For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్&ఆరెంజ్ జ్యూస్ తో జుట్టుకు గొప్ప ప్రయోజనాలు

|

ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా ఆరెంజ్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, ఈ సిట్రస్స్ పండ్ల వల్ల అనేక బ్యూటీ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు . ఆరెంజ్ తొక్కను అనేక ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తారన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అందువల్ల, ఆరెంజ్ జుట్టు కూడా సంరక్షణకు కూడా మంచిదన్నవిషయం ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఆరెంజ్ ఫేస్ ప్యాక్ గా మాత్రమే కాకుండా, ఆరెంజ్ జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది . ఆరెంజ్ గుజ్జు, జ్యూస్ లేదా ఆరెంజ్ తొక్కను మీ జుట్టు సంరక్షణ కోసం ఉపయోగించుకోవాలి. సాధారణంగా, ఆరెంజ్ తొక్కను ఎండలో ఎండబెట్టి, మెత్తగా పౌడర్ చేసి నిల్వచేసుకుంటుంటారు.

విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆరెంజ్ చర్మ సంరక్షణకు చాలా మేలు చేస్తుంది. ఇది ఇంకా ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ జుట్టుకు సరైన బలాన్ని చేకూర్చుతుంది . ఇంకా ఆరెంజ్ నుండి అనేక హెయిర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటిని, నేరుగా అలాగే తినడం కానీ లేదా, అప్లై చేసినా, ఇది మొత్తం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆరెంజ్ తో మరికొన్ని బ్యూటి బెనిఫిట్స్ తెలుసుకోవాలంటే : ఆరెంజ్ లోని అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్

జుట్టు విషయానికి వచ్చినప్పుడు, ఆరెంజ్ ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. ఆరెంజ్ జ్యూస్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి షైనింగ్ తో పాటు, స్ట్రాంగ్ గా మరియు సాఫ్ట్ గా ఉంచుతుంది . ముఖ్యంగా మీరు జుట్టు సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఆరెంజ్ జ్యూస్ ను తలకు పట్టించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

ఆరెంజ్ ఇంకా చుండ్రును వదలగొడుతుంది. ఆరెంజ్ లోని మరికొన్ని హెయిర్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ...

హెయిర్ లాస్:

హెయిర్ లాస్:

ఆరెంజ్ లో ఉండే విటమిన్ సి మరియు బయో ఫ్లెవనాయిడ్స్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. దాని వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది . ముఖ్యంగా ఆరెంజ్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

హెయిర్ కండీషనర్:

హెయిర్ కండీషనర్:

ఆరెంజ్ జ్యూస్ కి తేనె మరియు నీళ్ళు మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

జుట్టుకు తగిన బలాన్ని అంధిస్తుంది:

జుట్టుకు తగిన బలాన్ని అంధిస్తుంది:

మీ జుట్టు చాలా సులభంగా రాలుతున్నా మరియు హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా లేకున్నా, ఈ సిట్రస్ పండ్ల యొక్క రసాన్ని జుట్టుకు పట్టించండి.

జుట్టుకు మంచి మెరుపును అంధిస్తుంది:

జుట్టుకు మంచి మెరుపును అంధిస్తుంది:

మీకు మందపాటి, స్ట్రాంగ్ మరియు షైనీ హెయిర్ పొందాలంటే, అప్పుడు ఈ సిట్రస్స్ పండ్ల రసాన్ని అప్లై చేయండి. ఆరెంజ్ జ్యూస్ కు కొద్దిగా పాలు లేదా తేనె మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 25నిముషాలు అలాగే ఉంచి, తర్వాత తలస్నానం చేసుకోవాలి . ఇదిమంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

చుండ్రుతో పోరాడుతుంది:

చుండ్రుతో పోరాడుతుంది:

మీరు ఆరెంజ్ తొక్కను ఉపయోగించి చుండ్రును నివారించుకోవచ్చు . ఆరెంజ్ తొక్కను మెత్తగా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

. జుట్టును శుభ్రం చేస్తుంది:

. జుట్టును శుభ్రం చేస్తుంది:

ఆరెంజ్ తొక్క కూడా తలను మరియు కేశాలను శుభ్రం చేస్తుంది. పొడి చేసుకొన్న ఆరెంజ్ తొక్కను నీటిలో రాత్రంతా నానబెట్టుకొని తర్వాత రోజు ఉదయం మీ తలకు మరియు కేశాలకు పట్టించాలి. అరగంట గర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు వాసన:

జుట్టు వాసన:

మీ జుట్టు ఆయిల్ గా, చెమటతో దుర్వాసన వస్తుంటే అప్పుడు మీరు ఈ ఆరెంజ్ జ్యూస్ ను మీ కేవాలకు పట్టించవచ్చు. సిట్రస్ పండ్లు ఆరోమా వాసన కలిగి, జుట్టుకు మంచి వాసనను అంధిస్తుంది.

English summary

Hair Benefits Of Using Oranges

It is the season of oranges. Apart from being healthy, the juicy citrus fruit is famous for its beauty benefits as well. Most of us know that oranges as well as its peel is used to make many face packs. Both oranges and its peel are used as a chief or one of the ingredients to make many face packs.
Desktop Bottom Promotion