For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో బట్టతలను నివారించే బెస్ట్ హోం రెమడీస్

|

మగవాళ్లలో అయినా, ఆడవాళ్లలో అయినా అందంలో ప్రత్యేక పాత్ర పోషించేది జుట్టే. అందుకే చాలా మంది జుట్టును అపురూపంగా చూసుకుంటారు. కానీ అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోయి ఎందరికో మానసిక క్షోభను తెచ్చి పెడుతోంది. ఇక, బట్టతల బారినపడ్డవారి బాధ వర్ణనాతీతం.

బట్టతల సమస్య పురుషుల్లో 50 శాతంగా ఉంటే, మహిళల్లో అది 25 శాతంగా ఉంది. ఒక వ్యక్తి తల మీద లక్ష నుంచి లక్షన్నర వరకు జుట్టు కుదుళ్లు ఉంటాయి. ప్రతి జుట్టు కుదురు జీవితకాల సమయం 3 నుంచి 4 సంవత్సరాలుంటుంది. ఇందులో దాదాపు 25 నుంచి 30 జుట్టు కుదుళ్లు జీవితకాల సమయాన్ని పూర్తి చేసుకొని రాలిపోయేందుకు సిద్ధంగా ఉంటాయి. నిజానికి అది హెయిర్ ఫాల్ కాదు. కానీ, కొన్నిసార్లు పోషకాహారం, ఖనిజాల లోపం, ఫంగస్ ఇన్ఫెక్షన్‌లు, గర్భం దాల్చినపుడు, తీవ్ర మానసిక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక అనారోగ్యం వల్ల జుట్టు రాలిపోతుంది. అలాంటప్పుడు సరైన కారణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే బట్టతల, జట్టురాలే సమస్యల నుంచి బయటపడవచ్చు.

పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం: క్లిక్ చేయండి

అయితే సమస్య తీవ్రం చేసుకోవడం కంటే ముందుగానే కొన్ని ఉత్తమమైన మరియు ముఖ్యమైన సింపుల్ హోం రెమడీస్ ను ఉపయోగించడం మంచిది. మరియు ఈ హోం రెమడీస్ జుట్టును బలోపేతం చేస్తుంది. మరియు జుట్టు రాలే సమస్యను తగ్గించి బట్టతలను నివారిస్తుంది. ఈ సింపుల్ హోం రెమడీస్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి కాబట్టి, వీటిని రెగ్యులర్ గా అనుసరించడంలో ఉత్తమం. ఎవరైతే బట్టతలను నివారించాలనుకొంటున్నారో వారు జీవనశైలిలో మార్పులను చేసుకోవాలి.

1. హెయిర్ ఆయిల్ మసాజ్

1. హెయిర్ ఆయిల్ మసాజ్

హెయిర్ ఆయిల్స్ కొబ్బరి నూనె లేదా బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, కాస్టోర్ ఆయిల్, ఆమ్లా ఆయిల్ లేదా ఇతర ఎఫెక్టివ్ నూనెలతో తలకు బాగా మసాజ్ చేయడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి రెండు నేచురల్ ఎఫెక్టివ్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకొనే రెగ్యులర్ గా హెయిర్ మసాజ్ చేయడం ప్రారంభించండి.నూనెను కొద్దిగా వేడి చేసి తర్వాత తలకు పట్టించడం వల్ల తలలో బాగా పడుతుంది.

2. కొబ్బరి పాలు

2. కొబ్బరి పాలు

కొబ్బరి పాలు జుట్టు రాలడాన్ని నివారించడంలో నేచురల్ పదార్థం . ఇందులో తలకు సంబంధించిన చాలా ఎఫెక్టివ్ మరియు పోషణ అంధించగలిగే పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పచ్చికొబ్బరి మెత్తగా పేస్ట్ చేసి, పాలు తీసి, వాటిని తలకు పట్టించాలి . పురుషుల్లో బట్టతలను నివారించడంలో ఇది ఒక అద్భుతమైన మార్గం.

3. గోరింటాకు

3. గోరింటాకు

ఇందులో ఉన్న ఔషధగుణగణాల వల్ల మన ఇండియాలో ఎక్కువగా గోరింటాకును తలకు పెట్టుకుంటారు. హెన్నా లీవ్స్ ను నేరుగా తలకు పట్టించకుండా, ఆకులను, ఆవనూనెలో బాగా ఉడికించి తర్వాత, వడగట్టి, చల్లార్చి, తర్వాత ఇతర రెగ్యులర్ నూనెలతో మిక్స్ చేసి ముఖ్యంగా కొబ్బరినూనెతో మిక్స్ చేసి, రెగ్యులర్ గా పెట్టుకోవాలి.

4. ఆమ్లా

4. ఆమ్లా

ఉసిరికాయలో జుట్టుకు సంబంధించినే అనేక ఔషధగుణగణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి . ఇది జుట్టు పెరుగుదలను చాలా వేగంగా పెంచతుంది. విటమిన్ సి లోపం వల్ల కూడా జుట్టు నష్టం జరుగుతుంది. కాబట్టి, జుట్టు రాలడాన్ని అరికట్టాలంటే, ఆమ్లాను నేరుగా తినవచ్చు. లేదా తలకు పట్టించాలి. పురుషుల్లో బట్టతల నివారణకు ఒక ఉత్తమ రెమెడీ ఆమ్లాను తలకు పట్టించి రెగ్యులర్ గా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. మెంతి ఆకులు

5. మెంతి ఆకులు

హెయిర్ ఫాల్ ను అరికట్టడంలో మెంతి ఆకులు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. మెంతుల్లో హార్మోని యాంటాసిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది హెయిర్ పాలీ సెల్స్ ను పెరుగుదలకు సహాయపడుతుంది . ఇందులో ప్రోటీన్స్, మరియు నికోటిన్ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది .

6. ఉల్లిపాయ ట్రీట్మెంట్

6. ఉల్లిపాయ ట్రీట్మెంట్

పురుషుల్లో బట్టతల నివారించడానికి ఉల్లిపాయ రసం అద్భుతంగా సహాయపడుతుంది. ఉల్లిపాయను మెత్తగా పేస్ట్ చేసి, ఆ రసాన్ని తలకు పట్టించాలి. 10-15నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుుంది.

English summary

Home Remedies To Cure Baldness: Tips For Men

A healthy adult is said to lose between 50 to 100 strands of hair every day. This is said to be normal and part of the process. However, if you start to notice any deviation from normal hair fall, it is important you take stock of the situation and consult a dermatologist immediately to know the cause of the problem.
Desktop Bottom Promotion