For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో అనుసరించాల్సిన నేచురల్ హెయిర్ కేర్ టిప్స్

|

వేసవికాలంలో చర్మ సంరక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో... అదే విధంగా జుట్టు సంరక్షణకు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడికి చర్మం తర్వాత ఎక్కువగా సూర్యుని బారిన పడేది వెంట్రుకలే. ఎండ వేడిమి కారణంగా వెంట్రుకలు నిర్జీవంగా తయారవుతాయి. సూర్యరశ్మిలోని అల్ట్రావైలెట్‌ కిరణాల కారణంగా కొనలు చిట్లి, పొడిబారినట్లు కనిపిస్తాయి. వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీ కురులు పట్టుకుచ్చుగా వుంటాయి.

మీ కేశాలను బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారా..అయితే ఈ సమ్మర్ లో కేశాల మీదు బాధ్యత తీసుకుంటున్నారా?సమ్మర్ అంటే ఫన్నీ డేస్ ఎందుకంటే సెలవులను మరియు ఔట్ డోర్ ట్రిప్పులను ఎంజాయ్ చేయడానికి ఇదే మంచి సమయం. అయితే వీటితో పాటు వేసవిలో వచ్చే అనుకోని హెయిర్ ప్రాబ్లెమ్స్ కొన్ని ఉన్నాయి. సీజన్ మారేకొద్ది, మీ కేశ సంరక్షణలో కూడా మార్పులు చేసుకోవాలి. వేసవి కాలంలో మన శరీరాన్ని మరియు చర్మాన్ని ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచుకోవడానికి తగుజాగ్రత్తలు తీసుకొన్నట్లే ఈ వేసవి సమయంలో కేైశాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

మీరు మీ కేశాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే..మరి ఈ సమ్మర్ లో సింపుల్ మరియు హైజీనిక్ హెయిర్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. కేశ సంరక్షణలో అధిక శ్రద్ద తీసుకోవడం వల్ల అందంగా సంవత్సరం మొత్తం హెల్తీ హెయిర్ ను పొందవచ్చు. మరి ఆ సమ్మర్ హెయిర్ కేర్ టిప్స్ ఆడర్ మిస్ కాకుండా ఫాలో అయిపోండి..మీ కేశాలను బ్యూటిఫుల్ గా పెంచేసుకోండి...

ప్రతి రోజూ తలస్నానం:

ప్రతి రోజూ తలస్నానం:

సమ్మర్ లో ప్రతి రోజూ లేదా ఆల్టర్ నేట్ డేస్ లో తలస్నానం చేయడం చాలా ముఖ్యం. సమ్మర్ లో అధిక వాతావరణ కాలుష్యం వల్ల దుమ్ము, ధూళి తలలో చేరి, చెమటతో తల మురికిగా మారి జుట్టు రాలడానికి కారణం అవుతుంది . కాబట్టి రెగ్యలర్ తలస్నానం వల్ల మీ తలను మరయు జుట్టును ఆరోగ్యంగా అందంగా పెట్టుకోవచ్చు.

తలస్నానానికి చల్లటినీరు ఉపయోగించాలి :

తలస్నానానికి చల్లటినీరు ఉపయోగించాలి :

వేసవి కాలంలో ఎప్పుడూ స్నానానికి చల్లటి నీటిని ఉపయోగించాలి. వేడినీళ్ళు తలస్నానానికి అంత మంచిది కాదు.

జుట్టుకు ఆయిల్ మసాజ్ నిలపకండి:

జుట్టుకు ఆయిల్ మసాజ్ నిలపకండి:

వేసవిలో తలకు ఆయిల్ మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల తలలోని దుమ్ము మరియు ధూళిని తొలగిస్తుంది. ఆయిల్ మసాజ్ వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో జుట్టుయొక్క రూట్ కెనాల్ కు తగినంత శక్తి అందుతుంది కేశాలు స్ట్రాంగ్ గా పెరుగుతాయి. తలస్నానానికి ముందు ఇలా చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మారుతాయి.

తరచూ షాంపు పెట్టి, తలస్నానం చేసుకోవాలి:

తరచూ షాంపు పెట్టి, తలస్నానం చేసుకోవాలి:

సమ్మర్ లో మీ రెగ్యులర్ షాంపూను మార్చడం చాలా ముఖ్యం. మీరు రెగ్యులర్ గా ఉపయోగించే కఠనమైన షాంపు మరియు సోపులు తలలోని మురికి వదలవు కాదు కదా ఇంకా మీ కేశాలను పొడిగా మార్చేస్తాయి. కాబట్టి మైల్డ్ షాంపూను ఉపయోగించడం మేలు.

