For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై అండ్ డ్యామేజ్ హెయిర్ నివారణకు ఇంటి చిట్కాలు

|

మనలో చాలా మందికి జుట్టు సమస్యలు వివిధ రకాలుగా ఉంటాయి. ఒకరి జుట్టురాలే సమస్య, మరొక్కరికి చుండ్రు, ఇంకొంతమందికేమో దురద, హెయిర్ బ్రేకేజ్, డ్రైహెయిర్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా మన జుట్టు పొడి బారినట్లు, ఎండినట్లు నిర్జీవంగా కలతప్పి ఉన్నట్లైతే తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు పొడిబారడానికి మరియు హెయిర్ డ్యామేజ్ అవ్వడానికి కాలుష్యం, హార్డ్ వాటర్ వంటివి కూడా ముఖ్య కారణం కావచ్చు.

కాబట్టి పొడి జుట్టును మరియు డ్యామేజ్ అయిన జుట్టును వదిలించుకోవడానికి ఇదే మచం సమయం. పొడి జుట్టును సున్నితంగా, నునుపుగా మార్చుకోవడానికి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో జుట్టురాలే సమస్యలు, హెయిర్ బ్రేకేజ్ లేదా జుట్టు చిట్లడం వంటి సమస్యలు ఉండవు . పొడి జుట్టు సమస్య పొడావాటి కేశాలు ఉన్న వారిలో సాధారణంగా ఎదురయ్యే సమస్య. పొడవు జుట్టు ఉన్న కొంత మంది మహిలళకు జుట్టు పొడిబారడంతోపాటు తల మీద హెయిర్ బ్రేకేజ్, డ్యామేజ్ అయ్యి, పల్చగా ఉంటాయి. కాబ్టటి ఈ సమస్యలకు వెంటనే చెక్ పెట్టాలంటే కొన్ని చక్కటి హోం రెమెడీస్ ను ఉపయోగించాలి...

అవొకాడో:

అవొకాడో:

అవొకాడోలో ఫ్యాటీ యాసిడ్స్, మరియు మినిరల్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి . కాబట్టి, అవొకాడో పేస్ట్ ను జుట్టుకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి. వారానికొకసారి ఈ అవొకాడో పేస్ట్ ను హెయిర్ ప్యాక్ గా వేసుకుంటే డ్యామేజ్ హెయిర్ ను తగ్గిస్తుంది. నెలకొకసారి వేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

బట్టర్ మసాజ్:

బట్టర్ మసాజ్:

చిట్లిన జుట్టు, డ్రై హెయిర్ నివారించడానికి బట్టర్ గ్రేట్ గా సహాయపడుతుంది . జుట్టుకు గ్లాసీ షైనింగ్ ను అందిస్తుంది. డ్రై హెయిర్ నివారిస్తుంది. బటర్ ను తలకు పట్టించి షవర్ క్యాప్ ధరించిన అరగంట తర్వాత సాధారణ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

ఆలివ్ ఆయిల్ తో కండీషన్:

ఆలివ్ ఆయిల్ తో కండీషన్:

ఆలివ్ ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. తర్వాత తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి, దాని మీద హాట్ టవల్ ను చుట్టాలి. 45నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

టీతో తలస్నానం

టీతో తలస్నానం

డ్రై హెయిర్ కు నేచురల్ షైనింగ్ పొందడానికి గ్రీన్ టీ, పంచదార లేకుండా ఉన్న టీని గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి తలస్నానం చేయాలి. గ్రీన్ టీ జుట్టు యొక్క రంగును మెరుగుపరుస్తుంది . చమోమెలీ మరియు బ్లాక్ టీ జుట్టును నల్లగా మార్చుతుంది .

