For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కేశాల గురించి మీరు నమ్మకూడని 15 విషయాలు !!

By Super
|

చిన్నతనంలో తనకుండే ఒత్తైన జుత్తు గురించి మీ బామ్మ చెప్పే పాత కథలు వినీ వినీ విసుగొస్తోందా? నమ్మండి, నమ్మకపోండి, మనం మన పూర్వీకులు చెప్పిన లేదా చేసిన వాటిని తప్పకుండా నమ్ముతాం. కొన్నిసార్లు వాళ్ళ స్వీయానుభవం నుంచి వాళ్ళు ఏర్పరుచుకున్న అపోహలు నిజం అవాలని కూడా లేదు. అందువల్ల అందం గురించి మీ బామ్మ గారి కథలు విని విసుగు పుడుతు౦టే, కేశాల గురించి మీరు కొన్ని అపోహలు, నిజాలు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది.

దురదృష్ట వశాత్తూ, ఈ వింత అపోహలు తరాల పాటు కొనసాగుతుంటాయి, దాంతో అందరూ వాటిని నమ్ముతూ వుంటారు. మీరు గతంలో నిజమని భావించిన కేశాల గురించిన కొన్ని అపోహలను ఈ వ్యాసంలో పొందుపరచాము. కొన్ని వింత అపోహలను మీరు తెలుసుకుని ఇతరులకూ అర్ధమయ్యేలా చెప్పడానికి ఈ వ్యాసం చదవండి. READ MORE: కురుల ఇతిహాసంలో తెలుసుకోవల్సిన 10 విషయాలు!

నిత్యం ట్రిమ్మింగ్ చేస్తుంటే జుత్తు పెరుగుతుంది.

నిత్యం ట్రిమ్మింగ్ చేస్తుంటే జుత్తు పెరుగుతుంది.

జుత్తు చివరల నుంచి కాక కుదుళ్ళ నుంచి పెరుగుతుంది. అందువల్ల జుత్తు కత్తిరించే కొద్దీ పెరుగుతుందన్న మాట చాలా అపోహల్లో ఒకటి.

షాంపూ రోజూ వాడుతుంటే ఫలితం తగ్గిపోతుంది.

షాంపూ రోజూ వాడుతుంటే ఫలితం తగ్గిపోతుంది.

అనారోగ్యకరమైన జుత్తుకు, మీరు ఎంచుకున్న షాంపూ వాడడానికి మధ్య ఎలాంటి సంబంధం లేదు. మీ జుత్తు రకానికి సరిపోయే షాంపూ ను వాడుతూ వుండండి.

ఎక్కువగా షాంపూ వాడడం :

ఎక్కువగా షాంపూ వాడడం :

ఒకసారి షాంపూ వాడి తరువాత కడిగేయడం వరకూ మంచిదే. అయితే దీన్ని మరిన్ని సార్లు చేయడం మాత్రం మంచిది కాదు.

సూర్యరశ్మి పీల్చుకుని మీ జుత్తు సహజంగా తేలిక పడుతుంది.

సూర్యరశ్మి పీల్చుకుని మీ జుత్తు సహజంగా తేలిక పడుతుంది.

ఈ అపోహను ఎన్నటికీ నమ్మకండి, ఎందుకంటే సూర్యుడి వాడియైన కిరణాలు మీ జుత్తు కుదుళ్ళను పాడుచేసి, మీ మాడును మాడ్చి, జుత్తును ఎందిపోయేలా నిర్జీవంగా చేస్తుంది.

ప్రతి రాత్రీ వంద సార్లు బ్రష్ చేస్తే జుత్తు పెరుగుతుంది.

ప్రతి రాత్రీ వంద సార్లు బ్రష్ చేస్తే జుత్తు పెరుగుతుంది.

రాత్రి పడుకునే ముందు పదునైన దువ్వెనతో జుత్తు దువ్వుకుని పడుకుంటే మంచిదే, ఎందుకంటే అది మీ జుత్తు కుడుల్లను ఉత్తేజపరుస్తుంది. అయితే వంద సార్లు ప్రతి రాత్రీ దువ్వడం అనేది పెద్ద అపోహ, ఎందుకంటే అలా చేస్తే అది మీ జుత్తు ఊడిపోయేలా చేస్తుంది.

ఆరోగ్యకరమైన జుత్తుకు అనిమల్ ప్రోటీన్స్ మంచివి.

ఆరోగ్యకరమైన జుత్తుకు అనిమల్ ప్రోటీన్స్ మంచివి.

జంతువుల మాంస కృత్తులకు ఆరోగ్యకరమైన జుత్తుకు ఎలాంటి సంబంధం లేదు. ఆకు కూరలు, చియా విత్తనాలు, జనపనార విత్తనాలు, స్పిరులినా లాంటి ఇతర వృక్ష జాతి ప్రోటీన్లు వాడేవారికి ఆరోగ్యకరమైన జుత్తు కలుగుతుంది.

