For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎగ్ హెయిర్ మాస్క్ లు

By Super
|

గుడ్డుఒక అద్భుతమైన ఆహార పదార్థం . ఆరోగ్యానికి మాత్రమే కాదు, సౌందర్యానికి కూడా చాలా గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే సహజసిద్ద గుణాల ఆధారంగా దీన్ని జుట్టుకు విరివిగా ఉపయోగిస్తున్నారు. గుడ్డును జుట్టుకు అప్లై చేయడం ద్వారా జుట్టుకు మంచి షైనింగ్, అందంగా మరియు వాల్యూమనస్ గా ఉంటుంది. జుట్టు దుర్వాసన లేకుండా ఉండాలంటే గుడ్డులోని తెల్లసొన మాత్రమే ఉపయోగించి . ఎగ్ వైట్ లో ప్రోటీలనులు మరియు క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి జుట్టును మరియు జుట్టు మూలాలకు తగిన బలాన్ని చేకూర్చుతాయి.

మీరు మరేదైన జుట్టు సమస్యతో బాధపడుతున్నట్లైతే మీ జుట్టుకు ఉపయోగించే అత్యంత అవసరమైన పదార్థాల్లో గుడ్డు ఒకటి. వారంలో రెండు సార్లు మీ జుట్టుకు ఎగ్ వైట్ ను ఉపయోగించడం వల్ల మీ జుట్టు చూడటానికి అందంగా కనిపిస్తుంది . గుడ్డు ఉపయోగించేటప్పుడు జుట్టుకు కెమికల్స్ తో తయారుచేసిన షాంపులను ఉపయోగించకూడదు . ఇది మీ జుట్టు మీద ప్రభావం చూపుతుంది మరియు సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

READ MORE: జుట్టు రాలడం నివారించే హోం మేడ్ హెయిర్ మాస్క్

జుట్టు మరింత అందంగా తీర్చి దిద్దుకోవడానికి ఎగ్ ను ఏవిధంగా ఉపయోగించాలి అన్న చిట్కాలను ఈక్రింది విధంగా వివరిచండం జరిగింది

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు వెనిగర్

ఒక గుడ్డులోని తెల్ల సొనలో రెండు చెంచాలా వైట్ వెనిగర్ మిక్స్ చేసి, తలకు మరియు కేశాలకు పూర్తిగా పట్టించాలి . ఇది జుట్టు మరింత బెటర్ గా పెరగడానికి సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు టమోటో జ్యూస్

చుండ్రును నివారించుకోవడానికి, గుడ్డులోని తెల్లసొన మరియు టమోటో జ్యూస్ కాంబినేషన్ ఉత్తమం. కేవలం ఈ పేస్ట్ ను మీ కేశాల మొత్తానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత తలస్నానం చేసేసుకోవాలి.

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మరియు గుడ్డులోని తెల్లసొనను మిక్స్ చేసి తలకు పట్టించాలి. పట్టించిన తర్వాత తలకు మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల ఇది హెయిర్ రూట్స్ కు మంచి ట్రీట్మెంట్.

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు కొబ్బరి నూనె

గుడులోని తెల్ల సొన మరియు కొబ్బరి నూనె రెండింటిని మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే కేశాలు నల్లగా నిగనిగలాడుతుంటాయి. కేశాలకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. కొబ్బరి నూనె మరియు గుడ్డును తలకు పట్టించడం ఒక ఉత్తమ పదార్థాలు .

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు ఉప్పు:

తలకు ఉప్పు మరియు గుడ్డులోని తెల్ల సొనతో మసాజ్ చేసుకొన్నప్పుడు తలలో పేలు నివారించబడుతాయి. ఈ హెయిర్ కేట్ చిట్కా తలదురదను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు రోజ్ వాటర్

రోజ్ వాటర్ ను గుడ్డులోని తెల్లసొనతో చేర్చడం అనేది ఒక ఉత్తమ చిట్కా . ఇది హెయిర్ కు మరింత బెటర్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రాత్రుల్లో తలకు పట్టించడం వల్ల మరింత ఉత్తమ ఫలితం ఉంటుంది. రోజ్ వాటర్ మీ జుట్టుకు మరింత షైనింగ్ ను అందిస్తుంది.

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు బాదం:

గుప్పెడు బాదంను పొడి చేసుకొని, అందులో గుడ్డులోని తెల్ల సొనను మిక్స్ చేసి మీ జుట్టుకు పట్టించాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే, చిట్లిన జుట్టును నివారించుకోవచ్చు.

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు తేనె

తేనె మరో ఉత్తమ నేచురల్ హోం రెమెడీ . మీ జుట్టును ఆరోగ్యంగా మరియు నేచురల్ గా పెంచుకోవాలనుకుంటే, మీ గుడ్డు తెల్లసొనలో కొద్దిగా తేనె మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు పాలు

మీ జుట్టు పొడిబారి మరియు బ్రౌన్ కలర్ ఉంటే నేచురల్ గా మారడానికి పాలు మరో ఉత్తమ హోం రెమెడీ . ఎగ్ వైట్ ను పాలతో మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల ఇది హెయిర్ వాల్యూమ్ ను పెంచుతుంది .

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

జుట్టు పెరుగుదలకు ఎగ్ వైట్ హెయిర్ మాస్క్

గుడ్డు మరియు పంచదార

ఉప్పు వలే, పంచదార మరో ఎఫెక్టివ్ చిట్కా. ఎగ్ వైట్ లో కొద్దిగా పంచదార వేసి తలకు మాస్క్ వేసుకోవడం ద్వార జుట్టు మరింత బెటర్ గా ఉంటుంది.

Desktop Bottom Promotion