For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు పెరుగుదలకు టాప్ 10 వెజిటేబుల్స్

|

ప్రస్తుత కాలంలో జీవనశైలి మారడం, క్రమబద్ధత లేని ఆహారం తీరు, ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలు - ఇవన్నీ జుట్టుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే, పాతికేళ్లకే జుట్టు రాలడం మొదలవుతోంది. ప్రతి మనిషికీ అందం నిగ నిగలాడే నల్లటి జుట్టు. ముఖానికి అందాన్నిచ్చే జుట్టు రాలడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రోజుకు కొంత జుట్టు రాలడం సహజం. మళ్లీ వీటి స్థానంలో కొత్త జుట్టు వస్తుంది. రోజుకు సుమారుగా 40 నుంచి 60 వెంట్రుకలు రాలుతుంటాయి. ఇంత కంటే ఎక్కువ వెంట్రుకలు రాలిపోతే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ముఖ్యంగా సిలికా, కాల్షియం, మరయిు ఇనుము సమృద్ధిగా ఉండేట్లు చూసుకొంటే తప్పకుండా జుట్టు రాలడాన్ని అరికడుతుంది. కాబట్టి ఖరీదైన హెయిర్ ఉత్పత్తుల జోలికి పోకుండా సాధారణ ఫుడ్ ను తగిన వేళల్లో తీసుకోవడం వల్ల, డైయిట్ షెడ్యూల్ ను ప్రారంభించనట్లైతే తప్పకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్లో ఉంటుంది.

జుట్టు రాలడాన్ని నివారించే టాప్ 15 సూపర్ ఫుడ్స్: క్లిక్ చేయండి

సాధారణంగా మనం తీసుకొనే సమతుల ఆహారం మన ఆరోగ్యం, జుట్టు మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం యొక్క ఇతర భాగాలకు భిన్నంగా జుట్టు ఉంది. మీరు ఆయిల్ ఫుడ్స్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి మీ చర్మం ఛాయను డ్యామేజ్ చేసినట్లే, కేశ సౌదర్యాన్ని, నాణ్యతను డ్యామేజ్ చేస్తుంది. మనకు మందపాటి హెయిర్, విలాసవంతమైన కేశాలు కావాలని కోరుకున్నప్పుడు మనం తప్పని సరిగా మనం తీసుకొనే ఆహారం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మనం ప్రతి రోజూ తినే పోషకాలు మన జుట్టు మరియు హెయిర్ పోలిసెల్స్ మీద కీలక పాత్రను పోషిస్తాయి.

ముఖ్యంగా గ్రీన్ వెజిటేబుల్స్ అన్ని రకాల జుట్టు సమస్యలను నివారిస్తాయి. అంతే కాదు, జుట్టురాలడాన్ని అరకడుతాయిని రీసెంట్ గా కొన్ని అద్యయనాలు కూడా రుజువు చేశారు. ఇవి మీ జుట్టుకు నేచురల్ కండీషనర్స్ గా పనిచేస్తాయి మరియు ఈ వెజిటేబుల్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ముఖ్యం వెజిటేబుల్స్ ఖర్చులేని హెయిర్ ప్రొడట్స్ మరియు వాటని నిల్వచేసుకోవడం కూడా చాలా సులభం. కానీ జుట్టు పెరుగుదలకు సహాయపడే వెజిటేబుల్స్ ఏవి?అని మీరు తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయాల్సిందే...

వేగవంతమైన జుట్టు పెరుగుదలకు ఆరోగ్యకరమైన ఆహారాలు: క్లిక్ చేయండి

మరి ఆరోగ్యకరమైన జుట్టు పొందడానికి కొన్ని హెల్తీ హెయిర్ డైట్ టిప్స్ ను ఇక్కడ అందిస్తున్నాం..