ఒత్తిడి వల్ల జుత్తు తెల్లబడుతుంది

ఒత్తిడి వల్ల జుత్తు తెల్లబడుతుంది

తెల్ల జుత్తుకు వారసత్వ లక్షణాలు కారణం కానీ, ఒత్తిడి కాదు. అందువల్ల తెల్ల జుత్తు తొలగించడం గురించి ఈ అపోహలను నమ్మకండి.

కొన్ని ఆహార పదార్ధాలు మీ జుత్తుకు మంచి కండిషనర్లు !!

కొన్ని ఆహార పదార్ధాలు మీ జుత్తుకు మంచి కండిషనర్లు !!

కొంతమంది బీరు, ఆలివ్ ఆయిల్, వెన్న లాంటివి తమ జుత్తును ఒత్తుగా తయారు చేస్తాయని అపోహ పడుతుంటారు. అవి జుత్తును జిడ్డుగా తయారు చేస్తాయి.

తెల్ల జుత్తు పీకితే మరిన్ని పుట్టుకు వస్తాయి.

తెల్ల జుత్తు పీకితే మరిన్ని పుట్టుకు వస్తాయి.

తెల్ల జుత్తు పీకడం వల్ల కుదుళ్ళు పాడయ్యి అనారోగ్యకరమైన జుత్తు రావచ్చు. అయితే మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయనుకోవడం మాత్రం అపోహే.

జుత్తును పై నుంచి క్రిందకు దువ్వడం.

జుత్తును పై నుంచి క్రిందకు దువ్వడం.

దువ్వడం వల్ల జుత్తు చిక్కు విడుతుంది, కానీ పై నుంచి క్రింద వరకు దువ్వితే మాత్రం జుత్తు ఊడిపోయే అవకాశం వుంది.

కొన్ని కేశ వర్ధకాలు జుత్తును ఒత్తుగా తయారు చేస్తాయి.

కొన్ని కేశ వర్ధకాలు జుత్తును ఒత్తుగా తయారు చేస్తాయి.

విటమిన్ డి, ఐరన్, జింక్, ప్రోటీన్, పిండి పదార్ధాలు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు మీ జుత్తు పెరుగుదలకు మేలు చేస్తాయి, అందువల్ల వాటిని మీ నిత్య భోజనంలో చేర్చుకోండి - అంతే కానీ ఖరీదైన వస్తువులు వాడకండి.

ఎండిపోయిన తల అంటే చుండ్రు అన్నమాట !!

ఎండిపోయిన తల అంటే చుండ్రు అన్నమాట !!

ఈ పిచ్చి అపోహను అస్సలు నమ్మకండి, ఎందుకంటే జిడ్డు వాతావరణంలో ఒక లాంటి పదార్ధం ఏర్పడి అందువల్ల చుండ్రు వస్తుంది.

జిడ్డు జుత్తుకు నూనెలు మంచివి కావు.

జిడ్డు జుత్తుకు నూనెలు మంచివి కావు.

తైలాలు నిజానికి మీ జుత్తు కుదుళ్ళ నుంచి లోపలి వెళ్లి దాన్ని ఆరోగ్యకరంగా తయారు చేస్తుంది, కనుక అవి ఖచ్చితంగా చెడ్డవి కావు.

టోపీలు పెట్టుకుంటే జుత్తు ఊడిపోతుంది.

టోపీలు పెట్టుకుంటే జుత్తు ఊడిపోతుంది.

జుత్తు గురించిన అపోహల్లో ఇది మరీ వెర్రిది. తోపీలకు, జుత్తు ఊదిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. కేశ నష్టం కేవలం DNA మీద, వారసత్వం మీద ఆధారపడి ఉంటు౦ది.

షాంపూ చేశాక జుత్తును టవల్ తో తుడవాలి.

షాంపూ చేశాక జుత్తును టవల్ తో తుడవాలి.

షాంపూ చేసిన తరువాత తువ్వాలుతో తుడవడం వల్ల జుత్తు ఎండిపోయి, ఊడిపోవడానికి దోహదం చేస్తుంది. తడి పోవడానికి తువ్వాలుతో బలంగా తుడిచే బదులు దాన్ని సహజంగా ఆరనిచ్చి తరువాత మెల్లిగా దువ్వండి.

English summary

15 Myths About Hair You Should Not Believe

Are you fed up of listening to the old stories of your Granny bragging about those lustrous locks she used to possess in her era? Believe it or not, but we all believe in what our ancestors have said or done.
Desktop Bottom Promotion