For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలడం తగ్గించే టాప్ 10 న్యూట్రీషియన్ ఫుడ్స్

|

జుట్టు రాలడానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు కాలుష్యం, ఒత్తిడి, కెమికల్ రిలేటెడ్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం మరియు ఆహారపు అలవాట్లు. మీరు కనుక జుట్టు రాలే సమస్యతో బాధపుడుతన్నట్లైతే. అప్పుడు మీరు మొదట గమనించాల్సిన విషయం మీ ఆహారపు అలవాట్లు, మీరు కనుక సరైన పోషకాహారంను మీ శరీరానికి అందేలా జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎంత ఖర్చు పెట్టినా అటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ మీ జుట్టు రాలే సమస్యలను నివారించవు.

మరియు జుట్టును రాలకుండా ఆరికట్టి జుట్టు పెరుగుదలకు సహాయపడే కొన్ని బెస్ట్ ఫుడ్స్ లిస్ట్ ఇక్కడ మీకోసం అంధిస్తున్నాం. వీటిలో అత్యధికంగా క్యాల్షియం మరియు న్యూట్రీషయన్స్ ఉన్నాయి. ఇవి మీ జుట్టుకు చాలా ఆరోగ్యకరం మరియు ఇవి మీ మొత్తం ఆరోగ్యానికి కూడా గొప్పగా సహాయపడుతాయి.

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి 12 సూపర్ స్నాక్:క్లిక్ చేయండి

మరి జుట్టు రాలడాన్ని అరకట్టే ఆహారాలు:

బాదం:

బాదం:

మెగ్నీషయిం అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం లోపం వల్ల స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ జుట్టు రాలడాన్ని అరికడుతుంది. ప్రతి రోజూ 4, 5 బాదం తినడం వల్ల మీకు కాల్సిన మెగ్నీషియం మరియు విటమిన్ ఇ అంధించి జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే బాదం ఆయిల్ ను మీ జుట్టు ప్రతి రోజు ఉపయోగించవచ్చు.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు విటమిన్స్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా పనిచేసి, హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. విటమిన్ ఎ, జుట్టుకు చాలా బాగా సహాయపడుతుంది. ఎవరైతే జుట్టు రాలే సమస్యలతో బాధపడుతుంటారో వారికి ఇది ఒక గ్రేట్ ఫుడ్. ఆకు కూరల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టును అంధిస్తాయి.

సీఫుడ్స్:

సీఫుడ్స్:

సీఫుడ్స్ జుట్టు రాలడం తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సీఫుడ్ లో అధిక శాతంలో సల్పర్, జింక్ మరియు ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టురాలడాన్ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది . అలాగే మీ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే సీఫుడ్ మొత్తం ఆరోగ్యంతో పాటు, చర్మం సరక్షణకు కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

వీట్ జర్మ్:

వీట్ జర్మ్:

వీట్ జర్మ్ (గోధుమ గింజలతో తయారుచేసిన నూనె లేదా జ్యూస్)ఇందులో జింక్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే జింక్ లోపం వల్ల ఏర్పడే గ్యాస్ట్రోఇంటెన్షినల్ ట్రాక్ సమస్యను నివారిస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది జింక్ ఉన్న ఆహారాలను తీసుకోవడం జుట్టు రాలడం తగ్గుతుంది.

బీన్ స్ప్రాట్స్:

బీన్ స్ప్రాట్స్:

బీన్ స్ప్రాట్స్ (బీన్స్ మొలకలు)ఇందులో సిలికా ఇది అన్ని రకాల విటమిన్స్ మరియు మినిరల్సలో మిళతమంై మీ శరీరం గ్రహిస్తుంది. మీరు అధికంగా విటమిన్స్ మరియు మినిరల్స్ ఫుడ్స్ ను తీసుకుంటు ఉండవచ్చు, కానీ సిలికా లేకుండా, ప్రయోజనం లేదు. బీన్ స్ప్రాట్స్ తో పాటు కీరదోస మరియు రెడ్ మరియు గ్రీన్ పెప్పెర్ ను తీసుకోవడం మంచిది.

గుడ్డు:

గుడ్డు:

గుడ్డులో అనేక న్యూట్రీషియన్స్, సల్ఫర్, జింక్, ఐరన్, సెలీనియం, ఫాస్పరస్, మరియు ఐయోడిన్ పుష్కలంగా ఉంటుంది. మీరు కనుక జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లైతే వారంలో రెండు గుడ్లను తీసుకోవాలి. ఇది ఈ సమస్యను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. గుడ్డులోని విటమిన్ బి1, బి2, బి12 మరియు బయోటిన్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో బయోటిన్ హెయిర్ ఫుడ్ గా తెలుసు, ఎందుకంటే ఇది హెయిర్ ఫాల్ అరికడుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహితస్తుంది.

సాల్మన్:

సాల్మన్:

సాల్మన్ ఫిష్ ఇది అన్ని చేపల్లో కంటే డిఫరెంట్ ఫ్యాటీ ఫిష్ . ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుష్కలంగా ఉన్నాయి. జుట్టు రాలే సమస్యలను నివారించడంలో అత్యంత అవసరం అయ్యే న్యూట్రీషియన్ ఫుడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ను సాఫ్ట్ గా చేస్తుంది మరియు తలలో జుట్టుకణాలను ఏర్పరుస్తుంది. అలాగే ఇది హెయిర్ ఫాల్ నివారిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా సాల్మన్ ఫిష్ తింటే, హెయిర్ ఫాల్ తగ్గి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ లో అధిక శాతంలో ఫైబర్, జింక్ మరియు ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడంలో అద్భుతంగా సహాయపడుతాయి. ఇంకా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , జుట్టుకు చాలా మేలు చేసి హెయిర్ ఫాల్ ను అరికడుతుంది . ఓట్స్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు ఉద్దీపన కలిగిస్తుంది మరియు మీ జుట్టు ఒత్తుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది . కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ఓట్ మీల్ ను చేర్చండి.

వాల్ నట్స్:

వాల్ నట్స్:

వాల్ నట్స్ కూడా ఒక గ్రేట్ హెయిర్ ఫుడ్. ఎందుకంటే ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జుట్టు రాలడం తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. మరియు ఇది హెయిర్ స్ట్రక్చర్ ను ఇంప్రూవ్ చేస్తుంది. అంతే కాకుండా వాల్ నట్స్ లో జింక్, ఐరన్, విటమిన్ బి1 మరియు బి6 ఉన్నాయి. ఇది జుట్టు పెరిగేలా ఉద్దీపన కలిగిస్తుంది. మరియు జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

జుట్టు రాలడాన్ని నివారించడంలో క్యారెట్ చాలా మంచి ఆహారం. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడంలో చాలా ముఖ్యమైనుటువంటి న్యూట్రిషయన్ ఫుడ్. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ త్రాగడం వల్ల జుట్టు రాలడం తగ్గించడంలో తక్షణ ఫలితం అంధిస్తుంది. అలాగే క్యారెట్స్ ను సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.

English summary

Top 10 Super Foods That Help Prevent Hair Fall

Hair loss can occur due to various reasons like pollution, stress, using chemical laden products and poor eating habits. If you’re suffering from hair loss, then the first thing to check is your diet.
Desktop Bottom Promotion