For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల యొక్క జుట్టు స్ట్రాంగ్ గా హెల్తీగా ఉండాలంటే

|

సాధారణంగా జుట్టు అందంగా మరియు హెల్తీగా ఉండాలనే కోరిక మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఒక కోరిక. ఇతరులను ఆకర్షించడం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండటం వల్ల పురుషులను వ్యక్తిగతంగా సంతోషంగా ఫీల్ అవుతారు. అదే జుట్టు సరిగా లేకున్నా, జుట్టు సమస్యలున్నా ఇతరుల నుండి కామెంట్స్ పొందడం తప్పదు.

పురుషులు ఎవరైతే అందంగా కనబడాలని కోరుకుంటారో మరియు సొసైటీలో ఒక మంచి ఇమేజ్ ఉండాలని కోరుకుంటారో అటువంటి వారికి హెల్తీ హెయిర్ చాలా అవసరం. జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాతవరణ కాలుష్యం, డస్ట్ వల్ల జుట్టు నాణ్యత తగ్గిపోతుంది. డస్ట్ ఎక్కువ సమయంలో తలలో నిల్వ ఉండిపోవటం వల్ల జుట్టును బలహీనపరచడంతో పాటు, జుట్టు సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది. వాతావరణ కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల జుట్టుకు ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ముఖ్యంగా పురుషులు కేశాల మీద తగిన శ్రద్ద తీసుకోకపోతే ప్రయోజనం ఉండదు.

అలాగే హెయిర్ డ్యామేజ్ కు మరో కారణం అధికంగా రసాయనాలు ఉపయోగించడం. హెయిర్ సలూన్ల వల్ల కూడా ఎక్కువగా జుట్టుకు నష్టం జరుగుతుంది. ఇలాంటివి ఎక్కువగా తరుచూ చేసుకోవడం మీ జుట్టుకు అంత మంచిది కాకపోవచ్చు . ఈ ఆర్టికల్ ఒక మంచి ఆరోగ్యకరమైన మరియు హెల్తీ హెయిర్ గురించి మాట్లడుతున్నాం . కాబట్టి, హెల్తీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ పొందాలంటే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, శ్రద్ద పెట్టడం చాలా అవసరం. పురుషులు ఆరోగ్యకరమైన మరియు స్ట్రాంగ్ హెయిర్ పొందడానికి మరో పెద్ద సీక్రెట్ హెయిర్ స్టైల్స్ ను అడాప్ట్ చేసుకోవాలి. పురుషుల యొక్క జుట్టు స్ట్రాంగ్ గా మరియు హెల్తీగా పొందడానికి ఈ క్రింద కొన్ని పాయింట్స్ ఉన్నాయి...

హెయిర్ కెమికల్స్ ను దూరంగా ఉండాలి:

హెయిర్ కెమికల్స్ ను దూరంగా ఉండాలి:

హెల్తీ హెయిర్ కోసం తక్కువ కెమికెల్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకుంటే, లిమిట్ గా ఉపయోగించడం వల్ల మీ జుట్టును స్మూత్ గా మరియు అందంగా కనబడేలా చేస్తాయి. అయితే, అధికంగా రసాయనికి ఉత్పత్తులను ఉపయోగిస్తేనే సమస్య. ఎక్కువ కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు మూలలు బలహీనపడి జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది.

షాంపు:

షాంపు:

ప్రతి ఆల్టర్ నేట్ డేస్ షాంపు పెట్టి తలస్నానం చేసుకోవచ్చు. అదే కాకుండా ఎటువంటి చుండ్రు ఇతర సమస్యలు లేకుండా జుట్టు స్ట్రాంగ్ గా మరియు హెల్తీ గా ఉంచడమే కాకుండా తలస్నానం జుట్టు మూలాలను బలపడేలా చేసి, స్మూత్ గా మార్చుతాయి .

టైట్ హ్యాట్స్:

టైట్ హ్యాట్స్:

టైట్ గా ఉండే హ్యాట్స్ ధరించడం వల్ల జుట్టు రాలడానికి ఇది ఒక ముఖ్య కారణం. టైట్ గా ఉండే హ్యాట్ వల్ల తలమాడు మీద ఒత్తిడి, ఒరిపిడి జరిగి మీ హెయిర్ రూట్స్ ను వీక్ గా మార్చుతాయి. టైట్ గా ఉండే హ్యాట్ ను ధరించడం వల్ల హెయిర్ ఫాల్ కు స్వాగతం పలికినట్లవుతుంది.

టవల్ ఉపయోగించడానికి ముందు డ్రై చేయడం:

టవల్ ఉపయోగించడానికి ముందు డ్రై చేయడం:

తలస్నానం చేసి తర్వాత టవల్ తో తలను తుడుచుకుంటారు. తలలో మాయిశ్చరైజ్ కంటెంట్ టవల్ తో రుద్దడం వల్ల హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవుతాయి. కాబట్టి తలను టవల్ తో తుడుచుకోవడానికి ముందు కొద్దిగా తడి ఆర్పడం వల్ల హెయిర్ స్టాండ్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి.

హెల్మెట్స్:

హెల్మెట్స్:

హెల్మెట్స్ మరో సమస్య. హ్యాట్స్ తో పోల్చితే, హెయిర్ డ్యామేజ్ కలిగించడానికి ఇదో మరో ప్రత్యామ్నాయం . కాబట్టి, హెల్మెట్ కూడా పర్మనెంట్ హెయిర్ ఫాల్ కు గురిచేస్తుంది.

జుట్టుకు నూనె పెట్టుకోవడం:

జుట్టుకు నూనె పెట్టుకోవడం:

హెయిర్ జెల్స్ ఉపయోగించడం కంటే జుట్టుకు తరచూ నూనెను అప్లై చేయండం మంచిది. రెగ్యులర్ గా ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్ట రాలడాన్ని నివారించుకోవచ్చు. మరియు మీ హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ మరియు హెల్తీగా ఉంచుకోవచ్చు.

హెల్తీ లైఫ్ స్టైల్:

హెల్తీ లైఫ్ స్టైల్:

మన శరీరంలో ఏ అవయవమైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీ లైఫ్ స్టైల్ చాలా అవసరం. ఆరోగ్యానికి మాత్రమే కాదు, స్కిన్ మరియు హెయిర్ హెల్త్ కూడా మంచి ఆహారపు అలవాట్లు జీవనశైలి కలిగి ఉండాలి. వ్యాయామం, ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. రెండవ ఆలోచన లేకుండా స్మోకింగ్, ఆల్కహాల్ వంటివాటికి దూరంగా ఉండాలి.

English summary

Secrets To Strong And Healthy Hair For Men

Having nice and healthy hair is any man's dream. Apart from being significantly attractive to the fairer sex, healthy hair actually makes you feel good. But bad hair can be a source of uninvited comments and can be extremely unappealing at times.
Story first published: Thursday, June 5, 2014, 17:32 [IST]
Desktop Bottom Promotion