For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టు నివారించే హెల్తీ ఫుడ్: హోం రెమడీస్

|

సాధారణంగా వయస్సు పెరిగే కొద్ది గ్రే హెయిర్ (తెల్ల జుట్టు)ఏర్పడటం వల్ల వయస్సైన వారిగా కనబడుతుంటారు. ముఖ్యంగా చిన్న వయస్సులో తెల్ల జుట్టు కనబడితే చాలా బాధిస్తుంది. మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు వల్ల యువకుల్లో గ్రేహెయిర్ పొందడం ఒక సహజ విషయంగా మారింది. అదే విధంగా ఒత్తిడి కూడా గ్రే హెయిర్ కు ఒక ప్రధాన కారణం. జుట్టు రాలడం మరియు జుట్టు కోల్పవబడ వంటి కారణాల వల్ల హెయిర్ పిగ్మెంటేషన్ వల్ల గ్రేహెయిర్ కు ప్రధాన కారణం అవుతుంది. ఇంకా జీన్స్ లేదా వయస్సు కూడా ప్రధాణ కారణం అవుతుంది. జుట్టు గ్రేకలర్ లోకి మారడానికి మరో ప్రధాన కారణం పోషకాహారం లోపం. ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

పోషకాహార లోపం వల్ల జుట్టు గ్రేగా మారుతుంది. ప్రతి రోజూ మన శరీరానికి అవసరం అయ్యే తగినన్ని పోషకాలను అంధించడానికి, అవసరం అయ్యే పోషకాహారం తీసుకోవడం వల్ల గ్రేహెయిర్ ను నివారించడంతో పాటు, ఆరోగ్యకరమైన జుట్టును పొందవచ్చు. అందువల్ల మనం తీసుకొనే ఆహారంలో అత్యధిక పోషకాలున్న ఆహారంను మరియు జుట్టు పెరుగుదలకు సహాయపడే ఆహారాలను, అలాగే గ్రే హెయిర్ ను నివారించే ఆహారాలను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. జుట్టు మూలాల్లో మెలాన్ అనే అంశం తగ్గిపోవడం వల్ల జుట్టు గ్రేగా మారడానికి ప్రధాన కారణం అవుతుంది. కాబట్టి, కొన్నిజుట్టుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకోవడం వల్ల మెలా ఉత్పత్తి పెంచడంతో పాటు, గ్రే హెయిర్ ను నివారిస్తుంది. మరియు ఇది మీ జుట్టుకు నేచురల్ కలర్ ను అంధిస్తుంది.

తెల్లజుట్టు నివారణకు బెస్ట్ నేచురల్ హోం రెమెడీస్:క్లిక్ చేయండి

మరో ప్రక్క కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తెల్ల జుట్టుకు కారణం అవుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ మరియు అనీమియా వంటి వ్యాధులు, జుట్టును తెల్లబర్చడంలో ప్రధాన పాత్రపోషిస్తాయి. అలాగే ఎవరైన పొట్ట సంబంధిత సమస్యలతో భాదపడే వారికి కూడా జుట్టు గ్రే గా మారడానికి కారణం అవుతుంది. పొట్టలోకి విటమిన్ బి12 అందకపోతే, లేదా ఏదైనా సర్జరీ వల్ల కూడా గ్రేహెయిర్ కు కారణం అవుతుంది. పొట్ట సంబంధిత వ్యాధులు క్రోనిక్ వ్యాధులు మరియు సిలియక్ వ్యాధులు, ప్రేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా పెరగడం వల్ల కూడా గ్రేహెయిర్ కు కారణం అవుతుంది.

చిన్న వయస్సులో జుట్టు నెరవడానికి ముఖ్య కారణాలు:క్లిక్ చేయండి

తెల్ల జుట్టు నివారించడానికి ఇక్కడ కొన్ని పవర్ ఫుడ్స్ ఉన్నాయి. ఇవి జుట్టు తెలబడటాన్ని నివారించి, జుట్టు నల్లగా పెరిగేందుకు సహాయపడుతుంది. మరి ఈ నేచురల్ రెమడీస్ గురించి తెలుసుకుందాం...

తాగా ఉండే గ్రీన్ లీఫ్

తాగా ఉండే గ్రీన్ లీఫ్

తాజాగా ఉండే ఆకుకూరల్లో బి6 మరియు బి12 పుష్కలంగా ఉంటుంది. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే వీటి నుండి బి విటమిన్స్ కూడా కలిగి ఉండటం వల్ల వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తెల్ల జుట్టును నివారించడానికి సహాయపడుతుంది.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ లో కాపర్ పుష్కలంగా ఉంటుంది. కాపర్ మీ జుట్టుకు అవసరం అయ్యే మిలాన్ ను అంధిస్తుంది. మెలాన్ సెల్స్ జుట్టు కలర్ ను అంధించడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు తెల్లబడటాన్ని నివారించడానికి చాలా అవసరం అవుతుంది.

