For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ స్ట్రెటన్నింగ్ కొరకు హోం మేడ్ టిప్స్ హెయిర్ స్ట్రెయిటనింగ్

By Mallikarjuna
|

ప్రస్తుత ట్రెండ్ లో స్ట్రెయిట్ హెయిర్ బాగా పాపులర్ గా ఉంది. ఏ అమ్మాయిని చూసిన స్ట్రెయిట్ హెయిర్ చేయించుకొని చాలా అందంగా కనబడుతున్నారు. ముఖ్యంగా స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవాడనికి కొన్ని వేలల్లో డబ్బును ఖర్చుపెడుతున్నారు. కానీ అనుకోకుండా వారి వారి ఒరిజినల్ హెయిర్ యొక్క నాణ్యతను కోల్పోవడం మరియు నేచురల్ స్ట్రక్చర్ ను కోల్పోతున్నారు. హెయిర్ స్ట్రెయిటనింగ్ లో అనేక కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యలతో పాటు మరికొన్ని సహాజంగా పెరిగే జుట్టుకు హాని కలిగిస్తుంది. సాధారణంగా మనం రోజూ ఎంతో మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన హెయిర్ స్టౌల్ ను మెయింటైన్ చేస్తుంటారు. కొందరికి కర్లీ హెయిర్‌ వుంటే మరి కొందరికి స్ట్రెయిట్‌ హెయిర్‌ వుంటుంది. తమ సహజసిద్ధమైన కేశాలను ఇష్టపడేవారూ ఉన్నారు. అలా కాకుండా నిటారుగా ఉన్న జుట్టును వంకీలు తిప్పించుకునేవారు, నొక్కులుగా ఉన్న కురులను తిన్నగా మార్చుకునేవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా స్ట్రైయిటనింగ్ హెయిర్ స్టైల్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

హెయిర్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకున్నప్పుడు అంటే పెర్మింగ్, స్ట్రెయిటెనింగ్ వంటి వాటి వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు పొడిబారిపోయి, నిస్తేజంగా, నిర్జీవంగా మారిపోతాయి. కొన్ని సందర్భాలలో చివర్లు చిట్లిపోవడం, కుదుళ్లు పూర్తిగా దెబ్బతినడం కూడా జరుగుతుంటుంది. ఐరన్ మరియు కెమికల్స్ తో కురులను స్ట్రెయింట్ చేయించుకోవడం వల్ల కురులకు డ్యామేజ్ కలగవచ్చు. అందువల్ల కురులను స్టైయింట్ చేసుకోవడానికి కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఎంపిక చేసుకోవడం వల్ల నేచురల్ గానే స్ట్రెయిట్ హెయిర్ ను పొందవచ్చు. అందుకోసం కొన్ని నేచురల్ హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను మీకోసం కొన్ని...

పాలు:

పాలు:

ఒక స్ప్రే బాటిల్లో 1/3కప్పుల నీటిని వేయాలి. అంతే పరిమాణంలో పాలు మిక్స్ చేయాలి. రెండింటిని బాగా మిక్స్ చేసి, మీ తలకు స్ప్రే చేసుకోవాలి. జుట్టు మొత్తం ఇలా స్ర్పే చేసుకొన్న తర్వాత, దువ్వెనతో చిక్కు తొలగించాలి. ఇలా మీరు తలస్నానం చేసుకోవడానికి ఒక గంట ముందు చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. తలస్నానానికి షాంపు మరియు కండీషనర్ ను ఉపయోగించండి. స్ట్రెయిటనింగ్ ఎఫెక్ట్ మీరు తిరిగి తలస్నానం చేసే వరకూ అలాగే ఉంటుంది.

పాలు మరియు హనీ :

పాలు మరియు హనీ :

పాలు ఒక్కటే మీ కేశాలను స్ట్రెయిట్ చేస్తుంది, కానీ, తేనె మీ జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. తేనె పొడిబారిన మరియు కర్లీ హెయిర్ ను మ్యానేజ్ చేస్తుంది.

Multani మిట్టీ :

Multani మిట్టీ :

ఫుల్లర్ ఎర్త్(ముల్తానీ మట్టి)ఒక కప్పు తీసుకొని అందులో ఒక గుడ్డు మరియు 5టీస్పూన్ల బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయాలి. జుట్టు చిక్కు తొలగించడానికి ఒక వెడల్పు పళ్ళున్న దువ్వెనను ఉపయోగించాలి. ముల్తానీ మట్టి మిశ్రమాన్ని తలకు పట్టించడానికి ముందు కనీసం రెండు మూడు సార్లు తలను దువ్వుకోవాలి. తల దువ్వుతూ ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. హెయిర్ ప్యాక్ వేసుకొన్న తరవ్ాత 40నిముషాలు అలాగే కొద్దిసేపు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నాలుగు రోజులకొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు :

ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డు :

రెండు గుడ్లు తీసుకొని పగులగొట్టి, లోపలి మిశ్రమాన్ని బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగామిక్స్ చేసి తలకు బ్రష్ ద్వారా పట్టించాలి. ఒకటి రెండు గంటలు అలాగే ఉంచి తర్వాత షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. ఇది మీ జుట్టును స్ట్రెయిట్ చేస్తుంది మరియు మరింత ఉత్తమంగా పోషణను అంధిస్తుంది.

నిమ్మ రసం మరియు కొబ్బరి పాలు :

నిమ్మ రసం మరియు కొబ్బరి పాలు :

ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పాలు మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టి ఇది క్రీమ్ లా చిక్కబడే టప్పుడు బయటకు తీసి తర్వాత కురులకు మరియు తలబాడుకు బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత వేడినీళ్ళలో టవల్ ను ముంచి తలకు చుట్టి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల కురులు నిఠారుగా మారుతాయి.

హాట్ కొబ్బరి నూనె :

హాట్ కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెను వేడి చేసి, తలకు పట్టించాలి. హాట్ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత, తలకు వేడినీటిలో ముంచిన టవల్ ను తలకు చుట్టి 20-30నిముషాలు అలాగే ఉండాలి. దాని తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత కేశాలు నేచురల్ గా ఆరనివ్వండి. మీ కేశాలు చూడటానికి గ్లాసీగా మరియు నేచురల్ గానే స్ట్రెయిట్ గా కనబడుతుంటాయి.

English summary

Home Remedies to Straighten Hair Naturally

The trend of hair straightening is in, these days. Girls are spending thousands of bucks on getting their hair straight. But, ultimately they are harming the texture of their hair, and losing the nourishment because lots of chemicals used in this process, which are very harmful for their hair.
Story first published: Saturday, May 10, 2014, 16:38 [IST]
Desktop Bottom Promotion