For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీది పొడి జుట్టా...? ఐతే ఇవిగో ఉత్తమ హోం రెమెడీలు

|

జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఒత్తుగా పొడవుగా ఉండే జుట్టును వివిధ రకాలుగా, స్టైలిష్ గా వేసుకోవచ్చు. అందుకు జుట్టును హెల్తీగా మ్యానేజ్ చేయడమే ముఖ్య అవసరం. ముఖ్యంగా జీవనశైలిలో మార్పుల వల్ల మీ జుట్టు అనేక సమస్యలకు గురి అవుతుంది. ముఖ్యంగా అందులో జుట్టు పొడిబారడం, చుండ్రు, హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ మరియు ఇతర మరికొన్ని సమస్యలు ఉన్నాయి.

పొడి జుట్టు కొద్దిగా చిరాకు పెడుతుంటుంది. ఇంకా జుట్టును మరీ నిర్జీవంగా, చిక్కుగా కనబడేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య వింటర్ సీజన్ లో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమస్యను నివారించడానికి ఫ్రూట్ హెయిర్ ప్యాక్ బాగా సహాయపడుతుంది.

ఈ సమస్యను నివారించుకోవడానికి మీరు ఎప్పుడు రెడీమేడ్ హెయిర్ ప్యాక్ ను ఎంపిక చేసుకుంటారు. ఇవి మార్కెట్లో చాలా సులభంగా దొరుకుతాయి. ఇవి కూడా కెమికల్స్ ఉపయోగించడం వల్ల జుట్టుకు ఇవి హాని కలిగిస్తాయి. మీ జుట్టు యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి, ఫ్రూట్ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొడి జుట్టును పొందవచ్చు .

అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మరియు మరికొన్ని ఇతర కారణాలు వల్ల కూడా జుట్టు పొడి బారుతుంది. కాబట్టి ఒక చిన్న బ్రేక్ తీసుకొని, ఫ్రూట్ హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ మార్కెట్ లో లభించే హెయిర్ ప్యాక్స్ కంటే చాలా మంచివి.

ఈ ఫ్రూట్ హెయిర్ ప్యాక్ జుట్టుకు నేచురల్ గ్లోను మరియు షైనింగ్ ను అందిస్తుంది. మరి మీ పొడి జుట్టును సాఫ్ట్ అండ్ షైనీగా మార్చే ఫ్రూట్ హెయిర్ ప్యాక్ ఏంటో ఒక సారి చూద్దాం...

అరటి పండ్లు :

అరటి పండ్లు :

పొడి జుట్టుకు ఫ్రూట్ హెయిర ప్యాక్ లో అరటి ప్రధానమైనది . పొడి బారిన జుట్టుకు ఇది ఒక బెస్ట్ హెయిర్ ప్యాక్. అరటిపండును బాగా గుజ్జులా చేసి, అందులో ఎగ్ వైట్ ను వేసి మీ తలకు మరియు జుట్టు మొత్తానికి అప్లై చేయసి 20నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఆపిల్స్ :

ఆపిల్స్ :

డ్రై హెయిర్ నివారణకు ఆపిల్ మరో బెస్ట్ హెయిర్ ప్యాక్. షాంప్ చేసిన తర్వాత ఆపిల్ జ్యూస్ ను మంచి కండీషనర్ గా ఉపయోగించాలి. యాపిల్ సైడర్ వెనిగరల్ లో విటమిన్ సి ఉండటం వల్ల మీ జుట్టును స్మూత్ గా మరియు షైనీగా మార్చుతుంది.

నిమ్మరసం:

నిమ్మరసం:

పొడి జుట్టును నివారించడంలో ఇది ఒక ఉత్తమ ఫ్రూట్ హెయిర్ ఫ్యాక్. దీన్ని మీ జుట్టుకు నేరుగా అప్లై చేయొచ్చు లేదా నిమ్మరసంలో కొద్దిగా పెరుగు మరియు తేనె మిక్స్ చేసి హెయిర్ ప్యాక్ వేసుకోవాలి.

బొప్పాయి :

బొప్పాయి :

బొప్పాయి హెయిర్ ప్యాక్ వల్ల పొడి జుట్టును నివారిస్తుంది. బాగా పండిన బొప్పాయిని చిదిమి అందులో పాలు మరియు తేనె వేసి బాగా మిక్స్ చేసి తల మొత్తానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల మీజుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

మీరు స్విమ్మింగ్ పూల్ లో రెగ్యులర్ గా స్విమ్ చేయడం వల్ల నీటిలోని క్లోరిన్ మీ జుట్టును మరింత డ్రై గా మార్చుతుంది . అందుకు కీరదోసకాయను మెత్తగా చేసి, అందులో ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ వైట్ మిక్స్ చేసి తలకు పట్టించి. 15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

పీచ్ :

పీచ్ :

పీచ్ ఫ్రూట్ ఏవిధంగా పనిచేస్తుందో మీకు తెలుసా? పీచ్ ఫ్రూట్ ను పేస్ట్ చేసి పెరుగు మిక్స్ చేసి, మీ జుట్టు మొత్తానికి అప్లై చేయాలి . ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే ఖచ్చితంగా మార్పును చూస్తారు.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో 25 రకాల న్యూట్రిషియన్స్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా అందులో విటమిన్ ఇ మరియు బి అధికంగా ఉంటాయి. పచ్చి అవొకాడోను మెత్తని పేస్ట్ లా తయారు చేసి తల మాడుకు అప్లై చేసి కొద్ది సేపటి తర్వత తలను శుభ్రం చేసుకోవాలి. దాంతో కురులు క్లీన్ గా ఫ్రెష్ గా.. మెరుస్తూ ప్రకాశవంతంగా కనబడుతాయి. డ్రై నెస్ తగ్గిపోతుంది.

ప్లమ్ :

ప్లమ్ :

హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫ్లమ్ హెయిర్ ప్యాక్ ఒక ఉత్తమ హెయిర్ ప్యాక్ . ఇది మీ జుట్టును హెల్తీగా మార్చుతుంది . ప్లమ్ జ్యూస్ ను కూడా ఇతర హెయిర్ ప్యాక్ లలో మిక్స్ చేసి తలకు ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

బెర్రీస్ :

బెర్రీస్ :

బెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఇది తలకలో బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది. అంతే కాదు తకలు సరిపడా మాయిశ్చరైజ్ ను అందిస్తుంది . ఇది హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.

ఆరెంజ్ :

ఆరెంజ్ :

తలకు ఖచ్చితంగా తేమను అందించే ఇక ఉత్తమ ఫ్రూట్ ఇది ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల జుట్టు సాఫ్ట్ గా కూడా మార్చుతుంది. కురుల పెరుగుదలకు బయోప్లెవనాయిడ్స్ తో పాటు, విటమిన్ సి తల మాడుకు కావల్సినంత రక్త ప్రసరణను అంధించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి మీరు తినేటటువంటి ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి.

English summary

10 Fruits As Hair Packs For Dry Scalp

Whether you make a long braid or a beautiful bun, keeping your hair in good health is paramount. Due to lifestyle issues, your hair faces a lot of problems such as dry or oily scalp, dandruff, hair fall, broken ends and many more.
Story first published: Wednesday, January 21, 2015, 12:23 [IST]
Desktop Bottom Promotion