వేసవిలో ఎప్పుడు స్కార్ఫ్ లేదా హాట్ పెట్టుకోవాలి:

వేసవిలో ఎప్పుడు స్కార్ఫ్ లేదా హాట్ పెట్టుకోవాలి:

మీరు ఈ వేసవిలో బయట ఎక్కువ సమయం గడపాల్సి వస్తే మీ తలను కప్పి ఉంచడం చాలా అవసరం. ఉదా: తలకు కర్ఛీప్ లేదా కాటన్ వస్త్రాన్ని చుట్టుకోవడం లేదా హ్యాట్ పెట్టుకోవడం వల్ల తలకు కేశాలకు డైరెక్ట్ సన్ నుండి రక్షణ కల్పించవచ్చు.

కూలింగ్ ఆయిల్స్ ఉపయోగించాలి:

కూలింగ్ ఆయిల్స్ ఉపయోగించాలి:

కొన్ని రకాల నూనెలు అశ్వగంధ, ఆమ్లా మరియు బ్రహ్మి వంటి నూనెలు జుట్టుకు చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ నూనెలు సహజ చల్లదనాన్ని అందించేవిగా పనిచేస్తాయి. ఈ సమ్మర్ లో మీ కేశాలను చల్లగా ఉంచుకోవాలంటే ఈ స్మూతింగ్ హెయిర్ ఆయిల్స్ ను ఉపయోగించాలి. అయితే ఈ ఆయిల్స్ ను పగలు మాత్రమే జుట్టుకు పట్టించాలి.

జుట్టుకు సరిపడా హైడ్రేషన్ అంధించాలి:

జుట్టుకు సరిపడా హైడ్రేషన్ అంధించాలి:

వేసవిలో అధికంగా నీరు త్రాగడం మరో ముఖ్యమైన విషయం. వేసవితాపానికి మీ శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి తిరిగా శరీరం నీటిని, తేమను పొందాలంటే అధికంగా నీరు త్రాగాలి . ఇది కేశాలకు కూడా చాలా మంచిది. వేసవిలో జుట్టును బిగుతుగా జడ లేదా, ముడి వేయకుండా ఫ్రీగా వదులుగా వేసుకోవాలి.

తగినన్ని నీరు మరియు ఇతర జ్యూస్ లు తీసుకోవాలి:

తగినన్ని నీరు మరియు ఇతర జ్యూస్ లు తీసుకోవాలి:

అన్ని చిట్కాలలో కల్లా ముఖ్యమైనది, మొట్టమొదటిది మిమ్మలిని మీరు హైడ్రేటెడ్ ఉంచుకోండి. జుట్టు కుదుళ్ళు గట్టిగా, మృదువైన కేశాలు ఉండాలంటే మీరు ద్రవాలిని ఎక్కువగా తీసుకోండి. మీరు తీసుకునే నీటి స్థాయిని పెంచండి. కొబ్బరినీళ్లు, పళ్లరసాలు, సలాడ్లను తరచూ తీసుకుంటుండాలి. ఇవి చర్మం ఇంకా కేశాలు పొడిబారకుండా నిగారింపు సంతరించుకునేలా చేస్తాయి. ఎక్కువ మోతాదులో నీరును తాగాలి. శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పంపబడుతుంది కాబట్టి ఎక్కువ నీరు తీసుకోవడం చాల మంచిది.

మీ జుట్టును నేచురల్ గా తడి ఆర్పుకోవాలి:

మీ జుట్టును నేచురల్ గా తడి ఆర్పుకోవాలి:

తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టును నేచురల్ గా తలను ఆర్పుకోవాలి. మీ జుట్టు ఆల్రెడీ వేడిగా ఉంటుంది. కాబట్టి, తలను నేచురల్ గా చల్లటి వాతరణంలో తలను ఆరనివ్వాలి.

సమ్మర్ ఫ్రెండ్లీ హెయిర్ స్టైల్:

సమ్మర్ ఫ్రెండ్లీ హెయిర్ స్టైల్:

స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం నివారించండి. అవి వేడి చేస్తాయి. రోలర్లు, వేడి ఐరన్స్ మరియు వేడి గాలి వీచి ఆర బెట్టేవి వంటి హాట్ స్టైలింగ్ ఉపకరణాలు మీ జుట్టుకు చెడును చేకూరుస్తాయి. మీకు గాలితో ఆరబెట్టుకోవటం తప్పనిసరి అయితే కండీషనర్ తో కలిపి ప్రయత్నించండి. ఇలా చేయటం, వేడి నుండి కాపాడుకోవటానికి అదనంగా పని చేస్తుంది.

వేసవిలో జుట్టుకు రక్షణ చర్యలు పాటిస్తూ వెంట్రుకలపట్ల సరైన శ్రద్ధ తీసుకుంటే వేసవి ప్రభావం జుట్టు మీద ప్రసరించదు. మీ కురులు నిగనిగలాడుతూ మెరిసిపోతాయి.

English summary

Natural Hair Care Tips For Summer

Every season brings its own unique challenges with it. Now that it is summer and the mercury is already rising, you need to know some natural hair care for summer. In winter, you usually have a lot of hair fall due to dryness in the atmosphere.
Story first published: Thursday, March 27, 2014, 17:51 [IST]
Desktop Bottom Promotion