For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్ హెడ్(నుసటన)జుట్టురాలడం నివారించే ఎఫెక్టివ్ టిప్స్

|

సౌందర్యంతో పాటు కురులకు కాపాడుకోలేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. జుట్టు రాలిపోయి అసౌకర్యంగా.. అందవిహీనంగా కనబడుతారు. కాబట్టి ఉన్న జుట్టు ఊడిపోకుండా, చుండ్రు లేకుండా కురులను ఆరోగ్యంగా కాపాడుకొన్నట్లైతే అందమైన కేశ సౌందర్యం మీ సొంతమౌతుంది. ముఖ్యంగా ఫోర్ హెడ్(తల నుదిటి బాగంలో చాలా మంది అతి త్వరగా జుట్టు రాలిపోతుంటుంది. లేదా ఫోర్ హెడ్ దగ్గర కురులు పెరగకుండా అలాగే ఉండిపోయి నుదిటి బాగం ఎక్కుగా కనబడేలా చేస్తుంది. అంతే కాదు క్రమంగా అది అలాగే పెరుగుతుంటే, అది కాస్త బట్టతలగా మార్పు చెందుతుంది. అందుకు ప్రధాన కారణం జీన్స్, న్యూట్రీషియన్ లోపం వల్ల నుదిటి భాగంలో జుట్టు రాలవచ్చు. కాబట్టి జుట్టు రాలిపోకుండా కాపాడి, జుట్టుపెరిగేలా చేసే కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కొంతమంది జుట్టు రాలిపోతుందని గాభరా పడి హెయిర్ ట్రీట్మెంట్ లకు అనవసరమైన డబ్బును వృధా చేస్తుంటారు. అటువంటి అవసరం లేకుండానే సహజపద్దతులను ఉపయోగించి ఇంట్లో కురుల పెరుగుదలకు చక్కటి జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే అందమైన, దట్టమైన మీ కేశ సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఆయిల్ మసాజ్ నుండి హెయిర్ ప్యాక్ ల వరకూ జుట్టు పెరుగుదలకు వివిధ మార్గాలను ప్రయత్నించి, నుదిభాగంలో కప్పిఉంచేలా జుట్టును పెంచుకోవచ్చు.

వీటిని పాటించడంతో పాటు డైట్ ప్లాన్ ఉదా: ఐరన్ అధికంగా ఉన్న ఆహారాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇతర జుట్టు నష్టాన్ని తగ్గిస్తాయి. విటమిన్లలోపం, అనారోగ్యకరమైన లైఫ్ స్టైల్ మరియు హెయిర్ కేర్ లో అశ్రద్దం వల్ల జుట్టు రాలడానికి ప్రధానకారణంగా ఉంది. కాబట్టి, మీరు హెల్తీగా తింటూ ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించండి. ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణం అవుతుంది. కాబట్టి, ఒత్తిడి తగ్గించుకొని, నేచురల్ గా ఈ క్రింది చిట్కాలను అనుసరించినట్లైతే ఫోర్ హెడ్ (నుదిటి భాగంలో)జుట్టురాలకుండా కాపాడుకోవచ్చు.

హాట్ ఆయిల్ మసాజ్:

హాట్ ఆయిల్ మసాజ్:

జుట్టు పెరుగుదలలో ఇది ఒక ఉత్తమ హోం రెమడీ. కొబ్బరినూనె, బాదంనూనె, మరియు లావెండర్ నూనె వంటివి ఉపయోగించడం వల్ల ఇవి రిలాక్స్ గా ఉంటుంది. హాట్ ఆయిల్ మసాజ్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. మరియు జుట్టును బలోపేతం చేయడంతో పాటు, న్యూరిష్ గా ఉంచతుంది.

ఆముదం:

ఆముదం:

మీరు ఆముదం కూడా జుట్టు పెరుగుదలలో ఉపయోగించుకోవచ్చు . ఇది ఒక ఉత్తమ హెయిర్ ఆయిల్. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి, ఆముదం నూనెను ఫోర్ హెడ్ (నుదిటి భాగంలో)అప్లై చేసి మరియు ఇతర బట్టతల ప్రాంతంలో అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. అయితే ఎక్కువగా నూనెను అప్లై చేయకండి. అది మొటిమలు, మచ్చలకు దారితీస్తుంది.

హెన్నా:

హెన్నా:

మీరు ఫర్ ఫెక్ట్ హెన్నా ప్యాక్ ఎంపిక చేసుకొనే వేసుకోవచ్చు. అందుకు ఆమ్లా, శీకాకాయ్, బ్రాంహ్మీ మరియు పెరుగు లేదా తాజాగా ఉండే హెన్నా లీవ్స్ ను, కరివేపాకు, మందరాకు మరియు మెంతాకు లేదా మెంతులను ఉపయోగించుకోవచ్చు.

బ్రంహ్మీ :

బ్రంహ్మీ :

మెమరీని పెంచడంతో పాటు, బ్రంహ్మీ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. బ్రాంహ్మీ పౌడర్ ను పెరుగు తో మిక్స్ చేసి జుట్టుకు ఫోర్ హెడ్ లో అప్లై చేయాలి. అరగంట తర్వాత నాణ్యమైన షాంపుతో స్నానం చేసుకోవాలి.

జుట్టును మరీ బిగుతుగా టైట్ చేయకూడదు:

జుట్టును మరీ బిగుతుగా టైట్ చేయకూడదు:

మీ జుట్టును మరీ బిగుతుగా పోనీటైల్ లేదా ముడి, లేదా బన్ వేయకూడదు . బ్యాక్ బ్రష్ చేయడం నివారించండి. ఇది జుట్టు పెరుగుదలను అడ్డుకొని, జుట్టు రాలడం మరింత వరెస్ట్ గా చేస్తుంది.

బ్యాంగ్స్:

బ్యాంగ్స్:

హోం రెమడీలను ఉపయోగించడంతో పాటు, కొన్ని సందర్భాల్లో ఒక మంచి హెయిర్ కట్స్ ను ప్రయత్నించి ఫోర్ హెడ్ ను కవర్ చేయవచ్చు.

హెయిర్ కేర్:

హెయిర్ కేర్:

జుట్టు సంరక్షణలో భాగంగా కేశాల శుభ్రత మరియు జుట్టును దువ్వుకోవడం, ఆయిల్ మసాజ్ వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు:

ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మరియు రెడ్ మీట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

English summary

Increase Hair Growth On Forehead: Remedies

There are a lot of people who have a big forehead. You might try to hide that big forehead by getting a haircut with bangs. However, nothing works. A lot of people suffer from less hair growth on their forehead.
Story first published: Thursday, March 20, 2014, 17:54 [IST]
Desktop Bottom Promotion