఉంచుకోవడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. తల మురికిగా ఉంటే బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది మరియు ఇతర దుమ్ము, ధూళి కారణం చేత డెడ్ స్కిన్ సెల్స్ వల్ల హెయిర్ రూట్స్ ను గ్రోత్ ను నివారిస్తుంది. కాబట్టి, తలను ఎప్పుడూ క్లీన్ అండ్ నీట్ గా ఉంచుకోవడం చాలా అవసరం.

హెల్తీ ఆయిల్స్ తో మసాజ్ చేయడం

హెల్తీ ఆయిల్స్ తో మసాజ్ చేయడం

హెల్తీ ఆయిల్స్ తో తలకు మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. అందుకు మంచి మన్నికైన నూనెలను ఉపయోగించాలి . హాట్ ఆయిల్ మసాజ్ వల్ల హెయిర్ రూట్స్ మరింత ఉత్తేజపడుతాయి. తలకు కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి, మసాజ్ చేసిన తర్వాత తలకు టవల్ చుట్టడం వల్ల జుట్టు బలపడుతుంది. మీరు ఇంకా బాదం మరియు ఇతర నూనెలను కూడా ఉపయోగించవచ్చు.రెగ్యులర్ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ బలపడుతాయి.

ఆరోగ్యకరమైన డైట్

ఆరోగ్యకరమైన డైట్

మీ జుట్టుకు ప్రోటీనులు చాలా అవసరం అవుతాయి. అందుకు మీ రెగ్యులర్ డైట్ లో హెల్తీ ప్రోటీన్ ఫుడ్స్ ను మిక్స్ చేసుకోవాలి. ముఖ్యంగా మీ డైట్ లో గుడ్డు మరియు ఫిష్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా మీరు ఫ్లాక్స్ సీడ్స్, పాలు, సోయా చుంక్స్ మొదలగునవి తీసుకోవచ్చు. ఇటువంటి ఆహారాలు మీ రెగ్యులర్ డైట్ లో ఉంటే మీ జుట్టుకు తగినంత న్యూట్రీషియన్స్ అందుతాయి . అసమతౌల్య ఆహారం వల్ల హెయిర్ రూట్స్ బలహీనపడుతాయి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో పౌష్టికాహారం చాలా ముఖ్యం.

నేచురల్ మిక్స్

నేచురల్ మిక్స్

మీరు తలకు నేచురల్ పదార్థాలు కొబ్బరి నూనె, తేనె మరియు ఎగ్ వైట్ వంటివి హెయిర్ రూట్స్ కు అప్లై చేయాలి. ఈ మూడింటిని కలిపి తలకు పట్టించడం వల్ల హెయిర్ వాల్యూ పెరుగుతుంది మరియు మంచి ఆకారం, మెరుపును అందిస్తాయి. ఈ మిశ్రమమంతో తలకు మసాజ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి . స్నానం చేయడానికి కొంచెం ముందుగానే దీన్ని తలకు పట్టించండి. తర్వాత మంచి షాంపుతో తలస్నానం చేయండి.

నీరు మంచి మూలం

నీరు మంచి మూలం

మీ శరీరంను డీహైడ్రేషన్ కు గురిచేయడం మీ హెయిర్ రూట్స్ కు మంచిది కాదు, కాబట్టి, రోజుకు కనీసం 8-10గ్లాసులు తప్పకుండా త్రాగడం మంచిది. శరీరానికి సరిపడా నీరు త్రాగడం వల్ల మీ శరీరం పూర్తి హైడ్రేషన్ లో ఉంటుంది. అంతే కాదు, ఇది మీ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

ఎక్కువ బ్రష్ చేయకండి

ఎక్కువ బ్రష్ చేయకండి

ఎప్పుడు పడితే అప్పుడు, లేదా ఎప్పుడూ తలకు బ్రష్ చేయకండి. అలా చేయడం వల్ల కూడా జుట్టు సమస్యలు లేదా జుట్టురాలడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల చిక్కు తొలగింపబడుతుందని మీరు అనుకోవచ్చు అయితే, నిరంతరం దువ్వడం వల్ల హెయిర్ రూట్ చాలాపూర్ గా మారుతుంది.

English summary

Best Natural Treatments For Hair Roots


 When you are talking of hair care, you cannot miss out on roots of the hair. They are the most important part of your hair. Root strength determines the hair strength eventually. For strong hair, you need to ensure that your roots are pretty strong.
Story first published: Monday, September 15, 2014, 17:02 [IST]
Desktop Bottom Promotion