For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుకు కలర్ వేసేముందు తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

జుట్టుకు రంగు రంగుల కలర్స్ వేస్తే జుట్టు ఆకర్షణీయంగా కన్పిస్తుంది. అయితే ఈ కలరింగ్ చేయడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రంగు వేయడానికి జుట్టు కావలసిన రీతిలో తీర్చి దిద్దుకోవాలి. అలా చేయకపోతే జుట్టు ఆకారం చెడిపోవడమే కాకుండా వెంట్రుకలు రాలిపోతాయి.

హెయిర్‌ కలర్స్‌ ఉపయో గించి చర్మం రంగుకు తగ్గట్లుగా వెంట్రుకల కు రంగు వేయాలనుకున్నపుడు శాశ్వత రం గులు ఎక్కువగా వాడకూడదన్నది నిపుణుల సలహా. ఈ శాశ్వత రంగులు జుట్టు మొదల్ల లోకి వెళ్లి సహజమైన రంగును నిర్విర్యం చేస్తాయి. అందుకే రంగు వేయాలనుకున్నపుడు సంబంధిత నిపుణులను సంప్రదించాలి.తాత్కలిక రంగులు వేయడం వల్ల రెండు రకా ల ఉపయోగాలున్నాయి

కలరింగ్ చేయడానికి ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. జుట్టును శుభ్రంగా కడిగిన తర్వాతే కలరింగ్‌ చేయాలి. మురికిగా, జిడ్డుగా ఉంటే వెంట్రుకలకు రంగు సరిగా అంటుకోదు. పైగా ఇలా వేసిన రంగు ఎక్కువ కాలం నిలవదు.
2. హెయిర్‌ డైలో కొత్త బ్రాండ్‌ను వాడే ముందు మీ మోచేయి దగ్గర ఆ రంగును అద్ది 15-20 నిమిషాలు ఉంచి కడిగేయండి. ఈ పరీక్ష తర్వాత అక్కడ ఎలాంటి దురద, మంట,రియాక్షన్‌ లేనట్లయితేనే జుట్టుకు వాడండి.
3. కలరింగ్‌తో జుట్టు కుదుళ్లు బలహీనపడటం, వెంట్రుకలు చిట్లడం జరుగుతుంది. అందుకే రంగు వేసే ముందు జుట్టును కాస్త ట్రిమ్‌ చేయించండి.
4. వెంట్రుకలు స్ట్రయిటనింగ్‌, పర్మింగ్‌లాంటివి కలరింగ్‌కు రెండు వారాల ముందే చేయించండి. ఇవన్నీ కెమికల్స్‌తో కూడినవి. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వెనువెంటనే చేయిస్తే వెంట్రుకలు తమ సహజత్వాన్ని కోల్పోతాయి.
5. జుట్టుకు హెన్నా పెడితే కలరింగ్‌ చేయించకండి. హెన్నా ప్రభావం ఉన్నంత వరకు కలర్‌ అంటుకోదు. కాబట్టి హెన్నా తీసేశాకే కలరింగ్‌ చేయాలి.
6. తలపై ఎక్కడైనా గాయం, పుండు, దురద లాంటివి ఉన్నట్ల యితే కలరింగ్‌ చేయకండి. సమస్య పెరిగే ప్రమాదం ఉంది.
7. హెయిర్‌ ఎక్స్‌పర్ట్‌ను సంప్రదించి జుట్టు స్వభావం తెలుసుకోండి. ఆ తర్వాతే అవసరమైన ఉత్పత్తులు వాడండి.

Hair Color: Before and After Tips for Your Best Color

కలరింగ్‌ చేసిన తర్వాత తీసుకోవల్సిన జాగ్రత్తలు:
1. హెయిర్‌ కలరింగ్‌ తర్వాత జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త శ్రద్ధ పెడితే జుట్టు చెడిపోకుండా కలర్‌ ఎక్కువకాలం నిలచి ఉంటుంది.
2. కలరింగ్‌ చేసాక జుట్టుకు హార్డ్‌ షాంపూ, యాంటీ డేండ్రఫ్‌ షాంపూలను వాడకండి.

హెయిర్‌ డై వేసుకోవడం వల్ల పొంచిఉన్న అనారోగ్యం?
3. జుట్టు రంగు ఎక్కువకాలం నిలవాలంటే కలర్‌ ప్రొటెక్టివ్‌ షాంపూ వాడాలి.
4. కలరింగ్‌ తర్వాత వెంట్రుకలను శుభ్రపరిచినప్పుడు జుట్టు ఆరడానికి బ్లో డ్రై వాడొద్దు. దీంతో జుట్టు పొడిబారుతుంది.
5. వారానికొకసారి హెయిర్‌ స్పా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే కలర్‌ ఎక్కువకాలం నిలచి ఉంటుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
6. కలరింగ్‌ చేసేటప్పుడు రంగును చర్మంపై పడనీయకండి.
7. వారంలో ఒకటి రెండుసార్లు నూనె రాస్తే జుట్టు మృదువ్ఞగా మారుతుంది. ఊడిపోయే ప్రమాదం తగ్గుతుంది.
8. జుట్టుకు షాంపూ చేయించిన తర్వాత కండీషనర్‌ తప్పక వాడండి. దీంతో జుట్టు మృదువ్ఞగా మారి మెరుస్తుంటుంది.
9. మీ జుట్టు పొడిబారి, చిట్లిపోయినట్లు ఉంటే హెయిర్‌ సీరమ్‌ వాడితే ఉపయోగం ఉంటుంది.
10. జుట్టు స్వభావం తెలుసుకోకుండా మీకు తోచినట్లు కలర్‌ వాడితే వెంట్రుకలకు హాని కలుగుతుంది. కాబట్టి నిపుణులను సంప్రదించాకే అవసరాన్ని బట్టి కలరింగ్‌ చేయించుకోండి.

Desktop Bottom Promotion