బెర్రీస్

బెర్రీస్

బెర్రీస్ లో స్ట్రాబెర్రీ, రాస్పెబెర్రీ మరియు క్రాన్ బెర్రీ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ప ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను మాత్రమే కాదు, ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ ను నివారిస్తుంది. విటమిన్ సి ఇంకా ముఖంలో ముడుతలను నివారిస్తుంది.

సాల్మన్

సాల్మన్

సాల్మన్ ఫిష్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ, హెయిర్ హెల్త్ కూడా అనుసంధనం కలిగి ఉంది. ఈ గొప్ప సీఫుడ్స్ లో పుష్కలమైన ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది. సాల్మన్ ఫిష్ లో సెలీనియం పుష్కలంగా ఉండి ఇది హార్మోన్లను ఉత్పత్తి చేసి, జుట్టు బ్లాక్ గా ఉండేందుకు సహాయపడుతుంది. సాల్మన్ ప్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

బాదం

బాదం

బాదంలో ఒక్క చర్మఆరోగ్యానికి మాత్రమే కాదు ఇది జుట్టుకు కూడా గొప్పగా మేలు చేస్తుంది. వీటిలో విటమిన్ ఇ మరియు కాపర్ రెండూ పుష్కలంగా ఉన్నాయి. గ్రే హెయిర్ నివారించడానికి మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ బాదం చేర్చుకొని, వ్యత్యాసం చూడండి.

ఉప్పు

ఉప్పు

ఉప్పులో అధికంగా ఐయోడిన్ కలిగి ఉంటుంది. ఇది జుట్టు తెల్లబడటాన్ని నివారిస్తుంది . అయితే సాల్ట్ ను డైరెక్ట్ గా తీసుకోకుండా, ఐయోడిన్ అధికంగా ఉన్న చేపలు, అరటిపండ్లు మరియు క్యారెట్స్ వంటి ఆహారాలను తీసుకోవాలి. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యనికి హానికరం అని గుర్తించుకోండి.

సన్ ఫ్లవర్ సీడ్స్

సన్ ఫ్లవర్ సీడ్స్

ప్రొద్దుతిరుగు గింజల్లో ఉండే అత్యధిక శాతం మినిరల్స్ శరీరంను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మినిరల్స్ మిలాన్ ఉత్పత్తికి చేయడానికి సహాయపడుతుంది. మిలాన్ కంటెంట్ లేదా కాపర్ కంటెంట్ తగ్గడం వల్ల తెల్లజుట్టుకు కారణం అవుతుంది. కాబట్టి, ఈ రెండు పుష్కలంగా ఉన్న ఆహారాలను ఎంపిక చేసుకోండి.

కరివేపాకు

కరివేపాకు

ప్రీమెచ్యుర్ గ్రేహెయిర్ ను నివారించడానికి కరివేపాకు బాగా సహాయపడుతుంది. కరివేపాకులో జుట్టు మూలాలను, మరియు జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడతుంది. కరివేపాకును డైట్ లో చేర్చుకోవడంతో పాటు, ఈ ఆకులను కొబ్బరినూనెలో మరిగించి తలకు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది . ఇది తెల్లజుట్టును నివారించడంతో పాటు, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఉసిరి

ఉసిరి

ప్రీమెచ్యుర్ గ్రే హెయిర్ నివారించడంలో ఉసిరికాయ ఉత్తమ హోం రెమెడీ అని చెప్పవచ్చు. ఇది ఒక విలువైన హెయిర్ టానిక్. గ్రేహెయిర్ నివారించడంలో మరియు తెల్లజుట్టు నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

డైరీ ప్రొడక్ట్స్

డైరీ ప్రొడక్ట్స్

డైరీప్రొడక్ట్స్ లో విటమిన్ బి, విటమిన్ బి6, మరియు విటమిన్ 12 అధికంగా ఉండి, ఇది రెడ్ బ్లడ్ సెల్స్ ను ఉత్పత్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. ఇది జుట్టుకు ఆక్సిజన్ ను మరియు పోషకాలను అంధిస్తుంది. ఫోలిక్ యాసిడ్ మరియు బయోటిన్ లోపం వల్ల జుట్టు తెల్లగా మారడానికి కారణం అవుతుంది. కాబట్టి, మీ రెగ్యురల్ డైట్ లో త్రుణధాన్యాలు, పాస్తా, పౌల్టీ, మాంసాం, గుడ్డు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను క్రమం తప్పకుండా తీసుకోండి.

English summary

Healthy Foods To Avoid Grey Hair: Home Remedies

Getting grey hair is natural as one grows older. But it can really get annoying when the greying of the hair appears at a younger age. With the changing lifestyle and eating patterns, it has become a natural phenomenon for youngsters to get grey hair easily.
Desktop Bottom Promotion