For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మీరు చేయకూడనివి

|

మీకు నల్లటి, పొడవైన, ఒత్తన జుట్టు వుంటే దాన్ని చిన్న పాపలా చూసుకునే సమయం వచ్చేసింది. ఇప్పటి తరం స్త్రీలు రక రకాల పనులు చేస్తూ బిజీ లైఫ్ ను గడుపుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగినులు, వీళ్ళకి తమ జుట్టును సంరక్షించుకోవడానికి కూడా సమయం చాలడం లేదు.

చాలా మంది స్త్రీలు అందంగా కనపడడానికి, సమయం ఆదా చేయడానికి తమ జుట్టును ఒక చక్కటి ముడి వేసి వదిలేస్తున్నారు. అయితే, ఇలా నిత్యం చేస్తూ వుండడం మీ అందమైన జుట్టుకు అన్యాయం చేయడమే అవుతుంది. బిగుతైన నైలాన్ రిబ్బన్ వేసుకోవడం వల్ల కూడా మీ జుట్టు రాలిపోతుంది, అలాగే వారానికి ఒక సారైనా తలకు నూనె రాయక పొతే కూడా మీ జుట్టు పొడిబారిపోయి రాలిపోయే ప్రమాదం వుంది.

ఈ పనులన్నీ మీరు ఇప్పటికే చేస్తుంటే మీ జుట్టు సమస్యతో బాధపడుతున్నట్లైతే. మీరు త్వరగా వృద్ధాప్యంలోకి రాకుండా ఉండాలన్నా, బట్ట తల రాకుండా ఉండాలన్నా మీరు మీ కేశ సంరక్షణ కోసం తొలి ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కనుక మీరిదంతా తప్పించుకోవాలంటే మీరు మీ కేశ సంపద ఇప్పటివరకూ చేస్తూ వున్న కొన్ని దుర్మార్గాలను వెంటనే ఆపి వేయాలి.

బిగుతైన బన్ లు వేసుకోవడం :

బిగుతైన బన్ లు వేసుకోవడం :

మీ జుట్టుకు బిగుతైన బన్ వేసుకోవడం మీరు దానికి చేసే అన్యాయాల్లో ఒకటి. కొంత మంది స్త్రీలయితే రాత్రి పూట బన్ ఉంచుకునే నిద్రపోతారు. మీకు ఇల్లంతా జుట్టు పడుతుంది అనిపిస్తే, దాన్ని రాత్రికి ముడి వేసుకుని పడుకోండి.

నైలాన్ రిబ్బన్లు :

నైలాన్ రిబ్బన్లు :

నైలాన్ రిబ్బన్లు వేసుకోవడం అంటే మీ కేశాల మీద తీవ్రవాదుల దాడి చేసినట్లే. మీరు హడావిడిలో వున్నా, మీ జాడలను ముడి వేయాలన్న వత్తిడిలో వున్నా కూడా వాటిని వాడకండి.

మీ కేశాలను రోజూ తడపడం :

మీ కేశాలను రోజూ తడపడం :

మీ జుట్టును ప్రతి రోజూ తడుపుతుంటే మీ కేశాల్లో వుండే సహజ తైలాలు అడుగంటి పోతాయి. దీని వల్ల మీ కేశాలు నిస్సారంగా, పొడిగా కనపడతాయి. వారానికి రెండు సార్లు ఈ కేశాలను తడుపుకోవడం సరైన ఫార్ములా అని చెప్పవచ్చు.

మితిమీరిన రసాయనాల వాడకం :

మితిమీరిన రసాయనాల వాడకం :

మీ కేశాల మీద మితిమీరిన రసాయనాల వాడకం చేస్తే కుదుళ్ళు పాడవుతాయి. జుత్తు రంగు, హెయిర్ సీరం, షాంపూలు లాంటివి వాడితే వాటివల్ల మీ జడలు సంరక్షించ బడడానికి బదులు జుట్టు సమస్యలు ఎక్కువవుతాయి.

ఎక్కువ వేడి :

ఎక్కువ వేడి :

మీకు మీ ఐరన్ కర్లర్ అన్నా, హెయిర్ స్ట్రెయిటేనర్ అంటే ఇష్టమా ? అలా అయితే దాన్ని తరచుగా వాడితే మీ జుట్టు రింగులు పాడవుతాయి కనుక దూర౦గా వుంచండి. ఎక్కువ వేడి వాడడం మీ కేశ సంపద పట్ల మీరు చేసే దుర్మార్గాలలో ఒకటి.

ఎక్కువగా బ్రషింగ్ చేయడం :

ఎక్కువగా బ్రషింగ్ చేయడం :

మీరు మీ జుట్టును బ్రష్ చేస్తే, అది తడిగా కాకుండా పొడిగా వుందని నిర్ధారించుకోండి. తడి జుట్టును బ్రష్ చేస్తే జుట్టు చిట్లి, కుదుళ్ళు బలహీనపడతాయి.

పరోక్ష ధూమపానం :

పరోక్ష ధూమపానం :

మీరు పరోక్ష ధూమపానానికి గురౌతుంటే, దాని నుంచి బయట పడ౦డి. అది మీ జుట్టుకు, చర్మానికి, ఆరోగ్యానికి మంచిది కాదు. పొగ మీ జుట్టు మీదుగా వెళ్ళినప్పుడు అది ఒక దట్టమైన పొరగా ఏర్పడి మీ జుట్టు త్వరగా ఎండిపోయి గ్రే గా మారిపోయేలా చేస్తుంది.

వేడి నీళ్ళ స్నానం :

వేడి నీళ్ళ స్నానం :

మీరు వేడి నీళ్ళ స్నానం లేకుండా ఉండలేక పోయినా సరే, అవి మానేయండి. వేడి నీళ్ళ స్నానం చేస్తే మీ జుట్టులోని సహజ తైలాలు తొలగిపోవడమే కాకుండా చుండ్రు కూడా మొదలౌతుంది.

మీ జుట్టునుతరచూ గోకుతూ వుండడం :

మీ జుట్టునుతరచూ గోకుతూ వుండడం :

కొంత మంది తమ జుట్టును నిరంతరం గొకుతూనే వుంటారు. ఈ అలవాటు వల్ల మీ మాడు మీద మచ్చలు ఏర్పడి జుట్టు ఓడిపోవడం కూడా మొదలౌతుంది. దీని వల్ల కుదుళ్ళు కూడా పాడౌతాయి.

జుట్టు కట్ చేయడం తగ్గించడం :

జుట్టు కట్ చేయడం తగ్గించడం :

మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం హెయిర్ కట్ చేయిస్తూ వుంటే మంచిది. దీన్ని తప్పించుకునే వాళ్ళు తమ జుట్టుకు మరింత హాని చేస్తున్నట్లే.

Desktop Bottom Promotion