For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలలో చుండ్రువంటి ఫంగస్: బెస్ట్ హోం రెమడీస్

|

మనశరీరంలో ఏ ప్రదేశంలోనైన సరే ఫంగస్ ఏర్పడటానికి అవకాశం ఉంది. ఉదాహరణకు తలలో, పాదాల్లో, చర్మం మొదలగునవి ప్రధాన ప్రదేశాలు. ముఖ్యంగా తలలో రింగ్ వార్మ్ అనే ఫంగస్ చాలా సాధారణంగా వచ్చే సమస్య ఇది. దీని వల్ల తల మరియు జుట్టు మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల, ప్రతి రోజూ తలస్నానం చేయడం, తలఆరబెట్టుకోవడం, తగిన పోషణ అందేలా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది

తల, జుట్టుకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, క్లీన్ గా నీట్ గా పెట్టుకోవడం చాలా అవసరం. తడి జుట్టుతో ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పడు తడిజుట్టు ఫంగస్ కు దారితీస్తుంది. ఈ ఫంగస్ కు ప్రధాన లక్షణం తలలో ఎక్కువగా దురదపెడుతుంది. తలస్నానం చేసినా కూడా సమస్య అలాగే ఉంటుంది.

తలలో ఫంగస్ సోకినప్పుడు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కడ కొన్ని సింపుల్ చిట్కాలను అంధిస్తున్నాను...

టీట్రీ ఆయిల్:

టీట్రీ ఆయిల్:

హెయిర్ ఫంగస్ నివారించడానికి టీ ట్రీ ఆయిల్ మరియు గ్రేప్ మరియు బ్లాక్ వాల్ నట్ ఒక బెస్ట్ హెయిర్ రెమెడీ. ఈ మూడింటి మిశ్రమాన్ని రెగ్యులర్ గా మీర తలకు అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత 4-6గంటలు అలాగే ఉంచాలి తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నేచురల్ జ్యూస్ లను త్రాగాలి:

నేచురల్ జ్యూస్ లను త్రాగాలి:

న్యూట్రీషియన్ జ్యూస్ లు అంటే విటమిన్లు అధికంగా ఉన్నవాటిని తీసుకోవడం వల్ల ఫంగస్ తో పోరాడే గుణం కలిగి ఉంటుంది . అందువల్ల, ఒక పెద్ద మొత్తంలో తాజా జూస్ లు తీసుకోండి. విటమిన్స్ హెయిర్ ఫంగస్ ట్రీట్మెంట్ లో ఒక భాగం అని గుర్తుంచుకోవాలి. అందుకో ఇంట్లో తయారుచేసే, క్యారెట్, కీరదోస, మరియు అలోవెరా వంటి జ్యూసులు మంచి ఫలితాన్ని అంధిస్తాయి.

ఫిగ్ లీవ్స్:

ఫిగ్ లీవ్స్:

పండ్లలో అత్యంత పోషకాలు కలిగిన పండు ఫిగ్స్. పండు చెట్టుయొక్క ఆకులను శుభ్రంగా కడిగి, వాటిని మెత్తగా గ్రైండ్ చేసి, ఆ రసాన్ని తలకు పట్టించినట్లైతే హెయిర్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది.

క్యాస్టర్ ఆయిల్ అప్లై చేయాలి:

క్యాస్టర్ ఆయిల్ అప్లై చేయాలి:

కాస్టర్ ఆయిల్ ను తలకు అప్లై చేయడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు అయితే, కాస్టర్ ఆయిల్ (ఆముదం)నూనెను రెగ్యులర్ గా అప్లై చేయాల్సి ఉంటుంది. సమస్య ఉన్న ప్రదేశంలో మాత్రమే ఈ నూనెను పత్తితో అప్లై చేయాల్సి ఉంటుంది. చల్లటి నీటితో తలస్నానం చేయడం వల్ల సమస్యను నివారించుకోవచ్చు. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వ్యక్తిగత పరిశుభ్రత:

వ్యక్తిగత పరిశుభ్రత:

హెయిర్ ఫంగస్ సోకినప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. దిండును షేర్ చేసుకోకూడదు. పిల్లో కవర్స్, దువ్వెనెలు, బ్రష్ లు టవల్స్ వంటిని ఇతరులవి మీరు ఉపయోగించకూడదు మరియు మీదగ్గర ఉన్నవి శుభ్రంగా ఉంచుకోవాలి.

షాంపు మరియు ఆయిల్స్ కలిగిన మర్గోసాను ఎంపిక చేసుకోవాలి:

షాంపు మరియు ఆయిల్స్ కలిగిన మర్గోసాను ఎంపిక చేసుకోవాలి:

ఇప్పటీకి చాలా మంది హెర్బల్ ట్రీట్మెంట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం అంధిస్తున్నారు. మర్గోసా మూలిక యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఈ హెర్బ్ తో తయారుచేసిన షాంపులను హెయిర్ ఆయిల్స్ మరియుహెయిర్ కండీషనర్ ను ఎంపిక చేసుకొని హెయిర్ ఫంగస్ ను నివారించడం చాలా సులభం.

తలను గోకకూడదు:

తలను గోకకూడదు:

ఫంగస్ ఏర్పడిన ప్రదేశంలో దురద ఉన్నట్లైతే అదే పనిగా గోకడం వల్ల అది మిగిలిన ప్రదేశంలో కూడా పాకడానికి అవకాశం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ గోకకుండా ఉండటం మంచిది

వెనిగర్:

వెనిగర్:

వెనిగర్ తీసుకొని దాన్ని బాగా ఉడికించి తర్వాత చల్లార్చి ఆతర్వాత తలకు పట్టించి, మసాజ్ చేయాలి. కొన్ని గంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హోం మేడ్ మర్గోసా మిశ్రమం:

హోం మేడ్ మర్గోసా మిశ్రమం:

మర్గోసా మూలికి అందుబాటులోనే ఉంటుంది ఒక గుప్పెడు మర్గోసా మూలికలు తీసుకొని, శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి బాగా ఉడికించాలి. తర్వాత బాగా చల్లారినిచ్చి, ఆ నీటిని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. తర్వాత కొన్ని నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఈ హెర్బల్ రెమెడీని రెగ్యులర్ గా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

యాంటీ ఫంగల్ షాంపులను ఉపయోగించాలి:

యాంటీ ఫంగల్ షాంపులను ఉపయోగించాలి:

హెయిర్ ఫంగస్ సమస్యతో బాధపడుతున్నట్లైతే యాంటీ ఫంగల్ షాంపులను ఎంపిక చేసుకోవాలి. ఈ షాంపును తలకు బాగా పట్టించి 5నిముషాలు అలాగే ఉంచిత ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఇన్ఫెక్షన్ తగ్గే వరకూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Top 10 Home Remedies To Cure Hair Fungus

Any part of the human body can be the comfortable breeding ground of fungus; for example, the scalp, feet, skin etc. Ringworm is a very common fungus which affects the scalp along with the hair.
Story first published: Tuesday, February 4, 2014, 18:30 [IST]
Desktop Bottom Promotion