For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిట్లిన జుట్టును నివారించేందుకు హెయిర్ ట్రిమ్మింగ్

|

జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండ, కాలు ష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్‌, స్ట్రెయిటనింగ్‌, కలరింగ్‌ వంటివన్నీ శిరోజాలను దెబ్బతీసేవే! హెయిర్‌ సై్టలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటా యి. చిట్లినవెంట్రుకలను బాగుపరచాలన్నా,కళ తప్పని జుట్టుకు జీవం పోయాలన్నా ఈ మేలైన టిప్స్ పాటించాలి.

వారానికి మూడుసార్లు మాత్రమే! : షాంపూలో సహజ సిద్ధమైన గుణాలు ఉన్నవి ఎంచుకోవాలి. రసాయనాలు ఎ క్కువగాఉన్నవి,ఎక్కువసార్లు షాంపూవాడటం వంటివి చేస్తే వెంట్రుకలు త్వరగా పొడిబారుతాయి. వారానికి మూడు సార్లకన్నా ఎక్కువగా షాంపూను ఉపయోగించకూడదు. రోజు విడిచి రోజు తలస్నానం చేసి నా పర్వాలేదు. అయితే వేడినీటిని తలస్నానానికి ఉపయో గించƒపోవడం మేలు.

Tips on How to Trim Your Hair At Home

ట్రిమ్మింగ్‌! వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టడానికి మంచి పరిష్కారం ట్రిమ్‌ చేయడం. 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్‌ చేయించుకోవాలి.

ఇంటి చికిత్స :
నూనెతో మర్దన:
జుట్టు తేమను అందిం చాలంటే నూనెతో మసాజ్‌ చేయడం సరైన పద్ధతి. కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనె లేదా బాదం నూనెలను కలిపి మాడు కు పట్టించి, మర్దనా చేయాలి. అరగంట వదిలేసి ప్రకృతి సిద్ధ గుణాలు ఉన్న షాంపూతో తల స్నానం చేయాలి.

గుడ్డుతో:
మూడు టేబుల్‌ స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌, టేబుల్‌స్పూన్‌ తేనె గుడ్డు సొనలో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.

బొప్పాయితో:
ప్రొటీన్లు ఎక్కువగా గల బొప్పాయి పండు ను గుజ్జులా చేయాలి. ఈగుజ్జులో పెరుగు కలిపి తలకు ప ట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చే స్తే తేమ కోల్పోయిన వెంట్రుకలకు తిరిగి జీవంలభిస్తుంది.

తేనెతో:
తలస్నానం చేసిన తర్వాత చాలామంది కండిషనర్‌ వాడుతుంటారు. దానికి బదులుగా వెంట్రుకలకు కండిషన ర్‌లా ఉపయోగపడే కప్పు తేనెలో రెండు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. 15 ని.ల తర్వాత నీటితో కడిగేయాలి.

English summary

Tips on How to Trim Your Hair At Home

How to cut your own hair to get rid of split ends or to give yourself a quick trim. Here are 3 easy ways to cut hair tutorials with step by step tips.
Story first published: Wednesday, May 14, 2014, 18:56 [IST]
Desktop Bottom Promotion