For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో జుట్టు రాలే సమస్యలకు ఉత్తమ చిట్కాలు

|

అందం, ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, ఇలా మన జుట్టుకు, తలకట్టుకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తల మీది నుంచి కురులు కనుమరుగవుతున్న కొద్దీ మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. ఏదో కొరతగా, న్యూనతగా, లోపంగా.. ఇలా రకరకాల భావాలు మనసులో ముసురుకుంటూ.. విపరీతమైన ఆంధోళ మొదలవుతుంది. ఇక దాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. టోపీలతో మొదలుపెట్టి విగ్గులు, గమ్మింగ్‌, వీవింగ్‌ వంటి ఎన్నో మార్గాలను ఆశ్రయిస్తుంటారు. అయితే అవన్నీ కూడా చాలా తాత్కాలికమైనవి. ఇప్పటి వరకూ ఈ 'కేశ రాహిత్యాన్ని' అధిగమించేందుకు ఒక్క శాశ్వత పరిష్కారం కనుగొనబడలేదు.

కారణాలు : బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య! ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే. కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి 'బట్టతల'కు దారి తీస్తుంది. బట్టతల విషయంలో ఎన్నో సిద్ధాంతాలున్నాయిగానీ ప్రధానంగా పురుష హార్మోన్‌ అయిన 'టెస్టోస్టిరాన్‌'.. జన్యుపరమైన కారణాల రీత్యా.. వీరిలో తల మీది చర్మంలో 'డీ హైడ్రో టెస్టోస్టిరాన్‌'గా మారిపోతూ.. వేగంగా వెంట్రుకలు వూడిపోయేందుకు కారణమవుతుందన్న భావన బలంగా ఉంది. అందుకే సాధారణంగా యుక్తవయసులో ఒంట్లో టెస్టోస్టిరాన్‌ స్థాయి పెరుగుతుండే దశ నుంచే ఈ బట్టతల రావటమన్నదీ మొదలవుతుంది. తల మీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్‌ ప్రభావం మాడు మీద, నుదురు దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే.. వెనక భాగంలోనూ.. ఇరుపక్కలా కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి.

పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం: క్లిక్ చేయండి

బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఎందుకంటే ఇది స్త్రీలలోనూ కనిపిస్తుంది. చాలామంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు రాలిపోయిందని భావిస్తుంటారుగానీ వీటి ప్రభావం చాలా తక్కువ. బట్టతల రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే మూలం. కాబట్టి, బట్టతలను నివారించడానికి కొన్ని ఉత్తమ చిట్కాలు మీకోసం...

పురుషుల్లో బట్టతలను నివారించే బెస్ట్ హోం రెమడీస్: క్లిక్ చేయండి

గుడ్డుపచ్చసొనతో మసాజ్:

గుడ్డుపచ్చసొనతో మసాజ్:

ఒక బౌల్లో గుడ్డు పచ్చసొన మరియు తేనె మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి బాగా మసాజ్ చేసి అలాగే అరగంట వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

మెంతులతో మాస్క్:

మెంతులతో మాస్క్:

మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ నీటితో సహాయ ఉదయం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు బాగా పట్టించి ఒక గంట తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా ఒక నెల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

సమతుల్య ఆహారం:

సమతుల్య ఆహారం:

పురుషుల్లో బట్టతలకు ప్రధాన కారణం సమతుల్య ఆహారం తీసుకోకపోవడమే. కాబట్టి, పురుషులు వారు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారంలో కాల్షియం, మెగ్నీషయం, మరియు జింక్ అధికంగా ఉండే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవాలి. వీటితో పాటు ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు, దువ్వుకూడదు.

ఆవనూనెతో మసాజ్:

ఆవనూనెతో మసాజ్:

ఒక కప్పు మస్టర్డ్ ఆయిల్ మరియు నాలుగు చెంచాల గోరింటాకులను వేసి గోరువెచ్చగా కాచి, ఒక బాటిల్లో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రెగ్యులర్ గాల తలకు పట్టించి మసాజ్ చేస్తుంటే కొన్ని వారలకు మంచి ఫలితం పొందవచ్చు.

ఉల్లిపాయ పేస్ట్ మసాజ్:

ఉల్లిపాయ పేస్ట్ మసాజ్:

బట్టతల ఏర్పడుతున్న ప్రదేశలో, ఉల్లిపాయ పేస్ట్ వేసి మసాజ్ చేయాలి. ఉల్లిపాయ పేస్ట్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హోం మేడ్ షాంపు:

హోం మేడ్ షాంపు:

రెండు చెంచాల పెరుగు, రెండు చెంచాల శెనగపిండి మరియు ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి, ఇక గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ హోం మేడ్ షాంపు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

5.

హెర్బల్ రెమడీస్:

హెర్బల్ రెమడీస్:

ఆమ్లా, శీకాకాయ్, రీలా వీటిని ఒక గిన్నెలో వేసి అందులో రెండు లీటర్ల నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. నీరు సగం అయ్యే వరకూ ఉడికించాలి. ఈ నీటిని కొబ్బరి నూనె లేదా అలొవెరా జెల్ తో మిక్స్ చేసి తలకు మసాజ్ పట్టించాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Home Remedies for Hair Loss in Men

Hair loss is a condition when a person faces extreme hair fall. Baldness as it is referred to, can be due to hereditary reasons, medication or even because of medical conditions. A little bit of hair fall every day is normal and is part of the growth cycle but when the hair loss becomes a little more than the usual, it might cause baldness.
Desktop Bottom Promotion