For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టురాలడం తగ్గించి, జుట్టుపెరిగేలా చేసే నేచులర్ ఫుడ్స్

|

మీకు తరచూ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతోందా. ముఖ్యంగా మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో గమనించాలి. అలాగే చాలా మంది జుట్టురాలే సమస్యను నివారించుకోవడానికి అనేక హెయిర్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటారు. కానీ వాటితో తగిన ఫలితం మాత్రం ఉండదు.

అటువంటప్పుడు మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం మీద ఖచ్చితంగా శ్రద్దతీసుకోవాలి. జుట్టు రాలడం తగ్గించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఒక అత్యంత ప్రభావవంతమైన స్టాటజీతో జుట్టు రాలడం తగ్గించుకోవాలి మరియు జుట్టు పెరుగుదలకు పోషణను అందివ్వాలి. అందుకు మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో వాటి మీద కాస్త శ్రద్ద పెట్టాలి. జుట్టు రాలడం అరికట్టి, సెన్సిటివ్ గా జుట్టు పెరుగుదలను ప్రోత్సహింతే కొన్ని ఎక్సలెంట్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. పరిశీలించండి.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ఫిష్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, జుట్టు రాలడం అరికట్టవచ్చు . సాల్మన్ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ బి12మరియు ప్రోటీనులు అధికంగా ఉన్నాయి. అధికంగా జుట్టు రాలడం, జుట్టు వీక్ గా ఉండటాన్ని నివారిస్తుంది.

నట్స్:

నట్స్:

నట్స్ లో ముఖ్యంగా బాదం, జీడిప్పు, వాల్ నట్స్ మరియు పీనట్స్ వంటంటివి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో జమరియు జుట్టు రాలడం నివారించడంలో బాగా సహాయపడుతాయి. అందుకు సహాయపడే విటమిన్స్, ఐరన్, జింక్, మినిరల్స్, ప్రోటీన్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ వంటివి వీటిలో అత్యధికంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు.

ఓట్స్:

ఓట్స్:

హెయిర్ బ్రేకేజ్ ను నివారించి, జుట్టు రాలడాన్ని తగ్గించే ఒక నేచురల్ ఫుడ్ ఓట్స్. స్త్రీ మరియు పురుషుల ఇద్దరిలో సహజంగా జుట్టు పెరగాలనుకుంటే మీ రెగ్యులర్ డైట్ లో ఓట్స్ చేర్చుకోండి. ఇందులో కాపర్, జింక్, పొటాషియం, విటమిన్ బి, ప్రోటీన్స్ మరియు మైక్రోన్యూట్రీయంట్స్ అధికంగా ఉన్నాయి.

సన్ ఫ్లవర్ సీడ్స్:

సన్ ఫ్లవర్ సీడ్స్:

జుట్టురాలడాన్ని సహజంగా నివారించాలంటే మీ రెగ్యులర్ డైట్ ప్లాన్ లో ప్రొద్దతిరుగుడు విత్తనాలను చేర్చుకోవాలి. విటిలో కాపర్, క్యాల్షియం, ఐరన్, బయోటిన్, మెగ్నీషయి, జింక్ ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీలను అధికంగా ఉన్నాయి. పచ్చిగా ఉన్న సన్ ఫ్లవర్ సీడ్స్ ను గుప్పెడు తీసుకుంటే చాలు మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. గుప్పెడుకు మించి ఎక్కువగా తీసుకోకండి. చిన్న మొత్తంలో తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బీన్స్:

బీన్స్:

బీన్స్ లో వివిధ రకాలున్నాయి. వాటిలో ఎక్కువగా వినియోగించేవి కిడ్నీ బీన్స్, నేవీ బీన్స్, బ్లాక్ బీన్స్, పింటో బీన్స్ మరియు సోయా బీన్స్, బీన్స్ లో అత్యంధిక శాతంలో జింక్, విటమిన్ సి, మరియు విటమిన్ బిలున్నాయి. ఇటువంటి మినిరల్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే వీటిలో ఫైబర్ మరియు లోక్యాలరీ ప్రోటీనులను కూడా కలిగి ఉంది.

క్యారెట్:

క్యారెట్:

క్యారెట్స్ కంటిచూపుకు ఒక గ్రేట్ రెమడీ అని చెప్పవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా ఇది సహాయపడుతుంది. క్యారెట్ లోని బీటాకెరోటీన్ జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.

బీఫ్:

బీఫ్:

జుట్టు నాణ్యతను పెంచుకోవాలంటే బీఫ్ తినాల్సిందే. ఇందులో ప్రోటీనులు మరియు విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు నాణ్యతను పెంచి జుట్టు రాలడం తగ్గిస్తుంది . వారంలో రెండు మూడు సార్లు బీఫ్ ను మీరు తీసుకోవచ్చు.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు నేచురల్ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. వీటిలోని విటమిన్ బి, సి, ఇ, క్యాల్షియం మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఐరన్ పుష్కలంగా ఉండి, జుట్టును బలంగా పెరగడానికి సహాయపడుతాయి.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో ఉపయోగించి జుట్టు రాలడాన్ని చాలా చౌకగా నివారించుకోవచ్చు. స్వీట్ పొటాటోలో అధికంగా బీటా కెరోటీన్స్ కలిగి ఉండి, అవి మన శరీరంలోకి చేరగానే విటమిన్ ఎగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, జుట్టు కణాల పెరుగుదలకు విటమిన్ ఎ చాలా అవసరం.

గుడ్లు:

గుడ్లు:

మన జుట్టు ప్రోటీనులు అధికంగా కావల్సి ఉంటుంది. మన జుట్టు పెరుగుదలకు నిరంతరం ప్రోటీనుల అవసరం ఉంది. అటువంటి ప్రోటీనులు గుడ్లలో ఉన్నాయి. అంతే కాదు, గుడ్డులో విటమిన్ బి కాంప్లెక్స్ మరియు బయోటిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది జుట్టు రాలడానికి అద్భుతంగా సహాయపడుతాయి. రెగ్యులర్ గా గుడ్డు తింటే, జుట్టు రాలే సమస్యను నివారించుకొన్నట్లే.

English summary

Top 10 Food to Prevent Hair Loss, to promote Hair Growth

When you are plagued by hair loss, the primary factor is you must specialize in the food what you eat. Many of us usually go for varied hair care products however it does not get results well. Your eating menu is what matters the most.
Story first published: Thursday, February 6, 2014, 16:36 [IST]
Desktop Bottom Promotion