ఆకుకూరలు:

ఆకుకూరలు:

జుట్టు పెరుగుదలలో టాప్ టిస్ట్ లో ఉండేది ఆకుకూరలు. గ్రీన్ లీఫ్ అంటే ఆకుకూరలు వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. దీంతో పాటు అత్యవసర పోషకాలైన ఐరన్, బీటా కెరోటిన్స్, ఫ్లొల్లెట్ మరియు విటమిన్ సి అధికంగా ఉండి కురుల ఫోలీసెల్స్ ను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతాయి.ఇందులో ఉండే విటమిన్స్ మరియు మినిరల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

క్యారెట్:

క్యారెట్:

జుట్టుకు రెండవ ఉత్తమ వెజిటేబుల్ క్యారెట్స్ . క్యారెట్స్ లో విటమిన్ బి7 లేదా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు ఒక హెల్తీ టానిక్ గా పనిచేస్తుంది. బయోటిని జుట్టు తిరిగి పెరగడానికి బాగా సహాయపడుతుంది. అదే సమయంలో ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

జుట్టు పెరుగుదలకు సహాయపడే న్యూట్రీషియన్ ఫుడ్ ఇది.ఇందులో జింక్, ఐరన్, మరియు బయోటిన్ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు అవసరమయ్యేవే. ఇవన్నీ ఉల్లిపాయలో పుష్కలంగా ఉన్నాయి. జుట్టు పెరుగుదలతో పాటు, తెల్ల జుట్టు నివారిస్తుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరం బీటాకెరోటిన్ గ్రహించి అది విటమిన్ ఎ గామార్పు చెందుతుంది. శరీరంలో కణాల మరమ్మత్తుకు బీటా కెరోటిన్ బాగా సహాయపడుతుంది. కాబట్టి, విటమిన్ ఎ కు మూలం అయిన స్వీట్ పొటాటోను తినడం.

టమోటోలు:

టమోటోలు:

టమోటోలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు టమోటో ఒక ఎఫెక్టివ్ సెల్ రిపేరింగ్ ఏజెంట్. ఇవి తలలో మలినాలను మరియు టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి, టమోటోలను నేరుగా తీసుకోవడం లేదా టమోటో రసాన్ని తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఘాటైన వాసన కలిగిన వెల్లుల్లి, హెయిర్ గ్రోత్ కు ఒక టానిక్ వంటింది. కాబట్టి, దీన్ని మీ రెగ్యులర్ డైట్ చార్ట్ లో చేర్చుకోవాలి. మరియు ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. మరియు గార్లిక్ లో ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. అందుకే దీన్ని హెయిర్ రీ గ్రోత్ కు చాలా మంచిదని నిర్ధారించారు.

బీట్ రూట్:

బీట్ రూట్:

బీట్ రూట్ లో లికోపిన్ పుష్కలంగా ఉంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బీట్ రూట్ తో పాటు ముల్లంగి వంటి దుంపలు కూరలు కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి.

కరివేపాకు:

కరివేపాకు:

కరివేపాకులో అద్భుతమైన యాంటీడోట్ జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకులో కెరోటిన్, జుట్టు పెరుగుదలకు ఒక టానిక్ లా ఉపయోగపడుతుంది

ఫ్రెంచ్ బీన్స్:

ఫ్రెంచ్ బీన్స్:

ఫ్రెంచ్ బీన్స్ లో విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఇ జుట్టును ప్రకాశవంతంగా మార్చడానికి, జుట్టు నాణ్యత పెంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అలాగే జుట్టు తెల్లబడుటను నివారిస్తుంది.

పచ్చిమిర్చి:

పచ్చిమిర్చి:

కెరోటిన్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉండే మరో గ్రీన్ వెజిటేబుల్ పచ్చిమిర్చి. హెయిర్ గ్రోత్ లో ఎక్స్ లెంట్ గా ఉపయోగపడుతుంది . తలలో డ్యామేజ్ సెల్స్ ను రిపేర్ చేసి, కొత్త హెయిర్ ఫోలిసెల్స్ ను పెంచుతుంది.

English summary

Top 10 Vegetables That Boost Hair Growth

The best method to fight against different types of hair problems is to eat a lot of green vegetables. Latest studies have shown that the deficiency of certain vegetables might contribute to unexplained hair loss.
Desktop Bottom Promotion