For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుండ్రు వల్ల వచ్చే మొటిమలను మాయం చేయడానికి చిట్కాలు

By Super
|

మిచిగాన్ హెల్త్ సర్వీసెస్ విశ్వవిద్యాలయం ప్రకారం చుండ్రు కలిగిన వ్యక్తులకు మోటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చుండ్రు యొక్క చాలా ముఖ్యమైన లక్షణం ఏమిటంటే చర్మం పొడిగా మరియు పొరలుగా ఊడి చర్మ రంధ్రాలకు అడ్డుతగులుతుంది. దీని వలన మీ ముఖం మరియు శరీరంపై మొటిమలు ఏర్పడతాయి. మీరు ఇప్పటికే మోటిమల సమస్యకు గురయ్యి ఉంటే,ఈ సమస్యను చుండ్రు ఇంకా అధ్వాన్నంగా మారుస్తుంది.

మొటిమలు రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో చుండ్రు అనేది అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. ఇక్కడ చుండ్రు కారణంగా వచ్చే మొటిమలను తగ్గించుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

చుండ్రు కారణంగా వచ్చే మొటిమలను వదిలించుకోవటానికి మార్గాలు

యాంటీ డాండ్రఫ్ షాంపూ

యాంటీ డాండ్రఫ్ షాంపూ

కనీసం వారంలో రెండు సార్లు యాంటీ డేన్ డ్రుఫ్ షాంపూను ఉపయోగించాలి. అలాగే మీరు చర్మం, చెవులు,ముఖం వంటి అన్ని ప్రభావిత ప్రాంతాలలో వాష్ చేయాలి. మీ జుట్టును మీరు తలక్రిందులుగా వాష్ చేయకూడదు. ఎందుకంటే తలలోని చుండ్రు నొసలు మరియు ముఖం మీద పడటానికి ఎక్కువ అవకాశం ఉంది.

తలమీద చర్మంనకు దూరంగా కండిషనర్లు రాయాలి

తలమీద చర్మంనకు దూరంగా కండిషనర్లు రాయాలి

మీరు షాంపూ చేసిన తర్వాత కండిషనర్లు ఉపయోగిస్తే,మీరు తల మీద చర్మం నుండి కొంచెం దూరంగా రాయాలని నిర్ధారించుకోండి. మీరు తలమీద చర్మం మీద కండిషనర్లు రుద్దకూడదు. ఎందుకంటే కండిషనర్ల అవశేషాలు చుండ్రును వేగవంతం చేయవచ్చు. ఏటువంటి అవశేషాలను జుట్టు మీద వదిలేయకుండా శుభ్రం చేసుకోవాలి.

మీ ముఖం మీద జుట్టు ఉంచకండి

మీ ముఖం మీద జుట్టు ఉంచకండి

మీ ముఖం మీద జుట్టు ఉంచటానికి ప్రయత్నించకండి. చుండ్రు మీ జుట్టులో ఉన్నప్పుడు,అది మీ ముఖ చర్మం పై పడి మొటిమలకు దారితీస్తుంది.

వేడి నూనె మర్దన

వేడి నూనె మర్దన

- వారానికి ఒకసారి తల మీద వేడి నూనెతో మర్దన చేస్తే పొడి తల చర్మంపై ఉన్న చుండ్రు వల్ల వచ్చే మొటిమల సమస్యను తగ్గించవచ్చు. అలాగే తల మీద చర్మం ఆరోగ్యంగా మరియు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

- క్రమం తప్పకుండా ముఖం శుభ్రం చేయాలి.

- కనీసం ప్రతి రోజు రెండు సార్లు ముఖం కడగాలి. మీ ముఖం నుండి పొట్టును తొలగించి శుభ్రంగా ఉంచుతుంది. అలాగే నూనె లేకుండా ఉండటానికి సహాయం చేస్తుంది.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసంలో యాంటి బాక్టీరియా లక్షణాలు తలపై చర్మంను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. కొంచెం నిమ్మరసంను తీసుకోని తల మీద చర్మంపై రాసి 20-30 నిమిషాల పాటు వదిలివేయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. మీరు మీ తల మీద చర్మంపై చుండ్రు వదిలించుకోనే సమయంలో,మీ చర్మం స్వచ్చముగా మారటం ప్రారంభమౌతుంది.

జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించకూడదు

జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించకూడదు

జుట్టు స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించుట వలన మీ జుట్టు జిడ్డు లేదా పొడిగా గాని మారుతుంది. సాదారణంగా పొడి జుట్టు చుండ్రును ఆకర్షిస్తుంది. అవి మీ జుట్టు ద్వారా మీ ముఖానికి వచ్చినప్పుడు రంధ్రాలు ముసుకుపోతాయి.

మీ జుట్టుకు క్రమం తప్పకుండా బ్రష్ చేయండి

మీ జుట్టుకు క్రమం తప్పకుండా బ్రష్ చేయండి

జుట్టుకు సాధారణ బ్రషింగ్ చేయుట వలన తల మీద చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అలాగే రక్త ప్రసరణ పెంచడానికి సహాయపడుతుంది. మీ జుట్టుకు ఒక రోజులో కనీసం రెండుసార్లు బ్రష్ చేయండి.

English summary

Ways to get rid of acne due to dandruff

People who have dandruff can be more likely to develop acne, according to the University of Michigan Health Services. The dry skin flakes that are often the most salient symptom of dandruff can clog pores, causing pimples to form on your face and body.
Story first published: Friday, July 4, 2014, 8:59 [IST]
Desktop Bottom Promotion