ఆపిల్ సైడర్ వెనిగర్ మాస్క్

ఆపిల్ సైడర్ వెనిగర్ మాస్క్

డ్యామేజ్ అయిన జుట్టు మరియు లిప్స్ ను ఒక బెస్ట్ హోం రెమెడీ ఇది. ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మరియు 3 గుడ్లను మిక్స్ చేసి తలకు పట్టించి మర్దన చేయాలి. తర్వాత అరగంట వరకూ ఒక ప్లాస్టిక్ కవర్ తో తలను చుట్టి, తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి

షాంపు ఆమ్లెట్:

షాంపు ఆమ్లెట్:

కొద్దిగా షాంపులో ఒక గుడ్డు మిక్స్ చేసి వేయాలి . తర్వాత మీడ్యామేజ్ అయిన జుట్టుకు దీన్ని పట్టించి 5 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ ట్రీట్మెంట్ వల్ల మీ జుట్టుకు అందాల్సిన ప్రోటీన్స్ గ్రేట్ గా అందుతాయి.

బొటానికల్ ఆయిల్

బొటానికల్ ఆయిల్

ఇది హెల్త్ ఫుడ్ స్టోర్ట్ , ఆలివ్ ఆయిల్, జోజోబ ఆయిల్ మరియు స్వీట్ ఆల్మడ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల డ్యామేజ్ అయిన జుట్టు తిరిగి పునరుత్పత్తి అవుతుంది . మీ జుట్టు మరింత ఒత్తుగా మరియు ఎక్కువగా ఉన్నట్లైతే కొబ్బరి నూనె గ్రేట్ గా పనిచేస్తుంది . ఈ బొటానికల్ ఆయిల్ ను హెయిర్ కు పట్టించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. షవర్ క్యాప్ లేదా వార్మ్ టవల్ చుట్టి అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

సాండిల్ ఉడ్ ఆయిల్

సాండిల్ ఉడ్ ఆయిల్

కొన్ని చుక్కల సాండిల్ ఉడ్ ఆయిల్ లేదా జోజోబ ఆయిల్ ను చేతిలో వేసికొని మర్దన చేస్తూ తలకు పట్టించి , తక్షణం ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది మరియు జుట్టు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.

తడిగా ఉన్న జుట్టును నేచురల్ గా తడి ఆరనివ్వాలి

తడిగా ఉన్న జుట్టును నేచురల్ గా తడి ఆరనివ్వాలి

తలస్నానం చేసిన తర్వాత కాటన్ టవల్ తో రబ్ చేసి తుడవడం వల్ల హేయిర్ డ్యామేజ్ అవుతుంది. మరియు రబ్ చేయడానికి బదులు జుట్టుకు చుట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు చిట్లకుండా నివారిస్తుంది

హుమిడిఫైయర్ ను రాత్రుల్లో మాత్రమే ఉపయోగించాలి

హుమిడిఫైయర్ ను రాత్రుల్లో మాత్రమే ఉపయోగించాలి

ఇంట్లో వేడి వాతావరణం కూడా జుట్టును డ్రైగా మార్చుతుంది. ముఖ్యంగా వింటర్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది . దీనికి మాయిశ్చరైజర్ అప్లై చేయడం ద్వారా మరింత డ్రైగా మరియు డ్యామేజ్ అవుతుంది.

పోనిటైల్ వద్దు:

పోనిటైల్ వద్దు:

ఎక్కువగా పోనీటైల్ వేసుకొనే వారిలో జట్టు త్వరగా డ్యామేజ్ అవుతుంది. మరియు జుట్టును గట్టిగా వెనకకు లాగకుండా బ్యాండ్స్ ను నివారించాలి. అలాగే హెయిర్ యాక్సెసెరీస్ తో నిద్రించకపోవడం ఉత్తమం

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

ఒక టేబుల్ స్పూన్ బోరేజ్ ఆయిల్ , ఈవెనింగ్ ప్రైరోజ్ ఆయిల్ లేదా ఫ్లాక్సీడ్ ఆయిల్ ను రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. ఈ మూడింటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే గమ్మా లినోలిక్ యాసిడ్ హెయిర్ మరియు నెయిల్ ఆరోగ్యంగా ఉంచడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

Story first published: Monday, October 12, 2015, 15:19 [IST]
Desktop Bottom Promotion