For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఎందుకు రాలుతుంది?ముఖ్య కారణాలు-నివారణ

ప్రస్తుత రోజుల్లో పురుషుల్లోనే కాదు, మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు . అయితే పురుషుల్లో వివిధ కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. అది కూడా వివిధ పాట్రన్స్ లో జుట్టురాలుతుంది. అయితే మహిళల

|

ప్రస్తుత రోజుల్లో పురుషుల్లోనే కాదు, మహిళలు కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు . అయితే పురుషుల్లో వివిధ కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. అది కూడా వివిధ పాట్రన్స్ లో జుట్టురాలుతుంది. అయితే మహిళల్లో ఎక్కువగా తలలో మొత్తం భాగంలో జుట్టు పల్చబడటం, జుట్టు రాలడం, జుట్టు సాంద్రత తగ్గించడం వంటి సమస్యలున్నట్లు కంప్లైంట్స్ ఉన్నాయి.

అందువల్ల జుట్టు రాలడానికి నిజమైన కారణాలను గుర్తించడం చాలా ముఖ్యం. సరైన టైమ్ లో గుర్తించినట్లైతే వెంటనే పరిష్కారం చూడవచ్చు. అది కూడా జుట్టుఎంత మేరకు నష్టపోయారో అన్నదాని మీద కూడా చికిత్స అవసరం అవుతుంది. అందుకు తగినపరిష్కారం కనుక్కోవచ్చు . జట్టు రాలడానికి అనేక కారణాలు దోహదపడుతుంటాయి. అయితే ముందుగా జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకొని వాటి ఎలా అరికట్టాలో చూద్దాం...

కాలుష్యం ప్రభావం

కాలుష్యం ప్రభావం

ఆధునిక జీవనశైలిలో జుట్టును పీడిస్తున్న సమస్య వాతావరణ కాలుష్యం. పొగ, ధూళి కారణంగా జుట్టు పొడిబారి నిర్జీవమవుతుంది. కుదుళ్లు బలహీన పడి జుట్టురాలి పోతుంది, ఉన్న వెంట్రుక కూడా బలహీనమై మధ్యలోకి తెగిపోతుంది.

కాలుష్యం నుంచి రక్షణ:

బయటకు వెళ్లేటప్పుడు జుట్టు కవర్ అయ్యేటట్లు క్యాప్ లేదా స్కార్ఫ్ వాడాలి. తలస్నానం చేయడానికి ముందు నూనెతో తలంటుకోవాలి. తలస్నానానికి శీకాయ, కుంకుడుకాయలను వాడాలి. అవి సాధ్యం కాకపోతే నాణ్యమైన షాంపూలను వాడాలి.

శారీరక ఒత్తిడి

శారీరక ఒత్తిడి

నిత్యం ఉండే శారీరక ఒత్తిడులు లేదా తీవ్రంగా జబ్బు పడటం వంటి అంశాలు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలిపోయేలా చేస్తాయి. ఇలా జుట్టు రాలడాన్ని ‘టిలోజెన్ ఎఫ్లూవియమ్' అంటారు. అంటే ఈ దశలో జుట్టు ఊడిపోయే దశ అయిన టిలోజెన్ దీర్ఘకాలం కొనసాగుతుంది. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చిగా కాకుండా ఎండిపోయినట్లుగా ఉండటం గమనించవచ్చు.

అరికట్టడం ఇలా: ఇలా రాలిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది.

గర్భధారణ తర్వాత

గర్భధారణ తర్వాత

చాలామంది మహిళల్లో ప్రసవం తర్వాత తలపై జుట్టు ఎక్కువగా రాలి పలచబారిపోతుంది. దీనికి వారు అనుభవించే శారీరక ఒత్తిడి కూడా ఒక కారణం. పైగా జుట్టుకు అందాల్సిన పోషకాలు అందకుండా కడుపులోని బిడ్డకు అందుతుంటాయి.

అరికట్టడం ఇలా: తగినంత ఐరన్ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్‌లు జుట్టుకూ అందేలా చూసి దీన్ని అరికట్టవచ్చు.

ప్రోటీన్ లోపాల వల్ల

ప్రోటీన్ లోపాల వల్ల

ప్రోటీన్‌తో కూడిన ఆహారం తగినంతగా తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఈ ప్రోటీన్లే అమైనో ఆసిడ్స్‌గా విభజితమై జుట్టు పెరుగుదలకూ, రిపేర్లకూ దోహదపడతాయి.

అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారమైన చేపలు, గుడ్లు, మాంసాహారం పుష్కలంగా తీసుకోవాలి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి.

హార్మోన్ లోపాల వల్ల

హార్మోన్ లోపాల వల్ల

సాధారణంగా హార్మోన్ లోపాల సమస్య మహిళల్లో ఎక్కువ. మహిళల్లోనూ కొద్దిగా పురుష హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ స్రవిస్తుంటుంది. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) ఉన్నవారిలో టెస్టోస్టెరాన్ స్రావం ఎక్కువ. దీంతో జుట్టు రాలుతుంది. ఇక హైపోథైరాయిడిజమ్ కండిషన్ వల్ల కూడా జుట్టు రాలుతుంది.

అరికట్టడం ఇలా: పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ ద్వారానూ, హైపోథైరాయిడిజమ్ ఉన్నవారు థైరాక్సిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా.

కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల

కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్ల వల్ల

మన రోగనిరోధకశక్తే మనకు ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే జబ్బులను ఆటోఇమ్యూన్ జబ్బులుగా పేర్కొంటుంటారు. ఉదా: పేనుకొరుకుడు (అలొపేషియా ఏరేటా) వల్ల మాడు, కనుబొమలు, మీసం, గడ్డం, శరీరంలో ఏభాగంలోనైనా వెంట్రుకలన్నీ రాలిపోయి ప్యాచ్‌లుగా కనిపిస్తుంటాయి. లెకైన్ ప్లానస్ వల్ల జుట్టు శాశ్వతంగా ఊడిపోయే అవకాశం ఉంది. లూపస్ అనే కండిషన్ వల్ల కూడా శాశ్వతంగా జుట్టు రాలిపోవచ్చు.

అరికట్టడం ఇలా: ఆటోఇమ్యూన్ జబ్బుల వల్ల జుట్టు రాలుతుంటే డాక్టర్‌ను సంప్రదించి నోటిద్వారా లేదా ఇంజెక్షన్ రూపంలో స్టెరాయిడ్స్ తీసుకోవాలి.

English summary

Hair fall problem – cause and solution

Hair loss or alopecia is the loss or thinning of hair present on the body, the head especially. The severity varies from person to person. It could be spot baldness or loss all over. All these depend on the cause for hair loss.
Desktop Bottom Promotion