For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

|

జుత్తు పొడిబారకుండా సహజ సౌందర్యంతో నిగనిగలాడుతూ ఉండాలి. కొందరిలో జుట్టు అందవిహీనంగా, నిర్జీవంగా మారడానికి పోషకాహారలోపం ప్రధాన కారణం అంటున్నారు కొందరు సౌందర్య నిపుణులు. పోషకాహారం తీసుకోవడం అన్నది శరీరానికే కాకుండా శిరోజాలకు చాలా మేలు చేకూరుస్తుందని వారు చెబుతున్నారు. పోషకాహారం వలన జుట్టు ఊడిపోవడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలను తేలికగానే అధిగమించవచ్చు.

జుట్టు రాలిపోతున్నదని చాలా మంది ఆందోళన పడుతూ ఉంటారు. పలు రకాల నూనెలు రాసి, జుట్టు రాలడాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారు. నిజానికి కొన్ని ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంతో పాటు ఆరోగ్యమైన జుట్టును పొందే వీలుందంటున్నారు నిపుణులు. కాబట్టి నిగనిగలాడే జుట్టు కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం.

క్యాబేజ్:

క్యాబేజ్:

జుట్టు పెరిగేందుకు సిలికా అనే మినరల్ చాలా అవసరం. క్యాబేజీ, దోసకాయ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, ఓట్స్‌లో ఈ మినరల్ అధికంగా ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

సోయా ప్రొడక్ట్స్ :

సోయా ప్రొడక్ట్స్ :

సోయాపాలు లేదా సోయా చిక్కుడులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. జుట్టురాలడాన్ని సోయా సమర్థంగా అరికడుతుంది.

జీడిపప్పు:

జీడిపప్పు:

ఠీజుట్టు పెరిగేందుకు జింక్ చాలా అవసరం. అది జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది.

చికెన్:

చికెన్:

మీరు మాంసాహారులైతే చికెన్ తీసుకోవడం వల్ల నిగనిగలాడే జుట్టును సొంతం చేసుకోవచ్చు. చుట్టు ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్, ఐరన్ చికెన్‌లో లభిస్తుంది.

బాదం:

బాదం:

ఆల్ఫాలినోలెటిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ యాసిడ్ బాదంపప్పు, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో అధికంగా ఉంటుంది.

పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది

పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది

పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కాల్షియం చాలా అవసరం. అందుకే ఎదిగే పిల్లలకు రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎముకలు పెరగడంతో పాటు నిగనిగలాడే జుట్టు వస్తుంది. 7. కోడిగుడ్డు: గుడ్డు వేడి చేస్తుందని చాలా మంది అనుకుంటారు. అయితే అది అవాస్తవం. ఎందుకంటే గుడ్డులో సల్ఫర్ శిరోజాలను అందంగా, ఆకర్షణీయంగా వుంచడానికి దోహదపడుతుంది. అందువల్ల ప్రతి రోజూ ఆహారంలో గుడ్డు తీసుకోవడం మంచిది. కోడిగుడ్లలో బయోటిన్‌లో పాటు విటమిన్ బి12 ఉంది. ప్రొటీన్‌లు కూడా అత్యధికంగా ఉండే కోడిగుడ్లు తీసుకోవడం కేశాల ఆరోగ్యానికి ఎంతైనా అవసరం.

ఖర్జూరం:

ఖర్జూరం:

ఇనుము లోపం వలన కూడా జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్జూరంలో ఇనుము అధికంగా లభిస్తుంది. ఖర్జూరం ఎండ వేడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది కూడా టమోటో, బత్తాయి,

ఉసిరి:

ఉసిరి:

విటమిన్ సి లోపం వలన కూడా జుట్టు చిట్లిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. దాంతో అందవిహీనంగా కనపడతాయి. జామలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనితో పాటు ఉసిరి, టమాటా, బత్తాయి తదితరాలు సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి.

మాంసకృత్తులు:

మాంసకృత్తులు:

కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచడానికి దోహదపడుతుంది. చేపలలో ఎక్కువగా లభిస్తాయి. అయితే గుడ్లు, చేపలు తినలేని వారు సోయాను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. సోయాలోని లైసిన్ అమినో ఆమ్లం జుట్టు కుదుళ్ళను ఆరోగ్యంగా వుంచుతుంది.

నీరు :

నీరు :

నీటితో పాటు కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, సలాడ్ లు అధికంగా తీసుకోవాలి. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా బాదం, పిస్తా, జీడిపప్పు, మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, ఆకుకూరలు, వెజిటబుల్స్ తీసుకోవాలి.

English summary

Natural Ways to Keep Your Hair Black

Move that shampoo and conditioner aside. The pursuit of luscious, shiny locks starts with fish, beans, bananas, and lentils. Indeed, a healthy diet is as good for the 150,000 hair follicles on your head as it is for your body. "Having a balanced diet, while putting a little extra emphasis on things like protein and iron, gives your hair a boost,"
Story first published: Tuesday, April 22, 2014, 18:43 [IST]
Desktop Bottom Promotion