For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారతీయ మహిళలకు 6 ఉత్తమ కేశాలంకరణ రీతులు

By Super
|

మీరు భారతీయ మహిళను గురించి ఆలోచిస్తే – పెద్ద నల్లని కళ్ళతో ముదురు చాయ, లావు పెదాలు, పొడవాటి నల్లని జుట్టు, మీరు కళ్ళు మూసుకున్నా మీకు ఈ చిత్రమే కనిపిస్తుంది.

ఇప్పుడు మనం దక్షిణ భారత మహిళా అందం విషయానికి వస్తే, వివిధ రకాల వస్త్రాలు, ఆభరణాలతో ఈ చిత్రం సంపూర్ణంగా మనకు కనపడుతుంది.

అది పెళ్లి లేదా మరేఇతర సందర్భమైనా, దక్షిణ భారత స్త్రీలు ఆ సన్నివేశంలో ఆకర్షణగా ఉండడానికి వారి అందాన్ని ఎలా అరది౦చాలో వారికి బాగా తెలుసు.

READ MORE: పురుషుల జుట్టు సమస్యలకు 20 బెస్ట్ హోం రెమడీస్...!

దక్షిణ భారత మహిలలో కేశాలంకరణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వారు పండుగ జరిగే సమయంలో వారి ఇష్టాన్ని అనుసరించి జుట్టును అలంకరించుకుంటారు.

ఉదాహరణకు: పొడవు జడ గల దక్షిణ భారత స్త్రీలు సాంప్రదాయ కేశాలంకరణ చేసుకుంటారు, కానీ కొంతమంది వారి శైలి ప్రపంచం చూడడానికి చేస్తారు.

దక్షిణ భారత మహిళల కేశాలంకరణ వారికి మాత్రమే పరిమితమై ఉండదు. మీరు ఆరోగ్యకరమైన కేశాలు కలిగిన వారైతే, మీరు బాగా కనిపించడానికి కొన్ని రకాల కేశాలంకరణ రీతులను ప్రయోగించాలని అనుకుంటారు.

READ MORE:గ్రే హెయిర్ నివారించడానికి అవసరం అయ్యే ఉత్తమ హో రెమెడీస్

ఆ పద్ధతులు కష్టంగా ఉంటె, పూలతో అలంకరించబడిన కేశాలంకరణ, ఒక మల్లెపువ్వు పెట్టిన సాధారణ బన్ వంటి తేలికపాటి దక్షిణ భారత కేశాలంకరణ రీతులను ప్రయత్నించండి.

ఇక్కడ మహిళలు అందరిలో మిమ్మల్ని గర్వంగా చూపించే కొన్ని తేలికైన దక్షిణ భారత కేశాలంకరణ రీతులు ఇవ్వబడ్డాయి.

పూలతో అలంకరించుకోవడం

పూలతో అలంకరించుకోవడం

ఇది దక్షిణ భారత స్త్రీలకు అత్యంత ముఖ్యమైన సాధారణ కేశాలంకరణలలో ఒకటి. చాలా సాధారణమైన అలంకరణ పూలతో ఎంత మంత్రముగ్ధుల్ని చేస్తుందో దక్షిణ భారత స్త్రీలను చూసి నేర్చుకోవచ్చు. మీకు ఇష్టమైన పూలను ఎన్నుకుని దానిని మీ జుట్టుపై అలంకరించండి. దక్షిణ భారత స్త్రీలు ప్రధానంగా మల్లెపువ్వును ఇష్టపడతారు.

జుట్టు భాగంపై బొట్టుపెట్టడం

జుట్టు భాగంపై బొట్టుపెట్టడం

కిరీటంలా మీ జుట్టును ఒక భాగం చేయండి. ఆ భాగానికి ముందు ‘పాపటి బొట్టు' సెట్ చేయండి, మీ జుట్టుకు వెనుక క్లిప్పులతో తొకలను ఏర్పాటు చేయండి. మీరు పూల అలంకరణలు చేయాలనుకుంటే, పెద్ద మారి గోల్డ్ లేదా గులాబీ ని ఉపయోగించండి. లేకపోతే, విలువైన, లేదా కొద్దిగా తక్కువ విలువ కలిగిన రాళ్ళతో అలంకరిస్తే అద్భుతంగా కనిపిస్తుంది.

బన్ లో అందంగా ఉంటారు

బన్ లో అందంగా ఉంటారు

మీరు పెద్దవారి ఉండి, నాగరికంగా కనపడాలి అంటే, బన్ కంటే ఉత్తమమైనది మరోటి లేదు. మీకు పొడవు జుట్టు ఉంటె, దాన్ని గట్టిగా చుట్టి రంగురంగుల పూలు లేదా హెయిర్ పిన్స్ తో అలంకరించండి. పొట్టి జుట్టు కలవారు, ఎక్కువగా కనిపించడానికి కృత్రిమ బన్ ను వాడండి.

బఫ్ఫెంట్

బఫ్ఫెంట్

మీరు పైకి దువ్వినట్టు కనిపించాలి అంటే, బఫ్ఫంట్ కంటే ఉత్తమమైనది మరోటి లేదు. దక్షిణ భారత మహిళలు ఈ కేశాలంకరణను చేసుకోవడం ఎలా? మొట్టమొదట జుట్టును సరిగ్గా చేయండి. మిగిలిన జుట్టును దువ్వండి, దానిని పొడవుగా పక్కకు వదలండి. మీ జుట్టుకు పక్కన ఒక పెద్ద గులాబిని పెట్టండి.

కిరీటం & పూలమాల శైలి

కిరీటం & పూలమాల శైలి

మీ పెళ్లి అపుడు చాలా పెద్ద, అందమైన కేశాలంకరణ అవసరం. ఇది ఆ సమయానికి పరిపూర్ణమైన అందాన్ని ఇస్తుంది. మీ జుట్టు మధ్యలో ఒక కిరీటాన్ని ధరించండి రాచరికపు ఆకృతి వస్తుంది. పొదవుగా జుట్టు అల్లి, పొడవైన పూల దండలు, ఇతర ఆభరణాలతో అలంకరించండి.

కొద్దిగా మెలితిప్పండి

కొద్దిగా మెలితిప్పండి

మీ జుట్టు పొట్టిగా లేదా తక్కువ పొడవు ఉంటె మీరు ఏమి చేస్తారు? జుట్టును ఒక పక్కకు తీసి, అక్కడ రాయితో కూడిన జుట్టు ఆభరణాన్ని ధరించి, జుట్టును వదిలేయండి. మీ జుట్టు చివర్లు రింగులు తిప్పడం మర్చిపోకండి. దీనివల్ల మీ జుట్టు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది.

English summary

6 Best Hair Styles For Indian Women

Dusky complexion with large dark eyes, fuller lips and long black hair- if you think of Indian woman, this is the image that you will get even at closed eyes.
Story first published: Monday, May 4, 2015, 18:16 [IST]
Desktop Bottom Promotion