For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు రాలేసమస్యను నిరోధించడానికి తినవలసిన ఆహారాలు

By Super
|

జుట్టు నష్టం అనేది సాదారణంగా జరుగుతుంది. కానీ ఇది మేము ఎదుర్కొనే భయంకరమైన సమస్యగా ఉంది. అప్పుడు మేము వెంటనే మేడికెటెడ్ జుట్టు సంరక్షణ ఉత్పత్తులు లేదా మందులను ఉపయోగించాలని ఆలోచిస్తాము. ఇది ప్రారంభంలో ఉన్నప్పుడు మన రోజువారీ ఆహారంలోమార్పులు చేసుకోవటం కీలకం. మా జుట్టు గ్రీవము బలోపేతం చేయటానికి, జుట్టు పెరుగుదలను పెంచడానికి మరియు గట్టిపడటాన్ని ప్రోత్సహించడానికి మా రోజువారీ ఆహారంలో అవసరమైన పోషకాలు తప్పనిసరిగా ఉండాలి.

ఇక్కడ మీ జుట్టు నష్టాన్ని నిరోధించడానికి తినవలసిన 10 ఆహారాలు ఉన్నాయి.

సాల్మన్

సాల్మన్

సాల్మన్ లో విటమిన్ D,మాంసకృత్తులు మరియు జుట్టు పెరుగుదలకు అవసరమైన కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. సాల్మన్ మన జుట్టు షాఫ్ట్ కోసం అవసరం అయిన కొవ్వు ఆమ్లాలు అందిస్తుంది. సాల్మన్ మరియు ఇతర సీ ఫుడ్స్ లో కూడా జింక్ సమృద్ధిగా ఉంటుంది. ఇది పొడి చర్మం,చుండ్రు,జుట్టు నష్టం వంటి సాదారణ సమస్యల నుండి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. అంతేకాక జుట్టును ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుతుంది.

 సోయా

సోయా

సోయా హిమోగ్లోబిన్ ఏర్పడటానికి అవసరం అయిన ఐరన్ ని అందిస్తుంది. ఇది లేకపోవుట వలన జుట్టు పెళుసుగా మారి జుట్టు రాలిపోతుంది. మీరు ప్రతి రోజు ఒక గ్లాస్ సోయా పాలు,పెరుగు లేదా సోయా ప్రోటీన్ బార్లు తీసుకోవాలి.

బ్లూ బెర్రీలు

బ్లూ బెర్రీలు

విటమిన్ సి ఆరోగ్యకరమైన జుట్టు కోసం కీ పదార్థాలలో ఒకటి. ఇది జుట్టు మరియు కణజాలం కలిసి ఉండటానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ సి లేకపోవుట వలన జుట్టు బలహీనం,పెళుసైన జుట్టు, చివరలు చిట్లుట,జుట్టు బ్రేక్ అవటం వంటివి జరుగుతాయి. బ్లూ బెర్రీలో విటమిన్ సి తో పాటు మన శరీరానికి అవసరమైన యాంటాక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. మీ అల్పాహార విరామ సమయాలలో మీ పండ్ల సలాడ్ లో భాగంగా ఒక చిన్న కప్పు బ్లూ బెర్రీలను తీసుకోండి.

 వాల్నట్

వాల్నట్

వాల్నట్ లో బోయోటిన్,ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E మరియు రాగి వంటి ఆరోగ్యకరమైన జుట్టు నిర్వహించడానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ పోషకాలు మీ జుట్టుకు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. అలాగే మీ జుట్టును నునుపుగా ఉంచటానికి మరియు మీ జుట్టు మంచి రంగులో ఉండటానికి సహాయపడతాయి. మీరు కొన్ని వాల్నట్స్ ను చిన్న బాక్స్ లో ఉంచుకొని ప్రయాణాలలో రోజంతా వాటిని నమలండి.

గుడ్లు

గుడ్లు

గుడ్లులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో గుడ్డును తీసుకోవడం వలన మీ జుట్టు సమస్యలను గణనీయంగా పరిష్కరిస్తుంది. ప్రోటీన్స్ నెత్తిమీద కణజాలం నిర్మాణానికి మరియు కోల్పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చే బాధ్యతను తీసుకుంటాయి. ఇది ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ముఖ్యమైనది. అలాగే జున్ను,కోడి,చేప లేదా మాంసంలలో ప్రోటీన్లు సమృద్దిగా ఉంటాయి.

పాలకూర:

పాలకూర:

మీ ఆహారంలో ఐరన్ లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. ఐరన్ మీ చర్మంనకు ఆక్సిజన్ మరియు రక్తాన్ని అందించడం, అలాగే హిమోగ్లోబిన్ ఏర్పడడానికి బాధ్యత వహిస్తుంది. ఐరన్ పెరగటానికి

కిడ్నీ బీన్స్, పప్పు, చిక్పీస్ వంటి వాటిని తినాలి. మహిళలు బహిష్టు సమయంలో రక్తం మరియు ఐరన్ ను కోల్పోతారు. ఆ సమయంలో ఐరన్ ను ఎక్కువగా తీసుకోవాలి.

చిలకడ దుంపలు

చిలకడ దుంపలు

చిలకడ దుంపలు మన శరీరంలో విటమిన్ ఎ,బీటా కెరోటిన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విటమిన్ చర్మం కోసం ముఖ్యమైన నూనెల ఉత్పత్తికి అవసరమవుతుంది.ఈ నూనెలు తల మీద చర్మాన్ని రక్షించటానికి సహాయపడతాయి. ఈ నూనెలు లేకపోవుట వలన తల మీద చికాకు,దురద వస్తాయి. కేవలం ఉడికించిన చిలకడ దుంపలు మాత్రమే తినటానికి ఉత్తమం. రుచి కోసం కొన్ని చుక్కల నిమ్మరసంను పిండవచ్చు.

మన చర్మం వలె, జీవనశైలి మరియు సాధారణ ఆరోగ్యం వలన మన జుట్టు మంచి నాణ్యతతో ప్రతిబింబిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు బాధ్యత గల కణాలకు కీ పోషకాలు అందించడం అవసరం.

English summary

What you should eat to prevent hair loss

Hair loss is a common, but a rather dreadful problem that we face. Most of us immediately think of using medicated hair care products or medications, but it is crucial to look into our daily diet and fix that at the earliest.
Desktop Bottom Promotion