For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వంటగదిలో ఉన్న హెయిర్ (జుట్టు) బ్యూటీ సీక్రెట్స్

By Lakshmi Perumalla
|

ఆరోగ్యకరమైన జుట్టు!మీ జుట్టు తేమ మరియు పునరుద్దరణకు ఉత్తమ కండిషనర్ల కొరకు మీ వంటగది వైపు చూడండి.

మీ రిఫ్రిజిరేటర్ లేదా అల్మరాలో ఉన్న సహజ పదార్థాలను ఉపయోగించి సులభంగా మరియు నిమిషాల్లోనే అన్ని రకాల చర్మ తత్వానికి సరిపడే నాలుగు మాస్క్ లను తయారుచేసుకుందాము.

పొడి జుట్టు - ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు

ముఖ్యంగా కొంత TLC అవసరం?? రెండు గుడ్లకు మూడు టేబుల్ స్పూన్స్ అదనపు వర్జిన్ ఆలివ్ నూనెను కలపాలి. ఈ మిశ్రమం ను మీ జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత షవర్ స్నానం చేయాలి. ఆలివ్ నూనె ఆర్ద్రీకరణ ఉంచేందుకు మరియు పెళుసు తగ్గేందుకు సహాయపడుతుంది. అయితే గుడ్లలో ఉండే ప్రోటీన్ ఆరోగ్యకరమైన జుట్టును పెంపొందిస్తుంది.

అన్ని రకాల జుట్టులకు - అవెకాడో మరియు తేనె

పండిన అవోకాడో గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ సేంద్రీయ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిముషాలు తర్వాత షవర్ స్నానం చేయాలి.

అవెకాడో లో మీ జుట్టును మృదువుగా మరియు ఆరోగ్యంగా ఉంచటానికి అవసరమైన విటమిన్ E మరియు ప్రోటీన్,వివిధ రకాల విటమిన్లు,పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. మరోవైపు,తేనె ఒక సహజ బాక్టీరియా ఏజెంట్ గా పనిచేస్తుంది.

hair beauty secrets from your kitchen

ఆయిలీ జుట్టు - ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నిమ్మకాయ

పావు కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ లో నిమ్మకాయ పై తొక్క తురిమి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి,మీ జుట్టు అదనపు చమురు శోషించడానికి 15 నిమిషాలు ఆగి,ఆతర్వాత షవర్ స్నానం చేయాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ శైలి ఉత్పత్తులు మరియు కండిషనర్లు జుట్టు నిర్మాణమును బలోపేతం చేస్తాయి. అంతేకాక మృదువుగా మరియు ప్రకాశవంతముగా చేస్తాయి. జుట్టు యొక్క pH స్థాయి సమతుల్యం, బాక్టీరియా చంపడానికి,చుండ్రు నివారించటానికి సహాయపడుతుంది.

పొడి, పొరలుగా ఉండే జుట్టు - అరటి, తేనె మరియు బాదం

బాగా పండిన సగం అరటి పండు గుజ్జులో రెండు టేబుల్ స్పూన్స్ తేనే మరియు కొన్ని చుక్కల బాదం నూనెను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత షవర్ స్నానం చేయాలి.

అరటిపండ్లు మీ జుట్టుకు తేమ మరియు మృదువైన కర్ల్ పెంచడానికి మరియు మీ నెత్తిమీద చర్మం దురద ఉపశమనానికి సహాయపడుతుంది.

మీ జుట్టుకు సరిపోయే రకాన్ని ఎంచుకోండి. మీ జుట్టు తేమ మరియు పునరుద్ధరించటానికి మార్కెట్లో కండిషనర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.

English summary

hair beauty secrets from your kitchen

Healthy Hair ! Look to your kitchen for the BEST conditioners to moisturize and revitalize your hair!
Desktop Bottom Promotion