For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్నవయస్సులో జుట్టు తెల్లబడుటకు వైద్య కారణాలు

|

ప్రస్తుత కాలంలో చిన్న వయస్సులోనే చాలా మంది తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. అది వారి జీవశైలి, ఆహారపు అలవాట్ల మీద ఆదరపడి ఉంటుంది. మీరు కనుక 20-25ఏళ్ళ మధ్య ఉన్నట్లైతే, మీకు అప్పడే జుట్టు తెల్లబడటం మొదలైనట్లైతే, అందుకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సమాజంలో మీరు ఒక్కరు మాత్రమే ఈ సమస్యను ఎదొర్కోవడం లేదు, ఇప్పుడు ఈ సమస్య చాలా సాధరణం అయ్యింది. ఇది యంగర్ జనరేషన్ కు మీద చాలా ప్రభావం చూపుతోంది. సహజంగా జుట్టు తెల్లబడుతోందంటే, అది వయస్సైపోతుందని అర్ధం. కానీ, ప్రతి ఒక్కరిలోనూ, లేదా ఎప్పుడు వయస్సు పెరుగుతుండటం వల్ల జుట్టు తెల్లబడదు. చాలా చిన్న వయస్సులో జుట్టు తెల్లబడుటకు కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి.

జుట్టు తెల్లబడటానికి ఒక ప్రాథమిక కారణం వైద్యపరమైన కారణాలు జుట్టును గ్రేగా మార్చుతుంది. ముఖ్యంగా వైద్యపరమైన టీట్మెంట్ల వల్ల జుట్టుకు సంబంధించిన మెలనిన్ క్షీణిస్తుంది. మెలనిన్ అనేది జుట్టుకు సహజంగానే రంగును ఇస్తుంది. వయస్సు పెరిగే కొద్ది మెలనిన్ తగ్గిపోతుంది. కానీ ఈ రోజుల్లో, అకాల తెల్లజుట్టు రావడానికి ప్రస్తుత రోజుల్లో మెలనిన్ వేగంగా క్షీణించడమే. తెల్ల జుట్టు ఏర్పడటానికి ముందుగా అనేక కారణాలున్నాయి.

కాబట్టి, ఇలా అకాలంలో ఏర్పడే తెల్ల జుట్టును నివారించుకోవాలంటే, అప్పుడు అందుకు మీరు కొన్ని వైద్యపరమైన కారణాలు తెలుసుకోవాలి. తెల్ల జుట్టు ఏర్పడటానికి కంటే ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

జెనటిక్ కోడ్

జెనటిక్ కోడ్

కొన్ని సమయాల్లో తెల్ల జుట్టు ఏర్పడటానికి కారణం వంశపారంపర్యం. మీ తల్లిలో అతి త్వరగా జుట్టు తెల్లబడుతుంటే, అది మీలో కూడా అలాగే కొనసాగే అవకాశం ఉంది.

విటమిన్ బి 12

విటమిన్ బి 12

విటమిన్ బి 12 లోపం వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది . ఈ మెలనిన్ తిరిగి మన శరీరంలో ఉత్పత్తి అవ్వడానికి విటమిన్ బి12చాలా అవసరం అవుతుంది.

థైరాయిడ్ గ్లాంట్ మాల్ ఫంక్షన్

థైరాయిడ్ గ్లాంట్ మాల్ ఫంక్షన్

థైరాయిడ్ మరియు హైపోథైరాయిడిజం వంటి కారణాల చేత కూడా జుట్టు తెల్లగా మారుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది డయాగ్నసైజ్డ్ చేసుకోవడం వల్ల తెల్ల జుట్టుకు కారణం అవుతుంది.

హార్మోనుల అసమతుల్యత

హార్మోనుల అసమతుల్యత

చాలా మంది మహిళలు తమ గర్భధారణ సమయంలో జుట్టు గ్రేగా మరుతుందని చెబుతుంటారు . ఇది హార్మోనుల అసమతుల్యత వల్ల ఇలా సహజంగా జుగరుతుంటుంది.

పిట్యూటరీ గ్రంథులు

పిట్యూటరీ గ్రంథులు

పిట్యూటరీ గ్రంథులు జుట్టు పెరుగుదలకు మరియు అభివృద్ధికి సహాయపడుతాయి. ఎప్పుడైతే ఈ గ్రంధి లోపం జరుగుతుందో అప్పడు వయస్సు పెరగడంను వేగవంతం చేస్తుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది.

ఐయోడిన్ లోపం

ఐయోడిన్ లోపం

ఐయోడిన్ మన శరీరానికి అవసరం అయ్యే మినిరల్స్ అంధించడంలో సహాయపడుతుంది . కాబట్టి, శరీరంలో అయోడిన్ లోపిస్తే, మినిరల్స్ లోపం ఏర్పడి జుట్టు తెల్లబడుటకు కారణం అవుతుంది.

రక్తహీనత

రక్తహీనత

అనీమియా(రక్త హీనత)మిమ్మల్ని మరింత బలహీనంగా ఉంచుతుంది. అది కూడా కొన్ని సందర్భాల్లో తెల్ల జుట్టుకు కారణం అవుతుంది.

మాల్ న్యూట్రీషియన్

మాల్ న్యూట్రీషియన్

చిన్న వయస్సులోనే పోషకాహార లోపం. దాంతో మీ శరీరంకు అవసరం అయ్యే పోషకాలు అందకపోవడం చేత త్వరగా వయస్సైన వారిగా మార్చుతుంది.

కాపర్ లోపం

కాపర్ లోపం

కాపర్ కూడా మినిరల్స్ లో జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడేది కాపర్. కాబట్టి, కాపర్ లోపిస్తే జుట్టు తెల్లగా మారుతుంది.

ఆందోళన మరియు టెన్షన్

ఆందోళన మరియు టెన్షన్

మీరు ఎప్పుడైతే అధిక ఒత్తిడి మరియు టెన్షన్ కు గురి అవుతారో వారిలో హెయిర్ రూట్స్ కు న్యూట్రీషియన్ సప్లిమెంట్ తగ్గిపోతుంది. ఇది జుట్టు తెల్లబడుటకు ఒక ప్రధానకారణం.

English summary

Medical Causes Of Grey Hair

If you are 25 something years old and already greying at the temples, don't panic because you are not alone. Premature grey hair is today a common problem affecting the young generation. Greying is seen as a sign of ageing.
Story first published: Friday, February 28, 2014, 16:08 [IST]
Desktop Bottom Promotion