For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

By Mallikarjuna
|

జుట్టు రాలడం, రఫ్ హెయిర్ మరియు చిక్కుబడిన హెయిర్ తో మీరు బాధపడుతున్నారా?ఈ సమస్యలను నివారించడం కోసం పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేస్తూ, రసాయనాలతో తయారుచేసిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారా? అప్పుడు ఈ వ్యాసం మీకోసమే . మీకున్నటువంటి అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించడానికి గుడ్డు సహాయపడుతుంది.

గుడ్డు..శిరోజాలకు..వెరీగుడ్డు...

గుడ్డును జుట్టుకు ఉపయోగించడం వల్ల అది జుట్టుకు నాణ్యతను పెంచుతుంది, చిక్కును తగ్గించాడానికి లేదా కఠినమైన జుట్టును తగ్గించడానికి గుడ్డు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ చౌవకౌన గుడ్డును ఉపయోగించి, మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఒక్కడ కొన్ని గుడ్డుతో తయారుచేసిన ప్యాక్స్, షాంపులు, మరియు కండీషనర్స్ ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ జుట్టును కాపాడుకోండి.

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్ హెయిర్ కోసం ఎగ్ హెయిర్ ప్యాక్

కావల్సినవి:

గుడ్డు

ఆలివ్ ఆయిల్

తయారుచేయడం: రెండు గుడ్లను తీసుకొని , అందులో నుండి పచ్చసొనను వేరు చేయాలి, పచ్చసొనను బాగా గిలకొట్టి, అందులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, రెండు బాగా కలగలిసిపోయేలా మిక్స్ చేయాలి. అంతే మీ హెయిర్ మాస్క్ రెడీ. ఈ మిశ్రమాన్నిఅప్లై చేయడానికి ముందు నాణ్యమైన షాంపూతో మీ తలకు స్నానం చేయాలి . తల తడిగా ఉన్నప్పుడు, ఈ మిశ్రమాన్ని మీ తలకు మొత్తానికి పట్టించాలి . ఇప్పుడు తలకు షవర్ క్యాప్ ధరించి 20నిముషాలు అలాగే ఉంచాలి. తర్వాత నార్మల్ షాంపూతో తలస్నానం చేయాలి. గుడ్డులో ఉండే ప్రోటీన్ అంశం జుట్టును స్ట్రాంగ్ గా మరియు సాఫ్ట్ గా చేస్తుంది . ఆలివ్ ఆయిల్ జుట్టుకు తగినంత తేమను అంధించి హైడ్రేషన్ లో ఉంచుతుంది. మంచి కండీషనర్ గా పనిచేస్తుంది.

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

షైనీ హెయిర్ కోసం ఎగ్ ప్యాక్:

కావల్సినవి:

గుడ్డు

నిమ్మరసం

తయారుచేయడం: ఒక గుడ్డును బౌల్లో తీసుకొని, అందులో రెండు చెంచాలా నిమ్మరసం జోడించాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి అలాగే వదిలేయాలి. అరగంట తర్వాత నాణ్యమైన షాంపుతో తలస్నానం చేసుకోవాలి . తర్వాత మీ జుట్టు గ్లాసీగా మరియు మంచి షైనింగ్ తో మెరుస్తుంటుంది. అలాగే నిమ్మరసం చుండ్రును నివారిస్తుంది. తలలో పొడిని తగ్గిస్తుంది .గుడ్డు మీ జుట్టుకు గ్లాసీ స్ట్రక్చర్ ను ఇస్తుంది.

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

గుడ్డు కండీషర్ :

కావల్సినవి:

గుడ్డు

కొబ్బరి నూనె

తయారుచేయడం:

ఒక బౌల్లోనికి రెండు గుడ్డులలోని పచ్చసొన తీసుకొని , బాగా పల్చబడే వరకూ గిలకొట్టాలి. ఇప్పుడు అందులో రెండు చెంచాలా కొబ్బరి నూనె వేసి, బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రామన్ని మీతలకు నార్మల్ వాష్ చేసిన తర్వాత మీ తలకు ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. 5నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఫలితంగా మీరు డీఫ్ కండీషనర్ ను మీరు గమనించవచ్చు . ఇది రఫ్ మరియు ఫిజ్జీ హెయిర్ ను తొలగించి హెయిర్ ను సాష్ట్ గా చేస్తుంది.

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

గుడ్డుతో ఆరోగ్యకరమైన జుట్టును పొందడం ఎలా

గుడ్డు షాంపు:

నిజంగా ఈ ఎంగ్ షాంపును తయారుచేయడా చాలా సింపుల్.

కావల్సినవి:

గుడ్డు

ఆపిల్ సైడర్ వెనిగర్

అలోవెర

మినిరల్ వాటర్

జుట్టుకు అనేక విధాలుగా సహాయపడే వాటిలో గుడ్డు ప్రధానమైన అంశం. కానీ ఒకే ఒక డిస్ అడ్వాటేజ్ ఇది ముఖానికి అట్టుకోవడం వల్ల వాసన కలిగిస్తుంది.

తయారుచేయడం:

ఒక బౌల్లో గుడ్డు తీసుకొని అందులో ఆపిల్ సైడర్ వెనిగర్, 3చెంచాలా అలోవెర జెల్ మరియు అరకప్పు మినిరల్ వాటర్ వేయాలి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి, నురుగా వచ్చే వరకూ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని తలకు షాంపూలాగా ఉపయోగించాలి.

Desktop Bottom Promotion