For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తెల్ల జుట్టు నివారణకు బెస్ట్ నేచురల్ హోం రెమెడీస్

|

తెల్ల జుట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో పొందడం సహజం. ముఖ్యంగా గతంలో వయస్సు పెరగడం వల్ల హార్మోనుల అసమతుల్యతతో తెల్ల జుట్టు ఏర్పడుతుండేది. కానీ ప్రస్తుత కాలంలో ఒత్తిడి, జీవశైనలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల, కాలుష్యం వల్లకూడా చిన్న వయస్సులలోనే చాలా మంది తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.

తెల్ల జుట్టుకు ప్రధాణ కారణం అనారోగ్యకరమైన డైట్, టన్స్ లో ఒత్తిడి వంటివి ప్రధాన కారణంగా ఉన్నాయి . చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో మీరు కూడా ఒకరైతే, మీరు మీ జుట్టు కోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదే మంచి సమయం. అందువల్ల మీ జుట్టు మొదల్లో మెలనిన్ ఉత్పత్తికి కొంత సమయం ఉంటుంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటాన్ని, దాచుకోవడం కూడా కష్టమైన పనే. ఈ సమస్య ఉన్నవారు వివిధ రకాల హెయిర్ కేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ తెల్లజుట్టును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

తెల్ల జుట్టు సమస్య ఉన్నప్పుడు, మార్కెట్లో దొరికే కొన్ని రసాయనిక ఉత్పత్తులను ఉపయోగించే తెల్లజుట్టు కనబడకుండా చేస్తారు, కానీ జుట్టు మొదళ్ళు మాత్రం బలహీనపడుతాయి . అందువల్ల, తెల్లజుట్టు నివారణకు కొన్ని హోం రెమెడీస్ ను ఉపయోగించి మీ జుట్టును సహజంగా, నేచురల్ కలర్ ఉండేట్లు పెంచుకోండి . అటువంటి హోం రెమెడీస్ కొన్ని మీకోసం ఈ క్రింది విధంగా ఉన్నాయి..

అల్లం:

అల్లం:

మీ తెల్లజుట్టును, నేచురల్ హెయిర్ కలర్ పొందాలంటే, ఈ హోం రెమెడీని ప్రయత్నించాల్సిందే. కొంచెం అల్లం తీసుకొని, చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి, కొద్దిగా పాలు జత చేసి చిక్కటి పేస్ట్ గా తయారుచేసి, మీ తెల్లజుట్టుకు పట్టించి , పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేస్తే, మంచి ఫలితం ఉంటుంది.

తేనె:

తేనె:

తేనె ఉపయోగించడం వల్ల మీ జుట్టు నేచురల్ గా కనిపిస్తుంది. తెల్ల జుట్టుకు కొంచెం, తేనె అప్లై చేయడం వల్ల మీ జుట్టు నేచురల్ గా మారుతుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం పిండి, మిక్స్ చేసి, తలకు పట్టించడం వల్ల మీ జుట్టు రంగా నేచురల్ గా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిం, పది నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పాలు:

పాలు:

పాలు జుట్టుకు మంచి షైనింగ్, పోషణ అంధించడంతో పాటు, నేచురల్ కలర్ ను కూడా అంధిస్తుంది . కాబట్టి, ఒక కప్పు పాలను తలమీద పోసుకొని, ఐదు, పది నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో షాంపుపెట్టి, తలస్నానం చేసుకోవాలి.

కరివేపాకు:

కరివేపాకు:

పొడిబారిన మరియు జిడ్డుగల జుట్టు బెస్ట్ హోం రెమెడీ కరివేపాకు అని నిపుణుల సలహా.అంతే కాదు, ఇంకా ఇది తెల్లజుట్టుకు కరివేపాకు నేచురల్ హెయిర్ కలర్ అంధిస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగు, మరియు హెన్నా రెండూ సమంగా తీసుకొని, మెత్తగా పేస్ట్ ను కలుపుకొని, తలకు ప్యాక్ లా వేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికొకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం మరియు ఉల్లిపాయ గుజ్జును తలకు పట్టించడం వల్ల జుట్టు మంచి షైనింగ్ తో పాటు, నేచురల్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. ఈ హోం రెమెడీని నాలుగు వారాలకొకసారి ప్రయత్నించండి.

బ్లాక్ పెప్పర్:

బ్లాక్ పెప్పర్:

ఉడికించిన బ్లాక్ పెప్పర్ వాటర్, తెల్లజుట్టు నివారణకు ఒక మంచి హోం రెమెడీ. ఇది తెల్లజుట్టుకు వ్యతిరేకంగా నేచురల్ హెయిర్ కలర్ ను కలిగి ఉంటుంది. తలస్నానం చేసిన తర్వత చివరగా ఒక మగ్గు బ్లాక్ పెప్పర్ వాటర్ ను తలరా పోసుకోవాలి.

ఆమ్లా:

ఆమ్లా:

జుట్టు సంరక్షణ విషయంలో ఈ హోం రెమెడీని పురాత కాలం నుండి ఉపయోగిస్తున్నారు.జుట్టుకు ఉసిరి ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ కేర్ ప్రొడక్ట్. మీ తెల్ల జుట్టును నివారిస్తుంది. మరియు జుట్టుకు మంచి షైనింగ్ తో పాటు, బలాన్ని కూడా చేకూర్చుతుంది.

బ్లాక్ టీ లేదా కాఫీ:

బ్లాక్ టీ లేదా కాఫీ:

బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ హెయిర్ కేర్ కు నేచురల్ గా చలా మంచిది. అదే విధంగా మీ గ్రేహెయిర్ ను నివారించడంలో కూడా ఈ నేచురల్ కలర్ అంధించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.

English summary

Reverse Grey Hair To Natural Colour

There comes a time in our life when we are standing in front of the mirror and suddenly notice a long strand of silver hair shining bright. The silver strand fears most of us especially the younger generation who least expect to see a so called 'silver lining'.
Desktop Bottom Promotion